ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

తొలిమెట్టు అని భావిస్తోంది. వ్యక్తి వ్యక్తిని వ్యక్తిగా గుర్తించటం నేర్చుకోవాలి. మానవ అంతర్వికాసం భౌతిక దృక్పథం వల్ల కలగదు. ఆధ్యాత్మికంగా మనిషి పురోభివృద్ధి చెందినప్పుడే మానవుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు.
మానవుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించాలనే విషయం ఇప్పుడిప్పుడే అన్ని దేశాలవారూ గ్రహిస్తున్నారు. భారతదేశం ఆధ్యాత్మింగా సుసంపన్నదేశం. ప్రాచీన కాలంలోనే ఆధ్యాత్మిక దృష్టిని అలవరచుకొని ప్రతి మనిషి అంతర్వికాసాన్నీ, వ్యక్తి విలువలను కలిగి ఉన్నాడు. రాను రానూ పాశ్చాత్య ప్రభావం వల్ల దేశంలో అన్ని వేదమాతను వీడిపరప్రదేశం పట్ల ఆకర్షితుడయ్యాడు.
పాశ్చాత్యులు మనిషిని బాహ్యంగానే వికసింప చేయగలిగారు కానీ అంతరంగికమైన వికాసానికి ఏమాత్రం కృషి చేయలేదు. వారు మనిషిని కేవలం సాంఘిక జంతువు (Social being)గానో, రాజకీయ జంతువు (Political being)గానో, ఆర్ధికజీవి (Economic being)గానో చూశారు. అంతేకాని వారి పరిధులను అధిగమించి మానవ అంతర్వికాసానికి తోడ్పడే ఆధ్యాత్మిక చింతన కోసం ఏనాడూ ఆలోచించలేదు. వారు బుద్ధజీవులుగానే వసించారు కానీ మనోజీవులుగా ఎదగలేక పోయారు. ప్రతి విషయాన్నీ తార్కికబుద్ధికి గురిచేస్తూ మనసుని సంకోచింప చేశారు.
భారతదేశంలో తార్కిక బుద్ధికన్న్నా అనుభవ స్ఫూర్తి ఎక్కువ. వారు ప్రతిదాన్నీ అనుభవించి ప్రవచిస్తారు. వ్యక్తికీ, వ్యక్తి వికాసానికీ, వ్యక్తి అంతరంగానికీ ఈ దేశంలో విలువ ఎక్కువ. ఆధ్యాత్మికత అనగానే గుర్తుకు వచ్చేది భారతదేశం. శాస్త్రపరంగా సాధించిన అభివృద్ధి కన్నా ఆత్మపరంగా సాధించిన వికాసం ఈ దేశ ఘనత. ఎదరెందరో మహానుభావులు తమ జీవితాలనే అనుభూతులుగా మార్చుకున్నారు ఆత్మ సాక్షాత్కారానికి.

అనుభూతి కవిత్వం రసవాదానికి సంబంధించిందని చెప్తున్నవాళ్ళు ఉన్నారు. త్రిపురనేని మధుసూధనరావుగారు “అనుభూతిని రెండు అర్థాలతో వాడుతున్నాం. అందులో ఒకటి ఆనందం అనే ప్రాచీనార్థంలో దీనికి వస్తుగత ప్రమాణం లేదు …. ఆధునిక కవిత్వంలో అనుభూతి అనేది ఒక వాదం” అని చెప్పారు. అనుభూతి వాదాన్ని సమర్థించినవారు కూడా అనుభూతిలో రసానందం వేరు అనీ, ఆధ్యాత్మికానందం వేరు అని చెప్పారు. ఆధునిక కావ్యేతిహాస యుగంలో వచ్చిన అనుభూతి కవిత్వం ఆధ్యాత్మికానందానికి చెందింది కాదు అని దీనివల్ల తేలిపోతున్నది. ఇంతకుముందు మనం ఈ ఆధునికయుగంలో అనుభూతి కవితగా, అనుభూతి కవితావాదంగా విషయచర్చ చేశాం. ఆనందవాదం సామాజికావసరాలకు ఎలా వివరింపబడ్డదో భారతదేశ మేథావుల అభిప్రాయాలను గమనిద్దాం.
మానవుడు ఆధునికకాలంలో మానవ సమగ్ర జీవితానుభవాన్ని భౌతికవాదం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళించు కొంటున్నాడు. మానవుడు భౌతికంగా చాలా పురోభివృద్ధి సాధించాడు. సమాజంలో తన వికాసాన్ని విస్మరించి, సంఘ పురోభివృద్ధిని కాంక్షించాడు, సాధించాడు. మానవపురోభివృద్ధి అంతర్వికాసం అంతకిందకి దిగింది. ప్రస్తుతం తన అంతర్వికాసానికి కృషి చేయాలనీ, పరిపూర్ణావస్థ వైపు పయనం సాగించాలనే ఆరాటపడుతున్నాడు ఈ ఆధునిక మానవుడు.
“ప్రపంచంలో మేథావులందరూ మానవ వికాసంలో రాబోయే దశను గురించి సమాలోచనలు చేస్తున్నారు. కొందరు ఆర్ధిక మానవుడు ఆధ్యాత్మిక మానవుడుగా పరిణమించే ప్రస్థానంలో ఉన్నాడని అంటున్నారు. ఇంకొందరు మానవుడు సాంకేతిక విజ్ఞాన దశ నుండి సంపూర్ణ మానవదశ వైపు వికాసయాత్రను సాగిస్తున్నాడని పేర్కొంటున్నారు. మరికొందరు జాతి, మత, వర్గ, వర్ణభేదాల కతీతంగా ఒక విశ్వమానవ చైతన్యాన్ని దివ్యత్వంగానూ, ప్రేమతత్త్వంగానూ దర్శించి తమ అస్తిత్వాన్ని ఆ పరిపూర్ణ చైతన్యంలో భాగంగా అనుభవించే ఆధ్యాత్మిక పరిపూర్ణ వ్యక్తిత్వం వైపు వ్యష్టిగా కాకుండా సమిష్టిగా మనిషి చేసే పురోగమనం నేడు కానవస్తున్న పరిణామంగా ప్రకటిస్తున్నారు. వీరందరూ మానవుడు ఇప్పటి పతనావస్థ నుండి ఒక పరిపూర్ణావస్థ వైపు పయనించే ప్రయత్నంలో ఉన్నాడనీ, దానికోసం అన్నివిధాలా ఆవేదన పడుతున్నాడనీ, అన్వేషణ సాగిస్తున్నాడనే చెపుతున్నారు”.
ఈ పై వ్యాక్యాలకి మంచి ఉదారణ రష్యా. శాస్త్రాభివృద్ధి పురోగమించినా మనిషి అంతర్వికాసం లేనిదే సమాజం మనలేదని తెలుసుకుంది.
“ఈనాడు మా ప్రధాన కర్తవ్యమ్ వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఉన్నతున్ని చేయడం ; అతని అంతరిక ప్రపంచాన్ని గౌరవిస్తూ అతనికి నైతిక శక్తిని అందిసూ మేమా కర్తవ్యమ్ నిర్వహించాలి. సామాజికంగా చురుకైన వ్యక్తిని ఆధ్యాత్మికంగా సంపద్వంతుని, న్యాయమైన వ్యక్తిని శుద్ధమైన అంతరాత్మగల వ్యక్తిని తీర్సిదిద్దేందుకు సమాజంలోని భౌద్దికశక్తులు, సంస్కృతీ శక్తులూ కృషి చేసేలా చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. తన కృషితో సమాజానికి అవసరం ఉన్నదనీ, ఆత్మగౌరవానికి భంగం కలగటం లేదనీ, తనను విశ్వసిస్తున్నారనీ, గౌరవిస్తున్నారనీ, ప్రతి వ్యక్తీ తెలుసుకోవాలి; హృదయంతో అనుభూతి చెందాలి. వ్యక్తి ఇదంతా చూడగలిగినప్పుడు మరింత సాధించే శక్తి అతనికి ఉంటుంది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked