బాలానందం

భక్త ధృవ

-మొదటిరంగం-

[సునీతి పూజచేస్తూ ,పాటపాడుతుంటుంది
[మహరాజు ఉత్తానపాదుడు వస్తాడు ] దేవీ! సునీతీ!
[సునీతి పూజనుండీ లేచి వచ్చి ] -ప్రభూ దయచేశారా! రండి!
ఉత్తానపాద- ఏమి చేయుచుంటివి దేవీ!
సునీతి- మరేముంది ప్రభూ!మన దేశప్రజలందరినీ హాయిగా ,ఏకష్టాలూ లేకుండా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.ప్రభూ!
ఉత్తాన- నీకెప్పుడూ ఆప్రార్ధనేనా !నాగురించీ ఏమాత్రమూ శ్రధ్ధ లేదా!
సునీతి-ప్రభూ! అదంతా మీ గురించే! మన ప్రజలంతా హాయిగా ఉంటే మీరూ హాయిగా ఉంటారుకదా! సమస్యలోకాః సుఖినో భవంతు
ఉత్తాన – [లేచి] హూ! నీవదే చేసుకపో![ కోపంగా వెళ్ళిపోతాడు]
సునీతి- ప్రభూ ! ప్రభూ!

-2వ రంగం-

సురుచి పూలమాల అల్లుతుంటుంది. ఉత్తానపాదుడు వస్తాడు.
ఉత్తాన- సురుచీ! సురుచీ!
సురుచి-ప్రభూ !దయచేయండి . ఆశీనులుకండి { అంటూ పూలమాల అతడి మెడలో వేస్తుంది]
ఉత్తాన _ ఆహా! ఈ పుష్పాలు ఎంత మధురమైన సువాసనతో ఉన్నాయి? ఎక్కడిది దేవీ ఈమాల?
సురుచి- ప్రభూ! మీకోసం నేనే అల్లాను.మన ఉద్యానవనంలో మీకోసం ఈ పూలమొక్కలునాటించాను.
అంతేకాదు ప్రభూ! ఈ తినుబండారాలు సేవించండి. మీకోసం నేనేస్వయంగా చేశాను.[ అంటూ ఒక పాత్రంలో స్వీట్స్ ఇస్తుంది]
ఉత్తాన- [ స్వీట్స్ తింటూ } ఆహా! ఏమి రుచి ?ఏమిరుచి ?[ ఇంతలో ఉత్తముడు పరుగునవచ్చి తండ్రి వళ్ళో కూర్చుంటాడు.
ఉత్తమ – రాకుమారా! నీవూ ఆరగించు.[అంటూ ఉత్తముని నోట్లో స్వీట్ పెడతాడు]
ఉత్తాన- ఎక్కడినుండీ రాకుమారా నీరాక!
ఉత్తమ- సోదరుడు ధృవునితో ఆడుతున్నను తండ్రిగారూ! సోదరుడు ధ్రువుడు చాలామంచివాడు తండ్రిగారూ!
ధృవుడు-పితృదేవా![అంటూ వచ్చి తానూ తండ్రి వళ్ళో కూర్చుంటాడు]
సురుచి _ ధృవా లే అక్కడ ! నీకు తండ్రి వళ్ళో కూర్చునే అర్హతలేదు. [అంటూ రెక్కపట్టుకుని లాగుతుంది]
ధృవ – ఏల లేదు పినతల్లీ! వీరునాపితృదేవులేకదా!
సురుచి- ఔగాక నీవు నాకుమారుడవుకానందున నీకా అర్హత లేదు వెళ్ళు.[ అంటూ తోసేస్తుంది]
ధృవ- అదేల పిన తల్లీ!
సురుచి- వెళ్ళి భగవంతుని అడుగు ఫో.
ఏడుస్తూ వెళతాడు.

-3వ రంగం-

ధృవ- తల్లీ తల్లీ! [ అంటూ సునీతి దగ్గరకు వస్తాడు.
సునీతి -కుమారా!ఏలచింతాక్రాంతుడవై ఉన్నావు?
ధృవ-తల్లీ! నాపితృదేవుని ఒళ్ళో కూర్చునే అర్హత నాకులేదా!పిన్నిగారు నన్ను లాగివేసి నెట్టేశారే! వెళ్ళి భగవంతుని అడగమన్నారే!
సునీతి- ఔనునాయనా! మనకా భగవంతుడే దిక్కు.
ధృవ- ఐన తల్లీ! నేనా భగవంతునే అడుగుతాను.ఎక్కడుంటాడమ్మా భగవంతుడు.
సునీతి-సృష్టి అంతానిండి ఉంటాడు నాయనా! ఆయన్ని వెతికి పట్టుకోవాలి.
ధృవ- ఐన నన్ను దీవించు తల్లీ! వెళ్ళి భగవంతునే అడుగుతాను.[ సునీతి దీవిస్తుంది]ధృవుడు బయల్దేరి వెళతాడు

-4వ రంగం-

ధృవుడు పాట పాడుతూ వెళుతుంటాడు- ఇంతలో అతడికి ఒకపాట వినిపిస్తుంది[ నారాయణా హరి నారాయణా!]- ఓ ఎవరది! [అంటూ నడుస్తుంటాడు]
నారదముని- [ పాడుతూ ఎదురవుతాడు]
ధృవ- ఎవరు మీరుమహాత్మా!
ధృవ – ముందునీవెవరో చెప్పు.
ధృవ- నేను సురుచీ ఉత్తానపాద, దంపతుల కుమారుడను ధృవుడను.
నారద_ ఓహో అలాగా!నన్ను నారదమహర్షి అంటారు.మరి ఈ అరణ్యమార్గమేలపట్టావు కుమారా!
నారద_ మునీంద్రా! నేను దైవ దర్శనార్ధమై ఇలావచ్చాను.ఆయనకోసం ఎక్కడ ఎలావెతకాలో చెప్పండి మునీంద్రా!
నారద- కుమారా ! ఇది మీ ఉద్యానవనంకాదు. ఇక్కడ పులులు,సింహాలూ, ఏనుగలు, నక్కలు ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి. తినేస్తాయి. పసి బాలుడవు భయపడతావు . వెనుతిరిగి వెళ్ళు..
ధృవ- లేదు మునీంద్రా లేదు. నేను భగవంతుని చూడంది వెళ్ళను. ఆయన్ని చూచే మార్గం నాకు ఏదైనా చెప్పండి.ఏ పేరుతో పిలిస్తే త్వరగా పలుకుతాడు?
నారద- ఆయనకు అనేకనామాలున్నాయి. భక్తితో ఎలాపిలిచినా పలుకుతాడు.
ధృవ- మహర్షీ!నాకు ఒక మంచి నామం ఉపదేసించండి-[అంటూ పాదాలకు నమస్కరిస్తాడు ధృవుడు]
నారద- నీ ధృఢ సంకల్పానికి మెచ్చాను ధృవ కుమారా, ఇలారా {అంటూ చెవిలో ] ఓం నమో భగవతే వాసుదేవాయ – అని చెప్పి} ఈ మంత్రం భక్తితో జపించు కుమారా! నీకు దైవదర్శనం తప్పక అవుతుంది.
ధృవుడు పద్మాసనంలో కూర్చుని – ఓం నమో భగవతే వసుదేవాయ -[ అంటూ జపిస్తుంటాడు.
విష్ణుమూర్తి- కుమారా కళ్ళుతెరూ!
ధృవుడు- కళ్ళుతెరచి ]ఎవరు మీరు మహాత్మా!
విష్ణు- నీవు ఇంతకాలంగా పిలుస్తున్న విష్ణువును నేను .
ధృవ- [పాదాలపై బడి]- భగవాన్ మీదర్శనం నాకెంతో సంతోషాన్నిస్తున్నది.
విష్ణు- కుమారా! ఏమి ఆశించి నన్ను ప్రార్ధించావు? కోరుకో ఇస్తాను.
ధృవ- ప్రభూ! మీరు తప్పనాకుమరేమీ వద్దు.
విష్ణు- కుమారా ధృవా! నీవు పసిబాలుడవు. వెళ్లి బహుకాలం రాజ్యపాలన గావించి, ఆతర్వాత ధృవలోకంలో ధృవ తారవై అందరికీ మార్గ దర్శకుడవవుతావు . వెళ్ళిరానాయనా!
ధృవ – అలాగే ప్రభూ! ధన్యుడిని.

— చివరి అంకం–

ఉత్తాన- ఎంత పనైంది !ధృవుడు అడవూలవెంట వెళ్ళాడా! నేనెంత దుష్టుడిని.కుమారుని దక్కించుకోలేకపోయాను.[పక్కనే సురుచి, ఉత్తముడు ఉంటారు]
ఉత్తమ- తల్లిగారు నెట్టి వేయడం వల్ల సోదరుడు వెళ్ళిపోయాడు.
ధృవ [ వచ్చి ] పితృదేవా! వందనాలు. పినతల్లీ !వందనాలు.[అంటూ నమస్కరిస్తాడు]
సురుచి- కుమారా! మన్నించు, నీపట్ల క్రూరంగా ప్రవర్తించాను. అట్టి నాకు నమస్కరిస్తున్నావా![అంటూ లేపుతుంది.]
ధృవ- పినతల్లీ!మీవల్లేకదా ! నాకు భగవంతుడైన విష్ణువును దర్శించే భాగ్యం కలిగింది.
సునీతి[ వస్తుంది] కుమారా! వచ్చావా?[అంటూ కౌగలించుకుంటుంది. ]
సునీతి- ఔనునాయనా ! ఏదో విధంగా దైవం వైపుమళ్ళించినవారే మనకు మార్గదర్శకులు, వారికే ప్రధమవందనం చేయాలి.
ఉత్తాన- కుమారా ధృవారా! ఈ సింహాసనం మీద ఆశీనుడివికా నాయనా! నీకే ఆ అర్హత ఉంది [అంటూ ధృవుని కూర్చోబెట్టి తన మెదలో పూలమాల వేస్తాడు.

*********** ఓంశ్రీ సాయిరాం. ************

భక్త ధృవ :
పాత్రలు-1.ఉత్తానపదుడు -2.సునీతి 3. సురుచి 4 ఉత్తమ5. ధృవ.6 నారద 7. విష్ణు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on భక్త ధృవ

hymavathy.Aduri said : Guest 4 years ago

ధన్యవాదాలండీ!ప్రచురించినందుకు.

  • bangalore.now