వీక్షణం

వీక్షణం – 88

– రూపారాణి బుస్సా

గొల్లపూడి మారుతీరావు గారికి నివాళులర్పిస్తూ రెండు నిముషాల పాటు మౌనం పాటించి 88 వ వీక్షణ సభ ప్రారంభించబడినది.

తరువాతి కార్యక్రమంగావెంకట రమణ రావు గారు తాము వ్రాసిన కథ చదివారు. ఈ కథ పుట్టిల్లు అన్న శీర్షికతో 2008లో నవ్యలోప్రచురింపబడినది.ఈఛ్Fఆఈ సంస్థ వాళ్ళు పెట్టిన పోటీలో మొదటి బహుమతి పొందింది.

కథ నేపథ్యం అనంతపురంలోజరిగినట్టు చెప్పబడినది. కొన్ని సంభాషణలలోప్రాంతీయ భాషా శైలి కనబడుతుంది.

కథ ఇలా కొనసాగుతుంది:-

పార్వతి తన కూతురి ఇంటికివెళ్ళినప్పుడు తన ఊరి స్నేహితురాలు అలిమేలును కలిసి సొంత ఊరి వాళ్ళ గురించి తెలుసుకునిఏదో స్వగతాలలో మునుగుతుంది. స్నేహితురాళ్ళంతా కలిసినపుడు తోట, స్నేహం ఉన్నంత వరకు ఇదేమన పుట్టిల్లు అని అనుకున్నారు. ఊరులో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మకు కొడుకు, కోడలు వచ్చిఎంత పిలిచినా తన అవసరం ఉన్న వారి దగ్గర ఉండడమే న్యాయం మరియు ఈ ఇంట్లో చివరి కాలం గడపడమేసమంజసం అంటూ చిరునవ్వు నవ్వుతుంది పార్వతమ్మ. తన ఊరు, ఆ వాతావరణము తనకు పుట్టినిల్లనినెమ్మదిగా నిట్టూర్చింది.

పార్వతమ్మ భావోద్వేగాలనుచక్కగా కళ్ళకు అద్దినట్టు వ్రాశారు రచయిత.

పల్లెటూర్ల మార్పులు గురించిపత్రికల్లో చదివినపుడు పల్లె గురించి వ్రాయాలన్న స్ఫూర్తి కలిగించుకుని, అక్కడ ఇక్కడజరిగిన సన్నివేశాలను అల్లి కథ రూపం ఇవ్వడం రచయిత ప్రత్యేకత.

ఆలోచనను కథగా ఎలా మలచగలిగారన్నసుభాష్ గారి ప్రశ్నకు తెలిసో తెలియకో జ్ఞాపకాలను నెమరు వేస్తూ జరిగినకథలతో పాటు కాస్తకల్పనలను అల్లుతూ కథను వ్రాస్తాడు ఏ కవి అయిన అని చెప్పారు రచయిత వెంకట రమణరావు గారు.

తరువాతి కార్యక్రమం స్మరణిక.గొల్లపూడి మారుతీ రావు గారి గురించి కిరణ్ ప్రభగారు మాట్లాడారు.

గొల్లపూడి మారుతీరావుగారు తమ ఆత్మ కథను గురించి మునుపు స్వాగత్ హోటల్ లో మాట్లాడారు. మారుతీ రావు గారు స్మరణికవ్రాసేటప్పుడు ఆయన ప్రత్యేకత ఆ వ్యక్తి తో తనకున్న అనుబంధాన్ని తెలపడం. కిరణ్ ప్రభగారు,మారుతీ రావు గారి గురించి తమకు తెలిసిన విషయాలను చెప్పారు. ఆయన సినిమా నటులుగానే అందరికీతెలుసు. ఆయన పుట్టిన తేది 1939 ఏప్రిల్ 14. 16 సంవత్సరాలనుండే ఆయన వ్రాయడం మొదలు పెట్టారు.వ్రాతలలో ఆయన అనుభవం 65 సంవత్సరాలు. ఆయనకు కాలక్షేపమంటే కారులో షికారుచేయడం మాత్రమే.వేరే ఏది ఎన్నుకోవాలన్న నాటకాలు, సినిమా కథలు ఇలా ఏవీ మిగల్చకుండా అన్ని వ్రాశారు.అందులోపాత్రలు సహితం పోషించారు.

“ఆంగ్లము రాక ఉద్యోగంఎలా చేస్తావు రా” అని అడిగినందుకు పట్టుదలతో ఆంగ్లం నేర్చుకున్నారు. తన 20 వ ఏటనవల వ్రాశారు. ఆయన వ్రాసే నవలా శైలి అచ్చు చలం గారి శైలిలానే ఉంటుంది.

ఆయన చిత్తూరులో మొదట ఉద్యోగంఆంధ్రప్రభలో చేశారు. 1962 నుంచి 83 వరకు రేడియోలో కొనసాగేరు. 82లో డా.చక్రవర్తి అనేసినిమా కోసం వచ్చారు. ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ. ఎవరిని ఏమీ అడగరు. చాలా చిత్రాలకు చిత్రానువాదముచేశారు. చిత్రానువాదాలు కౢప్తంగా ఉండాలి.

81 -82 సినిమాల్లో బాగావ్యస్థంగా ఉన్నారు. నాటకాల అనుభవం ఎక్కువ కాబట్టి ప్రతి నాయకుడి పాత్రలు పోషించారు. 82-92 వరకు సినిమాలలోఉచ్ఛస్థితిలో ఉన్నారు. 2019 సెప్టెంబర్ వరకు కాలమ్స్ వ్రాసేవారు.

ఆయనకు ముగ్గురబ్బాయిలు,అందరు చక్కగా స్థిర పడ్డారు. ఆర్థిక రీత్యా ఎటువంటి ఇబ్బంది ఆయనకు ఎన్నడూ లేదు. 92తర్వాత దర్శకులకు మునుపంత క్రమశిక్షణ లేని కారణంగా చిత్రాలు మానేసారు. తదుపరి టెలివిజన్లో మనసు-మమత అనే కార్యక్రమంలో కుటుంబాలలో కష్టాలను గురించి చర్చించేవారు. ఎర్రసీత,సాయంకాలం అయ్యింది రచన ప్రాథమికంగా 2002 వరకుజరిగింది.

కిరణ్ ప్రభ గారికి మారుతీరావుగారు 2006 నుండి పరిచయం. ఈ మధ్య రుణం అనే నవలవ్రాశారు.

ఆయన చక్కని రచయితే కాక మంచి శ్రోత కూడ, బాగా వినడానికిఇష్టపడేవారు. కొన్ని ఏళ్ళు కౌముదిలో వ్రాసాక ఆంధ్రప్రభకు కాలమ్స్ వ్రాసారు. తిరిగికౌముదికి వ్రాసారు. ఆయనకు 79 సంవత్సరాల వరకు ఆరోగ్యం చాలా బాగుండేది. 2018 ఫిబ్రవరినుండి అనారోగ్యం బాధిస్తూ ఉంది. కాలమ్స్ వ్రాయడంలో విశిష్టత వారంలో జరిగినవిగా ఉండాలి.వ్రాసేది సమకాలికంగా ఉండాలి. విషయం లేక పోయినా పాత విషయాలను సమకాలానికి మార్చి వ్రాయగలగడంఆయనొక్కరికే సాధ్యం.

ఆత్మకథ వ్రాశారు అందులోఆయన ప్రత్యేకత ఏమిటంటే ముందు అధ్యాయం అంతంలోనే రాబోయే అధ్యాయంలోజరిగే సంఘటనలపై కుతూహలంసృష్టించేవారు.

మొత్తం – 500 నుండి 600 వరకు కథలు, 25 నవలలు వ్రాశారు.

తదుపరి కార్యక్రమం సుభాష్గారు నవోదయ రామమోహన్ గారికి స్మరణికను తెలిపారు.

ఆయన చాలా మంచి వ్యక్తిఎంతో మంది రచయితలు ఏమి లేకుండా వచ్చి అక్కడ కూర్చొన్నవారికి చాలా అవకాశాలను కల్పించారు.రచయితలను ప్రోత్సహించేవారు.

ఇద్దరు గొప్ప వ్యక్తులకుసభ అత్యంత గౌరవాభిమానాలతో నివాళులర్పించింది.

తదుపరి కార్యక్రమం కిరణ్ప్రభ గారి క్విజ్ అందరినీ ఎప్పటిలాగే అలరించింది.

తరువాత రూపారాణి బుస్సానవ కెరటం శైలి కవిత చదివారు. సుభద్రగారు పాటలతో రంజింపజేసారు.

వీక్షణం నిర్వాహకురాలుడా||కె.గీత ఇండియా వెళ్లడం వల్ల సభకు హాజరుకాలేకపోవడం గొప్ప లోటని తల్చుకోవడంతో 88వ వీక్షణసమావేశం సౌహార్ద్ర పూర్వకంగా ముగించబడినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked