కవితా స్రవంతి

మహాకాలదేవా

…నాగలక్ష్మి N.భోగరాజు.

మహాకాలదేవా – అమేయ ప్రభావా
అవంతీనివాసా – అహో భక్తపాలా

నిత్య నూతనము నీదు దర్శనము
నిన్ను చూచుటే నాకు భాగ్యము
ఎన్నబోకయా నాదు నేరము
నన్ను బ్రోవుమా నాగభూషణా ||మ||

మహాకాళియే కన్నతల్లిగా
హరసిద్ధిమాతయే కల్పవల్లిగా
కాలభైరవుడు కరుణ చూపగా
వెలసినారయా మమ్ము బ్రోవగా ||మ||

మంగళకరమౌ నీదు రూపమూ
తొలగించునుగా మహాపాపమూ
భస్మహారతది అత్యద్భుతమూ
తిలకించిన మా జన్మ ధన్యమూ || మ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked