కవితా స్రవంతి

జీవితం

– అభిరామ్ ఆదోని


జీవితమంటేనే
కలల సాగర కడలి
ఆ కడలి కదలిక పై
రెండు మనసులు ఏకమై
కష్ట సుఖాల్లో మమేకమై
ఒకే మాటల తెడ్డు పట్టి
ఒకరికొకరు వెన్నుతట్టి
ఆశల అలలకు ఆగకుండా
కోరికల కెరటాలకు చిక్కకుండా
సంసార పడవను ముందుకు నెట్టినపుడే
ఆ వంశ వృక్షంలో
మొలకెత్తే అంకురం
వెండి గిన్నెలో బంగారమై
భద్రంగా ఎదుగుతుంది
జీవన పరమార్ధము
తెలుస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked