కవితా స్రవంతి

తండ్రి

-అన్నసముద్రం శ్రీదేవి

చిట్టి వేలితో గుట్ట నెట్లాఎత్తావయ్యా అన్నా
మిమ్మల్ని పైకి తెచ్చిన మీ తండ్రి నడగమన్నాడు

గురితప్పని రామబాణం రహస్య మేమిటన్నా
మీ లక్ష్య సాధనలో విలుకాడు నడగమన్నాడు

గండ్ర గొడ్డలిలోని గొప్పేమిటన్నా
తండ్రి తోడు గ ఉంటే తెలియదన్నాడు

కాళింది పైన ఆ తాండవమేమిటి అన్నా
కష్టాల తోటి నాన్న దోస్తీ చూడమన్నాడు

సారథి గా నీవిచ్చిన సారమేమిటన్నాను
నీ జనకుని మాటలను నెమరువేయమన్నాడు

అంత గొప్ప తనముందా నాన్న లోన అన్నాను
అన్ని ప్రశ్నలకు అయ్యే నా బదులన్నా
అయ్య మాటతో నే అట అయ్యాడొక దైవంగా
అయ్యొ మరి నేనే కద నా బదులుగ పంపాను
అన్ని అవతారాల అంశ అందున కలదన్నాడు

(Happy Fathers Day)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked