ధారావాహికలు

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

వీరిదే మరొక కవితా సంకలనం “అనుభూతి గీతాలు” కవి అనుభూతే వస్తువుగా వెలసిన అనుభూతి కావ్యం ఇది. అనుభూతి వాదాన్ని సిద్దాంతం గా ప్రతిపాదించిన శ్రీ కాంతశర్మగారు, ఆ సిద్దాంతానికి అనుగుణంగా రచించిన కవితా సంకలనం ఇది. ఏ ఇజానికీ కట్టుబడకుండా, తనలో కల్గిన అనుభూతులకి అకారాన్నిస్తారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.
“లోకంలో బుతువుడు ఆరైతే,

నీలో ప్రతి అనుభవం ఒక బుతువే!

నీలో ఇరుక్కున్న ప్రపంచం

బయటపడాలనుకుంటుంది.
బయతునున్న ప్రపంచం
నీలో జొరబడాలనుకుంటుంది,
ఇది చిరఘర్షణ -“38

‘దుఃఖం’ అనే ఖండికలో జీవితంలో చిర ఘర్షణకి కారణం చెప్పారు.

“స్వాతి వాన కోనం

ముత్యపు చిప్పల్లా

నిరంతరం నీ కళ్ళు కాచుకొని వుంది,
అనుభవాల లోకాలోకనం చేస్తూ

ఊగిసలాడుతుంటాయి –
బ్రతుకంతా
ఏదో సడి, తడి,
అలజడి-
వువ్వు గుర్తించలేనంత
సున్నితంగా
ఒకప్పుడు
ఒళ్లు జలదరిస్తుంది-
ఒకానొక అనుభవం
నీలో ఘనీభావించే
మౌక్తిక క్షణమది-
అప్పుడు నువ్వు
కాళిదాసువి
తాన్ సేన్ వి
మైకేలేంజెలోవి – “39

కళాకారుడికి కావలసిన అనుభూతి చాలా సున్నితంగా, గుర్తించలేనంత సున్నితంగా జరుగుతుంది. ఆ
అనుభవం కలిగినప్పుడు అతడు నిజమైన కళాకారుడు కాగలడని “స్పర్శ” ద్వారా తెలుసుకోగలం. ఇవేకాక,
“కెలెడాస్కోప్’, “పటకుటీరం’, ‘గది’, ‘లోయ’, ‘ప్రేమానికి గొళ్ళెం తీస్తే’, ‘స్పర్శ’, ‘స్వప్నగీత’, జ్ఞాపకం
మొదలైనవి మంచి అనుభూతిని అందించగలవు.

వీరిదే మరో కవితా సంకలనం “నిశ్శబ్దం గమ్యం”. ఈ కావ్యంలో ఎక్కువగా కాల్పనిక లక్షణాలు
కన్పిస్తాయి.

అరిపిరాల విశ్వంగారు అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చిన కవి. అంతేకాదు అంతర్ముఖుడైన
కవి. వీరు రచించినవి ‘నిదురకన్నెలు’, ‘కాలం గీస్తున్న గీతలు’, ‘రేపటి స్వర్గం’, ‘మనస్’.

కవితా స్వభావం అనుభూతి అనే పంథాలో వెలువడిన వచన కవిత ‘నిదురకన్నెలు’.

“నాలో లేనిదానికి రూపానివి నీవు

నాలో ఉన్నదానికి హృదయానివి నీవు
చూవంచటం తవ్ప చూచుట యెఱుగని
పలికించటం తప్ప పలుకుట యెఱుగని
అనుభూతి నివ్వటం తప్ప అనుభూతి నెఱుగని
నీవు వచ్చిన యీవేళ
నీ కిచ్చేందుకేముంది నా దగ్గఱ” 40
‘స్వప్ననేత్రం’ అనే ఖండికలో విశ్వంగారిలో కాల్పనికి లక్షణాలు గోచరిస్తున్నాయి. ఈ సంకలనంలో

‘నిదురకన్నెలు’, ‘మ్రోగానిపాట’, ‘నీవు రావు’ అనే ఖండికలు అనుభూతిని అందిసాయి.

వీరిదే మరో కవితా ‘ సంకలనం ‘కాలం గీస్తున్న గీతలు’, ఇది వదన కవితా ప్రక్రియలో వెలసీనదే కాకుండా జీవన తత్వాన్ని వెలార్చిన అనుభూతి ప్రధానకావ్యం. ‘జీవితానికీ అవతలి ప్రక్కన’, , వివధగీతం” మొదలైనవి
ఇందులోని కొన్ని కవితాఖండికలు.

వీరి మరో కవితా సంకలనం “రేవటి స్వర్గం’, ఇందులో

విశ్వంగారు తాత్వికమైన అనుభూతికి ప్రాధాన్యాన్ని కల్పించటం జరిగింది. ‘తెగిన అనుభూతుల తీగలు’, ‘నన్ను మర్చిపో’, ‘మరచిన జ్ఞాపకం’ మొదలైనవి ఇందులోని
కొన్ని ఖండికలు,

విశ్వంగారే “ఎక్కడో పారేసుకొన్న – “వెనకటి జన్మల్ని పిలిచి వెతుక్కొన్న జ్ఞాప కాలివి, ఎక్కడో విసి
రేసుకొన్న – మునుపటి అనుభూతుల్ని కలిపి గుచ్చుకొన్న ముత్యాలదండలివి, నేటి యాతన అంచున
విరిసిన మెరపుతీగ ‘రేపటి స్వర్గపు’

బొమ్మ ఇది”41 అని తన కావ్యం గురించి చెప్పుకున్నారు.

‘రేపటి స్వర్గం’ అనే ఖండికలో

“నాకీచ్చిన జీవితం చాలు

నాకీ అదృష్టం చాలు

ఇదంతా నీ దయ” 42 – అని అంటూ భగవంతుడిపై అతడికి గల ప్రగాడ విశ్వాసాన్ని ప్రకటించుకొంటాడు.

వీరి ‘మనస్’ లో జీవిత పరిణామక్రమంలో వీరికి కలిగిన తాత్వికతను మరింతగా తెలుపుతుంది. దీవిలో

వీరు మార్మికతను ఎక్కువగా చూపారు. కాల్పనిక మార్మిక చైతన్యాలను జీవచైతన్య ‘ప్రవృత్తితో వీరు వీరి
రచనలను చేసినట్లు మనం గమనించవచ్చు.

“భయాల చీకటిలో వట్టుబడిపోయాను

నా ఏకాంతవు గువాలో దిగులుతో మిగిలిపోయాను

పిలవకుండా వచ్చిన అతిథివి

నీ అంతట నీవే వెదుక్కుంటూ వచ్చావు

కళ్ళల్లో కడలేని నృష్ణి సౌందర్యాన్ని కురిపించావు

ఎవ్పుటీకీ నా కంటి వెలుగులా నిలిచిపో

నీలాంటి ఒకరిని నేనింతవరకూ చూడలేదు.”43

ఒంటరిగా ఎంతకాలం జీవించినా ఆ జీవితం అంతా దిగులుగానే ఉంటుంది. కానీ భగవంతుడు తనంతట తానుగా వెతుక్కొని వచ్చి, తనకి
సృష్టిసౌందర్యాన్ని చూపించాడని కవిభావన. భగవద్భక్తీ వల్ల జీవిత రహస్యం బోధపడుతుందనే అభిప్రాయం పై వాక్యాలవల్ల తెలుస్తోంది.

విశ్వంగారి కవితా సంకలనాలను చదువుతున్నప్పుడు వారిలో అవ్యక్తంగా ఉన్న వేదాల, ఉపనిషత్తుల సారంశం వ్యక్తం అవుతూ ఉంటుంది. కల్పానికి మార్మిక చైతన్యాలతో వారి తాత్వికతను జివచైతన్య ప్రవృత్తిని పరిపుష్టం చేసిన కవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked