కవితా స్రవంతి

ఓటు నీ సిఫార్సులేఖ

– శ్రీ గాదిరాజు మధుసూదన రాజు

తెల్లారకముందేచీకట్లోలేచి
ఇంట్లోంచి బయల్దేరి..
ఎక్కడుంటారో
ఎప్పుడుంటారో
ఎలావుంటారో కనుక్కుంటూ

బతుకుబాగుచేసుకునేందుకు
సాయాలూ సిఫార్సులేవో
చేస్తారని ఆశిస్తూ కలలుగంటూ

ఎమ్మెల్యే మంత్రీ సియం
యంపీ పియమ్ముల కలవాలంటూ

రేయింబగళ్ళూ
పడిగాపులుకాచావునీవు!

వాళ్ళంతా కట్టకట్టుకుని
ఆ పదవులు అందుకునేందుకు
నీ ఓటుసిఫార్సు కోసం
నీ వద్దకు వస్తున్నారు

ఆలోచించుకో
గుర్తుకు తెచ్చుకో
కనీసంనిన్ను ఓటరుగాగుర్తించిన వారెవరో

ఒక్కవోటుతో నేనేంచేస్తా ననిధైర్యం వీడకు
ఒక్కొక్కచుక్కకలిస్తేనే సముద్రం అయ్యిందికడకు

ఓటు నీ సిఫార్సులేఖ
ఎవరికిస్తావో నీ ఇష్టం
నీ అనుభవాలను క్రోడీకరించు
నీ తెలివినంతా చూపించు
వోటేసి మంచిని గెలిపించు

భవిష్యన్నిర్ణేతవై నీ సత్తాచూపించు
నీకు నచ్చిన నేతలతో నీ పాలన సాగించు
నిజమైన ప్రజా స్వామ్యాన్ని నీ వోటుతో స్థాపించు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked