ధారావాహికలు

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

లక్ష్మణమూర్ఛ

తరువాత రావణుడి చేతిలో ఉన్న మహాధనుస్సును బాణప్రయోగంతో ముక్కలు చేశాడు లక్ష్మణుడు. మహావేగంతో రథం మీది నుంచి కిందికి దూకి శక్యాయుధాన్ని విభీషణుడి మీదికి విసరివేశాడు రావణుడు. ఆ శక్త్యాయుధం విభీషణుణ్ణి తాకే లోపునే లక్ష్మణుడు మూడుబాణాలతో ఆశక్త్యాయుధాన్ని నిర్వీర్యం చేశాడు. అది మూడుముకలైంది మరొక ప్రబలాతిప్రబలమైన శక్త్యాయుధాన్ని దేవేంద్రుడి వజ్రాయుధంలాంటిదాన్ని యమదండం వంటిదాన్ని విభీషణుడిపైకి విసరబోతున్నాడు రావణుడు. విభీషణుడి ప్రాణా పాయకారస్థితి చూసి లక్ష్మణుడు అడ్డుపడ్డాడు. రావణుడిపై సందులేకుండా లక్ష్మణుడు శరప్రయోగం చేస్తుంటే, రావణుడు శక్త్యాయుధాన్ని లక్ష్మణుడిపై ప్రయోగించాడు. అది లక్ష్మణుడు పైకి వచ్చి పైబడపోతుండగా రాముడు దానినీ కట్టడి చేయబోయే లోపలనే లక్ష్మణుడి వక్షస్థలాన్ని తీవ్రంగా తాకింది. ఆదెబ్బకు లక్ష్మణుడు కిందపడి మూర్చిల్లాడు.

దగ్గరలోనే ఉన్న రాముడు లక్ష్మణుడి దుఃస్థితి చూశాడు. ఇప్పుడు దుఃఖపడుతూ లక్ష్మణుడికి ఉపచరించటం కన్నా రావణుడ్డి తుద ముట్టించటమే అవశ్యకర్తవ్యం అనుకున్నాడు. లక్ష్మణుడికి గుచ్చుకున్న శక్త్యాయుధాన్ని వానరులు పెరికివేయడానికి ప్రయత్నించారు కాని, రావణుడి బాణాలు పుంఖానుపుంఖంగా తమమీద వడుతున్నందువల్ల వాళ్ళు విఫలప్రయత్నులైనారు. మహా శక్త్యాయుదాన్ని మతపరాక్రముడు రాముడు పట్టుకుని పైకి లాగి విరచివేశాడు. అదే అద ననుకొని రావణాసురుడు రాముడిపై శరీరం నిండా బాణాలు గుప్పించాడు. ఆయువుపట్లలో గుచ్చుకుంటున్న ఆ శరాలను ఏమాత్రం లక్ష్యం చేయకుండా లక్ష్మణుణ్ణి కౌగిలించుకొని “ఉండండి. నేను రావణాసురుడితో పోరాడి వాణ్ణి హతమారుస్తాను” అని అక్కడి వానరులకు

చెప్పి శ్రీరాముడు యుద్ధసన్నద్దుడైనాడు.

ఎన్నో దుఃఖాలపాలు అయినా ఎంతో ఓర్మితో సహించాను నేను కాని ఈ లక్ష్మణుడు ఇట్లా పడిపోవటం నాకు ఇంతింతనరాని దుఃఖం కలిగిస్తున్నది. లక్ష్మణుడికి ఆపద రావడంవల్ల నేను చేసిన సమస్త ప్రయతాలూ వ్యర్థమైనట్లే అనిపిస్తున్నది. ఈ రావణుడ్డి హతమారిస్తే కాని నా యీ మిగిలిన ప్రయత్నం పూర్తి కాదు’అని చెపుతూ రాముడు పుంఖానుపుంఖంగా రావణుడిపై బాణప్రయోగం చేశాడు. రావణుడు కూడా ఎడతెగకుండా శరప్రయోగం చేశాడు. అవి పరస్పరం ఘర్షిస్తూ ఉంటే ఆకాశంలో తుమలమైన మహారవం చెలరేగింది. రాముడి బాణప్రయోగం ముందు రావణుడు నిలవలేకపోయినాడు. గొప్పగాలికి కొట్టుకొనిపోయే మేఘంలా తడబడ్డాడు.

రాముడప్పుడు లక్ష్మణుడికి చికిత్స చేసి తనదుఃఖాన్ని తీర్చవలసిందిగా సుషేణున్ని కోరాడు. నేను లక్ష్మణుణ్ణి ఎట్లా చూస్తూ యుద్ధం చేయలేలినని పరితపించారు. నాకు సుషేణున్ని కోరాడు. నేను లక్ష్మణుణ్ణి ఎట్లా చూస్తూ యుద్ధం చేయలేలినని పరితపించారు. ఇప్పుడు నా ప్రాణాలే విసర్జించాలని అనిపిస్తుంది. నాకు యుద్ధంతో పనిలేదు అనిపిస్తుంది. తమ్ముడే లేకపోతే నేను చేయడమెందుకు? ఆ తరువాత రాజ్యం ఎందుకు?

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ భాంధవః,

తం తూ దేశ నా పశ్యామి యాత్ర బ్రాత్ర సహోదరః.

దేశదేశాలలో కావాలంటే ఎక్కడైనా భార్య లభిస్తుంది. బంధువులూ లభిస్తారు.కానీ ఏరకంగా చూసినా తమ్ముడు లభిస్తాడా? అని రాముడు లక్ష్మణుడి అచేత తలచుకొని అక్కడే కూర్చుండిపోయినాడు. అప్పుడు సుషేణుడు,”లక్ష్మణుడు విగత జీవుడు కాలేదు. శాస్త్రాఘాతం వల్ల మూర్చపోయినాడు.లక్ష్మణుడి ముఖంలో కళ తప్పలేదు శరీరచైతన్యానికి ఏమీ హాని సంభవించలేదు. నిటూర్పులు విడుస్తున్నాడు లక్ష్మణుడు చూడు” అని రాముడికి సుషేణుడు ఊరటకలిగించాడు.
సుషేణుడప్పుడు  హనుమంతుణ్ణి చూసి “నాయనా! ఇదివరలో నీకు జాంబవంతుడు చెప్పిన ఓషధిపర్వతాన్ని ఇపక్ష్యా తీసుకొని రా! విశల్యకరణి, సువర్ణకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఈ నాలు మూలికలు శ్రీఘ్రంగా తీసుకొనిరా” అని అర్ధించాడు. ఆలస్యమెందుకని ఆపర్వత శిఖరాన్నిపెకలించుకుని తెచ్చాడు హనుమంతుడు.

ఒక మూలికను బాగా నలిపి సుషేణుడు లక్ష్మణుడికి వాసన చూపించగా లక్ష్మణుడు తేరుకున్నాడు. వానరులంతా ఎంతగానో ఉత్సాహం చెందారు, సంతోషపడ్డారు. రాముడి పరితాపం చూసి లక్ష్మణుడు ఎంతో దుఃఖం పొందాడు. అన్నను కౌగిలించుకొని ‘అన్నా సత్యపరాక్రముడివైన నీవు విభీషణుడ్డి లంకారాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తానన్న శపథం నెరవేర్చటానికి సమయం ఆసన్నమైంది. ఆ సత్యప్రతిజ్ఞను చెల్లించు’ అని ఇంపగా రాముడికి చెప్పాడు. ‘రావణుడ్డి సంహరించి సీతాదేవిని తెచ్చుకొని నీ ప్రతిజ్ఞను కూడా నిజం చెయ్యి అని ఉత్సాహపరిచాడు. అప్పడు రాముడు ఉత్సాహంతో రావణుడిపై అతితీవ్రబాణాలు ప్రయోగించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked