సుజననీయం

వికారి ఉగాది

– తాటిపాముల మృత్యుంజయుడు

తెలుగు సంవత్సరాల పేర్లలో కొన్ని వినగానే మంచి భావనను కలిగించకపోవచ్చు. వికృతి, రాక్షస, దుర్మతి పేర్లలాగానే మనకు రాబోయే సంవత్సరం ‘వికారి ‘ అదే కోవకు చెందుతుంది. కాని పండితులు, భాషావేత్తలు ఆ పదాలకు మూలాలు వెదికి మనకు సంతోషం కలిగించే అర్థాలు చెబుతారు. ఈ సందర్భంగా అచ్చ తెలుగు అవధాని డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు రాసిన తేటగీతి చదవండి.

దేవభాష ‘వికారమే’ తెలుగు ‘మార్పు ‘
మార్పులొప్ప ‘వికారి ‘ నామంబు వచ్చె
భయమదేటికి? నీ పేరు బాగు బాగు
మంచి మార్పులు తెమ్ము సేమమ్ము నిమ్ము

వారు రాసిన ఇతర పద్యాలతో, ఇతర కవుల కవితలతో, నవ్వించే కార్టూన్లతో ఉగాది ప్రత్యేక సంచిక ఉగాదినాడు విడుదల అవుతుంది. ఆ సంచికను అంతర్జాలంలో కూడా ఉంచబడుతుంది. వివరాలకై వేచివుండండి.

శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాభినందనలతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked