కవితా స్రవంతి

స్త్రీ జాతి

(డాǁ. దోముడాల ప్రమోద్,సంస్కృతి సమితి, అల్మాస్ గూడ, హైదరాబాద్)

స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి |
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి ||

సృష్టికి మూలం సర్వ శ్రేష్టి స్త్రీ |
వంశాభివృద్ధికీ మూలం సర్వాంతర్యామి స్త్రీ ||
సంసారానికి మూలం సర్వ శక్తి స్త్రీ |
సుఖ సంతోషాలకు మూలం స్వర్ణ సుందరి స్త్రీ ||

స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి |
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి ||

ఇల్లును కళకళలాడించేది అమ్మాయీ |
సోదరులను కలిపి ఉండేది సోదరి ||
తల్లితండ్రులను కాపాడేది కూతురు |
అందరికీ ఆనందము పంచేది వనిత ||

స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన స్త్రీ జాతి |
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి ||

కల్యాణానికి కావలసింది కన్య |
ఉత్సవాలకు మంగళం నిచ్చేది మహిళ |
పెళ్ళికి అందం పెళ్ళికూతురు |
వరుణికి ఆనందం వధువు |
అందరికీ సంతోష మిచ్చేది మగువ ||

స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి |
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి ||

పిల్లలను ప్రేమించేది తల్లి |
భర్తకు అనురాగం నిచ్చేది భార్య |
అత్త మామలను గౌరవించేది కోడలు |
కష్టసుఖాల్లో తోడు నిచ్చేది భార్య |
ఇంటికి వెలుగు ఇల్లాలు ||

స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇది మన స్త్రీ జాతి |
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి |
స్త్రీ జాతి, స్త్రీ జాతి, ఇదే మన గొప్ప స్త్రీ జాతి  స్త్రీ జాతి ||

********

ఈ స్త్రీ జాతి గీతo ను ” స్వర్గీయ దోముడాల సునoద ” గారి కి అoకితo చేయబడినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked