ధారావాహికలు

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

మనిషి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అబ్రహం మాస్లో (Abraham Maslow) ప్రతిపాదించిన సిద్ధాంతమే ఆత్మ ప్రస్థాపన సిద్ధాంతం (Self-actualization). మనిషి కనీసావసరస్థాయి నుంచి ఉత్తమస్థాయి వరకు తీసుకుని వెళ్లేదే ఈ ఆత్మ ప్రస్థాపన సిద్ధాంతం. పంచకోశాలైన అన్నమయకోశం నుండి ఆనందమయకోశం వరకు మనిషి అనుభూతి ఏవిధంగా ఉత్తమస్థాయి దాకా అంచెలంచెలుగా సాగిందో దాదాపు ఆ విధంగానే ఈ సిద్ధాంతం సాగింది.

Self-actualization

Esteem Needs

Belongingness and Love needs

Safety Needs

Physiological Needs

శారీరక అవసరాలు (Physiological Needs) – ఆహారం, నీరు, సెక్స్ ,ఓడలైన వాటిని శారీరక అవసరాలుగా గురించాడు.
భద్రత, స్థిరత్వం, క్రమబద్ధం మొదలైనవి రక్షణావసరాలు (Safety Needs).
ఆదరణ, కలయిక, తదాత్మ్యీకరణం మొదలైనవి ప్రేమకు సంబంధించిన అవసరాలు (Belonging and Love Needs).
ఖ్యాతి, జయం, ఆత్మగౌరవం మొదలైనవి గౌరవ అవసరాలు (Esteem Needs).
“A musician must make music, as an artist must Paint, a poet must write if he is ultimately to be at peace with himself. What a man can be he must be. This need we may call self-actualization.”

మాస్లో సిద్ధాంతం ప్రకారం మానవుడి భౌతిక అవసరాలనుంచే ఆత్మవైపు ప్రస్థానం సాగింది. కానీ పంచకోశాల వలె సంపూర్ణం కాదు. పంచకోశాలు వ్యక్తి సమగ్రానుభూతికి దోహదకారులు. మాస్లో పేర్కొన్న అవసరాలు మనిషి అవసరాలపైనే ఆధారపడి ఉంటాయి. కానీ వారి అనుభవం మీద కాదు.
మానవుడిని కేవలం భౌతిక పదార్థ జీవిగానే చూడరాదు. అతడికి ఈ భౌతిక జీవితం ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమైంది ఆధ్యాత్మిక జీవితం. ఈ జీవితం ద్వారా మనిషి మనిషిగా గుర్తింపబడతాడు. అంతర్గతంగా ఉన్న శక్తుల్లను ఆధ్యాత్మిక చింతన వల్ల గుర్తించి అనుభవం ద్వారా తెలుసుకొని పరిపూర్ణ మానవుడిగా అవతరిస్తాడు.
ఆధునిక కాలంలో మానవుడు యాంత్రిక జీవిగా మారాడు. రానురానూ తన యాంత్రిక యుగంపై అతనికే విరక్తి కలుగుతోంది. అతడిలో ఉన్న జీవుడికి తీవ్రమైన అసంతృప్తి కలుగుతోంది. తద్వారా తన వికాసం, పరిపూర్ణ మానవుడిగా తన స్థానం కోసం పరితపిస్తున్నాడు ఈ ఆధునిక మానవుడు.
మానవత్వం దివ్యత్వానికి పీఠం. మానవతావాదానికి ఆధారం ప్రేమ. మానవుడు తనలో ఉన్న స్వార్థ గుణాన్ని విడిచి, విశ్వమానవ ప్రేమను అందుకోవాలి. స్వార్థ గుణాన్ని వీడటం వల్ల జగత్తంతా ఒకటే అనే భావన వస్తుంది. విశ్వమానవ ప్రేమను భగవంతుడిపై కాక తోటి మానవుడిపై చూపమన్నారు రవీంద్రుడు.
వివేకానందుడు ప్రాచ్యపాశ్చాత్య విజ్ఞాన ఖని. భారతదేశ భవిష్యత్తు ఆధ్యాత్మిక చింతన మీదే ఆధారపడి ఉందని తెల్పాడు.
“విజ్ఞాన శాస్త్రాలు భౌతిక ప్రపంచంలోని సూత్రాలను గ్రహించటానికి అన్వేషిస్తున్నట్లుగానే, మతం మానవునిలో అంతర్గతంగా ఉన్న అతి భౌతిక సూత్రాల నన్వేశిస్తుంది. రెండూ సమైక్యాన్ని అన్వేషిస్తున్నాయి. అయితే మార్గాలలో మార్పు కన్పిస్తుంది. రెండూ వ్యక్తికీ, జాతికీ విముక్తిని ప్రసాదించడానికే ప్రయత్నిస్తాయి. అయితే ఒకటి అనుభవం మీద, అనుభవిక విధానం మీద ఆధారపడితే, రెండోది దానిని అధిగమించిన యౌగికానుభావం, యౌగిక దృష్టి మీద ఆధారపడుతుంది. మతము భౌతిక పదార్థాల మాటున ఉన్న పారమార్థిక విలువలను గ్రహిస్తుంది. ఒక దృష్టి నుంచి విజ్ఞాన మంతా మతమే. ఇంకొక దృష్టి నుండి అది శాస్త్రీయ విజ్ఞానము. ఈ విధంగా వివేకానందుడు మతానుభవం అనుభూవాతీతం కాదని నిరూపించటానికి ప్రయత్నించాడు.”

 

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked