సుజననీయం

పారాడే పిల్లడు

– తాటిపాముల మృత్యుంజయుడు

పొత్తిళ్ళలో ఉన్న పిల్లడు ఆ అవస్థనుండి బయటపడి గబగబ పారాడటం మొదలెడితే తల్లికి ఎంతో ఆనందం కలుగుతుంది. అదే భావన, అనుభవం జనవరి 27న సిలికానాంధ్ర కుటుంబసభ్యులకు కలిగింది. ఆ రోజు సిలికానాంధ్ర రెండేళ్ళ క్రితం స్థాపించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra) మొదటీ స్నాతకోత్సవం జరిగింది. అత్యద్భుతంగా జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో సర్టిఫికేట్, డిప్లోమా, మాస్టర్స్ కోర్సులలో చదువులు పూర్తిచేసిన విద్యార్థులు సర్టిఫికేట్లు అందుకొన్నారు. వివరాలకు ‘ఈ మాసం సిలికానాంధ్ర ‘ చూడండి.

అలాగే, కాకర్ల త్యాగరాజస్వామి వారు పుష్య బహుళ పంచమి (1847 సంవత్సరం)న సిద్ధి పొందారు. తెలుగులో మధురమైన కృతులు రచించి స్వరపరచిన త్యాగయ్య గురించి ‘సంగీతరంజని ‘ లో చదవండి.

తీపి తెలుగురా-సొగసు
చూపు తెలుగురా-ఎదల
ఊపు తెలుగురా
బంగారు తెలుగురా

పై పలుకులు బులుసు వెంకటేశ్వర్లు గారివి.

తెలుగు వారమైనందుకు మనమంత గర్విద్దాం.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked