ధారావాహికలు

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం ఏప్రిల్ 2020

”మగవాళ్ళకి చాటుగానూ
ఆడవాళ్ళకి పబ్లిగ్గాను
రుచించని మాట చెప్పనా
మగకీ ఆడకీ
శీలాన్ని ఆస్తినీ
సమంగా వర్తింపించండి
కాగితాల మీదా వేదికల మీదా కాదు
నిజంగా సమంగా వర్తింపించండి”.

స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని మాటల్లోనూ, కాగితాల్ల్లోనూ కాకుండా ఆచరణలో చూపించమని
రేవతీదేవిగారు సమాజాన్ని అర్థిస్తున్నారు. అంతేకాదు, కేవలం స్త్రీ పురుషుల మధ్య ఆస్తిలోనే కాక ,
శీలంలోనూ సమానత్వాని కావాలని ఆంకాంక్షించారు. సమాజానికి ఇద్దరూ భాగ స్వాములే కాబట్టి ఇద్దరికీ
సమాన న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. సమాజంలో ఉన్న పురుషాధిక్యాని గుర్తించి, తన కవిత్వం
ద్వారా సమాజానికి అందించటానికి ప్రయత్నించారు . సమానమైన న్యాయం లేనందున
స్త్రీ మగవాడి చేతిలో ఆటబొమ్మగా మారవలసి వస్తోందని ఈవిడ ఆవేదన.
”పురుషుడికి
అపారమైన
శక్తి సామర్థ్యాలున్నాయి
అందచందాలు ఉన్నాయి
తెలివితేటలున్నాయి
అవన్ని పురుషుడికి
తల్లిగా ప్రేయసిగా
స్త్రీ ఇస్తుంది
అన్నీ ఇచ్చి చివరికి మాగాడి చేతిలో ఆటబొమ్మవుతుంది.”
ఈవిడ రాసిన శిలాలోలితలో ఇవేకాక, ‘అనురాగాదగ్ద సమాధి,’ ‘దిగులు’, ‘నిష్క్రమణ’, ‘అనాదరణ ,’
‘శిలాలోలిత’, ‘హృచ్చితి,’ – మొదలైన ఖండికలు ఆవిడలోని ఆవేదనను తెలియచేస్తాయి.

”నాలుగురాడాళ్ళు సూర్యశిశువును
ఒక పిల్లాడితో ఎన్ని విధాలుగా
ఎన్ని రకాలుగా ఆడుకోవచునో ఎగరేసి పట్టుకున్నాయో
లెక్కేసి చెప్పగలవా ? చెప్పుచూద్దాం
సరి, ఇది చెప్పు ఈ
ఉదయాలు అందానికి
ఆనందానికీ
అంతెక్కడ?”

ఈ కవితలో ఇస్మాయిల్ సూర్యోదయాన్ని గురుంచి కొత్త అనుభూతిని చెంది, దాన్ని వ్యక్తపరిచారు. సూర్యశిశువును ఏవిదంగా ఉదయాలు పట్టుకుంటాయో, ఎలా గణించలేమో ఆ విధంగానే పిల్లలతోటి ఎన్ని రకాలుగానైనా ఆడుకోవచ్చనే వాస్తవాన్ని ఈయన కవితలో ప్రతి ప్రతిఫలింప చేశారు.

ఇంతే కాకుండా, వీరు రాసిన కవితలలో ‘స్వేచ్ఛాగానం’ ‘చెట్టు నా ఆదర్శం’, ‘మనిషీ మనిషీ’, ‘వానవచ్చిన మధ్యాహ్నం,’మృత్యు రక్షం’, ‘ఆత్మహత్య’, ‘బావి’, ‘చేతులు తేగాక’, ‘చిగిర్చి చెట్టు’, ‘హాస్పిటల్లో ప్రేమ’,’రికార్డు’, ‘కవిత్వం’, ‘గోడ.’ ‘ఈవిడ’, ‘పాట’, ‘కావ్యయోని,’ ‘మా ఆవిడ,’ ‘నా సైకిలు’, ‘తుఫాన్’, ‘కవిత్వం భిక్షాందేహి’, ‘స్వారీ’, ‘పార్టీ (గా) మహాసభ’, ‘పద్యసమాధి’, ‘పికాసో’, Boulevard of Paris, ‘ రైలు గేటు’, ‘హృదయభక్షి,’ చార్లీ చాప్లిన్, మార్కిస్టు మిత్రునికి’- మొదలైనవి అనుభూతిని వెలారుస్తాయి.

ఇష్మాయిల్ గారిలో భావుకత ఎక్కువుగా కనిపిస్తుంది వీరు ఇస్మాయిల్ గ కన్నా ‘చెట్టుకవి’ గా సుప్రసిద్ధులు చెట్టు నిత్యం కొత్తదనాన్ని ఎలా కలిగి ఉంటుందో. ఆవిధంగానే వీరి కవిత్వం కూడా నిత్యనూతనత్వాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా వీరి కవితా జీవితంలో కనిపించే చిన్న చిన్న వస్తువులే అయి ఉంటాయి. ఒక్కొక్క సారి వీరి కవితల్లో కొన్ని వస్తువుల పట్ల వీరికి ‘Obesession’ కనిపించటం కుడా జరుగుతుంది.

పూర్వకాలంలో స్త్రీలు చాల తక్కువగానే రచనలు చేసారని చెప్పుకోవచ్చు. మొల్ల, బసవరాజు రాజ్య
లక్ష్మి గారు, తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు మొదలైనవారు రచనలు చేసారు. వీరు కవిత్వప్రధానమైన
రచనలు చేశారు. రాను రానూ స్రీలు ఎక్కువగా కాల్పనిక ప్రపంచంలో జీవించటం మొదలుపెట్టి , నవలా
సాహిత్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కవిత్వం ప్రక్రియ చాల తక్కువమంది చేపట్టటం జరిగినా,
వారు తమ తమ వ్యక్తిగత విషయాలని కుడా కవిత్వికరించటం చేశారు. ప్రస్తుతం ఎక్కువగా ఇటువంటి
కవిత్వం వస్తోంది. వీరు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవటానికి ఉద్యమ రూపం దాల్చి ఈ
కవితలను రాస్తున్నట్లుగా మనం గ్రహించవచ్చు. 1980 నుంచీ ఎటువంటి నిర్భంధాలకి, బిడియాలకి లోను
కాకుండా కవయిత్రులు తమ రచనల్లో నూతన దృక్పథాన్ని వెలువరుస్తున్నారు. దీని విమర్శకులనేకులు
‘స్త్రీవాద కవిత్వం’ అని కుడా పిలుస్తున్నారు. వీరిలో ముఖ్యులని ‘స్త్రీ వాద కవిత్వం’ అని కుడా పిలుస్తున్నారు. వీరిలో ముఖ్యులని చెప్పుకోదగ్గవారు రేవతీదేవి, జయప్రభ, కొండేపూడి నిర్మల, ఈశ్వరి, విమల మొదలైనవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked