సుజననీయం

WASC గుర్తింపు

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం – WASC గుర్తింపు

ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారిగా భారతీయులచే స్థాపించబడి భారతీయ భాషలు, కళలకు నెలవైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి (`University of Silicon Andhra`) జులై 13th న ప్రతిష్ఠాత్మకమైన `WASC` (`Western Association of Schools and Colleges`) గుర్తింపు లభించింది.

ప్రతిభగల విద్యార్థులకు బోధన చేయటానికి ఈ గుర్తింపు ఆవశ్యకం కాబట్టి, అమెరికాలో ప్రతి విశ్వవిద్యాలయం ఈ గుర్తింపు తెసీసుకోటానికి ప్రయత్నం చేస్తాయి.

ఈ గుర్తింపుతో విశ్వవిద్యాలయం అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తూ, కళలు, భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయటానికి సహకరిస్తుంది. అభివృద్ధికి ఎన్నో బాటలు వేస్తుంది.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా రాష్ట్రం, మిల్పిటాస్ నగరంలో 2016లో స్థాపించబడింది. 2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు సంపాదించి భారతీయ కళలు, భాషల్లో విద్యాబోధన ప్రారంభించింది. ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్యం, భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు మరియు సంస్కృత భాషా విభాగాలు ఉన్నాయి. డిప్లమో మొదలుకొని మాస్టర్స్ డిగ్రీల వరకు విద్యాబోధన జరుగుతున్నది. మరిన్ని వివరాలు `https://www.universityofsiliconandhra.org/` వెబ్ సైట్లో లభిస్తాయి.

– తాటిపాముల మృత్యుంజయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked