కవితా స్రవంతి

చిటపట చినుకులతో

– భువనగిరి వేంకట సుబ్రహ్మణ్య ప్రసాద్

ఆ కురిసే వానలో తడవాలని నాకుంది !
వాన వాన వల్లప్పా పాడలని నాకుంది !
వాన నీటి గుంతలో గెంతాలని నాకుంది !
కాగితపు పడవల తొ అడాలని నాకుంది !

చిటపట చినుకులతో
చిందులు వేయాలని నాకుంది !

విరిసిన హరివిల్లు ఎక్కాలని నాకుంది !
మెరిసే మెరుపులతో ఎగరాలని నాకుంది !
గొడుగులతో వానలో తిరగాలని నాకుంది !
ఉరుములతో గొంతు కలిపి అరవాలని నాకుంది !

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked