సారస్వతం

ఉపమన్యు ,ధౌమ్య మహర్షులు

-శారదాప్రసాద్ 

(​పాము పాదము పతంజలి మరియు పులి పాదముల వ్యాఘ్రపాద మహర్షి కలసి నటరాజస్వామి రూపములో ఉన్న శివునికి నమస్కరిస్తున్న దృశ్యం)
వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాద మహర్షి లేదా వ్యాఘ్రపాదుడు అనగా వ్యాఘ్రము వలె చరించువాడు అని అర్ధము. పాదములు వ్యాఘ్రము యొక్క పాదములు వలె ఉండును కాన వ్యాఘ్రపాదుడు అని, వ్యాఘ్రము వలె చరించువాడు అని అర్ధము చెబుతారు .కృతయుగము నందు ధర్మ ప్రవచన దక్షుడు, వేద వేదంగ విదుడు, జంతువుల యెడల భయంకరముగా చరించు వాడు, అయిన ఒక మహా ముని పేరు వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాదుడు.పురాణాలలో
వ్యాఘ్రపాదుడు అనే ఒక ఋషి ఉన్నట్లు చెప్పబడింది. వ్యాఘ్రపాదునకు ,భారతదేశం యొక్క తమిళనాడు నందలి చిదంబరంలో ఆలయ ప్రాంగణంలో నటరాజుగా ఉన్న శివుడు యొక్క నిత్య పూజ అందించటం కోసం, తేనెటీగచే తాకబడని తాజా పుష్పాలు సేకరించే యొక్క పని అప్పగించబడుతుంది. అయితే, పువ్వులు కోసి సేకరించే సమయములో వ్యాఘ్రపాదుడు ముళ్ళు మరియు కఠినమైన ఉపరితలాలపై గాయపడిన సందర్భాలు ఉంటాయి. అందువల్ల ఈ సందర్భములో శివుడు అతనికి పులుల పాదాలను వరంగా ఇవ్వటంతో ఆ ముని దుఃఖం ముగిసింది. చిత్రాల్లో అతను పతంజలి మహర్షితో కలిసి ఉన్నట్లు చూపిస్తారు ఇద్దరూ కలిసి తమ మనసులలో నటరాజు రూపంలో ఉన్న శివుడును మర్యాదగా ఆరాధిస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారు.పులి వలె తోక కలిగి ఉన్నట్లు చూపించారు అతన్ని
మరికొన్ని చిత్రాల్లో!వ్యాఘ్రపాద మహర్షి ఒక మునికన్యను వివాహము చేసుకొని గృహస్థ ఆశ్రమ ధర్మములు ఆచరించెను.వ్యాఘ్రపాదునకు ఇద్దరు కుమారులు.పెద్దకుమారుడు ఉపమన్యుడు, రెండవ కుమారుడు ధౌమ్యుడు.
ఉపమన్యుడు, ధౌమ్యుడు తల్లి అనుమతితో, శివుడు యొక్క అనుగ్రహంతో ఉపమన్యువు మహాజ్ఞాని, మహాయోగి అయ్యాడు. అలాగే ధౌమ్యుడు మహర్షి అయ్యి, పాండవులకు పురోహితుడు అయ్యాడు.ఉపమన్యు మహర్షి కథ మహాభారతములోఅనుశాసనిక పర్వములోకలదు. కానీ తిక్కన భారతములో లేదు.వ్యాఘ్రపాద మహర్షి ఇల్లాలు
పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుచుండెను. ఒకనాడు బందువుల ఇంట్లో పాయసము రుచి చూసి , అటువంటి పాయసాన్నము వండి పెట్టమని తల్లిని కోరిరి. లేదనిన చింతింతురని పిష్టరసమును తయారుచేసి పిల్లలకిచ్చెను. అది రుచింపక పాయసమే కావాలని మారాము చేసారు.అప్పుడు ఆ తల్లి ఆవు లేనిదే పాలురావు. పాలు లేనిదే పాయసాన్నము రాదని చెప్పెను. ఆవుని ఎవరిస్తారు? మా కోరిక తీర్చు వారెవరు? అని వారు ప్రశ్నించారు . అనంతరం ఆ మహాసాధ్వి ఈశ్వరుడు సర్వ కామ్యములు తీర్చునని తెలిపెను. శివధ్యానం చేసి ఏకంగా పాలసముద్రాన్నే పొందుతానన్నాడు ఉపమన్యుడు.అతడికి అంత పట్టుదల కూడా ఉన్నదని ఆ తల్లికి తెలుసు!తల్లి మాటలు విని ఉపమన్యుడు బయలుదేరి ఒక ఏకాంత ప్రదేశమున ఎడమకాలి బొటనవ్రేలిపై నిలిచి మహాతపస్సు చేయనారంభించెను.
నూరేండ్లు పండ్లు మాత్రమే తిని, మరి నూరేండ్లు ఆకులు మాత్రమే తిని, ఇంకొక నూరేండ్లు నీరు మాత్రమే త్రాగి, ఇంకొక నూరేండ్లు గాలి మాత్రమే పీల్చి, ఇలా మొత్తము వెయ్యి సంవత్సరములు ఉపమన్యువు పరమశివుని ఆరాధించెను.
ఈశ్వరునికి అతనిపై దయకలిగి పరీక్షించదలచి ఇంద్రుడి వేషములో వెళ్లి భోగభాగ్యాదులు ఇస్తానని ఆశ చూపించాడు. బూడిద తప్ప ఏమి ఇవ్వలేని శివుడినేం అడుగుతావు? ఆయన ఏమిస్తాడు? అని ఎద్దేవా చేశాడు. శివనింద భరించజాలక చెవులు మూసుకుని తక్షణం అక్కడి నుంచి ఆ ఇంద్ర వేషధారిని కదలమని హెచ్చరించాడు ఉపమన్యుడు. అంత ఉపమన్యుడు ఆతనిని నిరాకరించి పశుపతిని తప్ప ఇతరుల్ని అర్ధించను అని పలికెను. ఇంకా తాత్సారం చేస్తున్న అతడిని వెళ్లగొట్టాలని తల్లి తనకు రక్షగా ఇచ్చిన భస్మం పిడికిట్లో పట్టుకుని అఘోరాస్త్రం మదిలో తలచి ప్రయోగించబోగా అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్తుని కన్నులపండగ జేసెను. తదనంతరము ఉపమన్యుడు పరమ శివభక్తుడై చిరకాలము జీవించెను.

భారతీయ ఋషి పుంగవులకు స్మృత్యంజలులు!

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

3 Comments on ఉపమన్యు ,ధౌమ్య మహర్షులు

కాంతారావు ఎం.ఎల్. said : Guest 6 years ago

ఉపమన్యు వృత్తాoతం తెలియజేసిన మీకు ధన్యవాదాలు.

Bhaskaram said : Guest 6 years ago

very good article

విజయలక్ష్మీ ప్రసాద్ said : Guest 6 years ago

చాలా ఆసక్తికరంగా ఉందండీ!

  • GUNTUR