Month: March 2017

‘పూర్ణ పురుషుడు’, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు

సారస్వతం
  డా. ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి మొదటి భాగం : (2014 శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల  తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసవర్యుల 149వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన హరికథా సప్తాహంలో సమర్పించిన వ్యాసముల ఒకటి) ఉపోద్ఘాతము ‘సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖీ పరమేశ్వరుడు’, ‘హరికథా పితామహ’, ‘అట పాటల మేటి’ లాంటి ఎన్నో బిరుదులూ ఆయనను వరించాయి. ఆరున్నర దశాబ్దాల సంగీత, సాహిత్య, హరికథా కళా ప్రస్థానంలో ఆయన అందుకోని సన్మానం లేదేమో. రాజ సన్మానాలూ, పౌర సన్మానాలూ, బిరుద ప్రదానాలూ గజారోహణలు, సువర్ణ ఘంటాకంకణ ధారణలూ, గండపెండేర ధారణలూ ఇలా ఎన్నో, ఎన్నెన్నో గౌరవాలు ఆయనకు లభించాయి. ఆదిభట్ల నారాయణ దాసుగారు తెలుగులో, అచ్చతెలుగులో, సంస్కృతంలో సుమారు ఏభై గ్రంధాలను రచించారు. వాటిలో స్వతంత్ర కావ్యాలు, ప్రబంధాలు, అనువాద గ్రంధాలు, వచన గ్రంధాలు, కవితా సంపుటాలు, శ

​ జొన్న గింజ

కథా భారతి
  ఆర్ శర్మ దంతుర్తి రాజు సభలో కూర్చొనుండగా సేవకుడొచ్చి చెప్పేడు, "ఓ పరదేశి మీకు ఏదో వింత వస్తువు చూపించడానికి వచ్చాడు. లోపలకి తీసుకురమ్మని శెలవా?"   రాజు మంత్రికేసి చూసి, ఆయన సరేనన్నాక చెప్పాడు, "సరే, రమ్మను చూద్దాం."   లోపలకి వచ్చిన పరదేశి, అక్కడే ఉన్న బల్లమీద తన చేతిలోది ఏదో వస్తువు ఉంచాడు. చూడబోతే కోడి గుడ్డు లా ఉంది. గుడ్డు కాదన్నట్టు పైన ఒక చార లాంటిదేదో ఉన్నట్టుంది కూడా. రాజు, మంత్రీ తర్జన భర్జనలు పడి మొత్తానికి అది కోడి గుడ్డు కానీ మరో పక్షి గుడ్డు కానీ కాదని నిర్ధారించుకున్నాక అడిగేరు పరదేశిని, "ఏమిటి విషయం?"   "ఇదేదో మీకు నచ్చుతుందేమో, కొనుక్కుంటారేమో అని అడగడానికి వచ్చాను."   "ఇదేమిటో తెలియకుండా ఎలా కొనడం?"   "ఇదేమిటో నాకూ తెలియదు, దారిలో దొరికితే తెచ్చాను. మీకు నచ్చితే ఏదో ఒక ధర ఇప్పించండి" తాను దారిలో చిన్నపిల్లలు అడ

Is God Dead?

సారస్వతం
శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) ​ఈ చరాచర జగత్తును సృష్టించిన దేవుడు చరమా లేక అచరమా?అచరమైతే చరమైన ఈ జగత్తును ఎలా సృష్టిస్తాడు?ఒక నిర్జీవమైన పదార్ధం మరొక నిర్జీవమైన లేక  జీవమున్న పదార్ధాన్ని ఎలా సృష్టించగలదు?మరింత క్లారిటీ కోసం--ఒక టేబుల్ మరొక టేబుల్ ను కానీ ,పిల్లిని కానీ సృష్టించగలదా ?మనకు బాహ్యంగా కనపడే సమాధానం సృష్టించలేదనే!చరమైతే జీవం ఉండాలిగా!జీవం ఉన్నదంటే మరణం కూడా ఉండాలిగా! Is God Dead?తమిళ డ్రామా Is God Dead? ను చాలా రోజుల క్రితం నేను చూసాను !దీని రచయిత చో రామస్వామి. చరం అంటే కొందరు కదిలేదని అంటారు. అచరం అంటే చలనం లేనిదని మరికొందరు అనుకుంటారు!ఇంతకీ మన స్కూటర్ చరమా?అచరమా?కదులుతుంది కాబట్టి చరమని అందామా?  చరాచరాలు అంటే కదలికను బట్టి నిర్ణయించలేమని పై ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం కదా!మరి ఈ సృష్టి ఎవరు ,ఎలా చేశారనే సందేహం మనల్ని ఎప్పటినుండో పీడిస్తుంది!ఒక్కమాటలో చెప్పాలంటే ఒక పెద్ద వ

Footloose and fancy free with Dr. Sunil Kothari

జగమంత కుటుంబం
e-mail: sunilkothari1933@gmail.com 5th International Kuchipudi Dance Convention Photos: Avinash Pasricha January 17, 2017 With the division of Andhra Pradesh in Telangana State and new Andhra Pradesh state, the Kuchipudi village now belongs to Andhra Pradesh with its new capital Amaravathi.  In order to celebrate the formation of new Andhra Pradesh State under its Chief Minister Nara Chandrababu Naidu, Anand Kuchibhotla, Founder /Chairman of Silicon Andhra from USA, organized in collaboration with Dept of Language and Culture, Govt of Andhra Pradesh, the  5th International Kuchipudi Dance Convention at Vijayawada at specially constructed venue next to Indira Gandhi Stadium from 23rd to 25th December 2016. Known for his flawless organizing capacities, Anand Kuchibhotla with Silicon

అన్నమయ్య శృంగార నీరాజనం

Featured
  - టేకుమళ్ళ వెంకటప్పయ్య వయస్సును బట్టి కౌశలాన్ని ఆధారంగా చేసుకుని నాయికలలో ముగ్ధ, మధ్య, ప్రౌఢ అనే మూడు రకాల నాయికలలో గత మాసం ముగ్ధ గురించి తెలుసుకున్నాం. ఈ నెలలో మధ్య నాయిక గురించి తెలుసుకుందాం.  రామరాజ భూషణుడు తన సరసభూపాలీయము లో మధ్యమ నాయికను వర్ణిస్తూ..   ఉ. మానితవైఖరిన్ మణిత మంత్రములం, గబరీ వినిర్గళ త్సూనములం  బ్రసూన శర సూరుని బూజలొనర్చి తా రతిన్ మానిని యొప్పెనప్పుడసమాన మనోంబుజ వీధి నాతనిన్ ధ్యానము సేయుకై వడి రతాంత నితాంత నిమీలితాక్షియై.   తన కొప్పునుండి జారుతున్న పుష్పమాలలతో, కోకిల కంఠధ్వనితోడను, మన్మధపూజ చేసి,  వివశురాలై నాయకుడినే సదా ధ్యాన్నం చేసే  అవస్థను వర్ణిస్తాడు.   సాహిత్యదర్పణం లో మధ్య నాయికను వర్ణిస్తూ...“మధ్యా విచిత్ర సురతా ప్రరూఢస్మరయౌవనా| ఈషత్ప్రగల్భ వచనా మధ్యమ వ్రీడితా మతా||.” అంటే..విచిత్రమైన సంగమము, యెక్కువైన మదన తాపముగల, ప్రగల

శ్రీ

కవితా స్రవంతి
శ్రీ - అరుంధతి పండుగ శుభదినమూ నేడేఆమని ఆగనం నేడే ||పండుగ|| కమ్మని కోయిలా పాడవే తీయగావసంత హేలలకూ నీదే తొలిపిలుపుగానీరాగ మధురిమా ఏ దేవివరవమో ఆ మావి చివురిదీ ఏ జన్మల తపమో ||ఆ మావి|| ఆహా నీ గానము నేర్పుమాఊహకు అందని నీ మాధుర్యం చూపుమానీవెరుగని రాగమా నువు పలుకని భావమాస్వరమాధురి లాహిరిలో అలుపెరుగని యోగమా ||స్వర|| ||పండుగ||

నరసింహ సుభాషితం

సారస్వతం
నరసింహ సుభాషితం ధీరోదాత్తులు-1     ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి శ్లోకం:                    वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥   వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి । లోకోత్తరాణాం చేతాంసి కో హి విజ్ఞాతుమర్హతి ॥   సంధి విగ్రహం వజ్రాత్, అపి, కఠోరాణి, మృదూని, కుసుమాత్, అపి, లోకోత్తరాణాం, చేతాంసి, కః, హి, విజ్ఞాతుం, అర్హతి  శబ్దార్థం వజ్రాదపి = వజ్రముకంటెను కూడా, కఠోరాణి = కఠినమైనవి, మృదూని = సుకుమారమైనవి, కుసుమాదపి = పుష్పములకంటెను కూడా, లోకోత్తరాణాం = మహానుభావులైన కార్యవాదుల యొక్క, చేతాంసి = చేతల యందు,  కః హి = కోహి = ఎవరికైననూ,  విజ్ఞాతుమర్హతి = తెలిసికొనుట దుర్లభము. Meaning It is harder than diamond and impossible to understand the intent in the actions of
వసంతాగమనం

వసంతాగమనం

చిత్ర రంజని
వసంతాగమనం - రషీద కజీజీ (Rashida Kajiji) నూతన సంవత్సరం, వసంతకాలం, అందమైన పూలు మొదటిసారిగా వికసించడం, వసంతకాంతపు స్వాగతం పలుకుదాం. పెద్ద కాన్వాసుపై ఏక్రిలిక్ మరియు ఆయిల్ చిత్రమిది. హేవలంబికి స్వాగతం!  Happy Spring Time!!