Month: April 2017

కాలం మహిమ!

సుజననీయం
ప్రధాన సంపాదకులు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదక బృందం: తమిరిశ జానకి కస్తూరి ఫణిమాధవ్ కాలం మహిమ! 'ప్రభో , కాలం నీ చేతుల్లో అనంతం నీ నిమషాల్ని లెక్కపెట్టగలవారెవరూ లేరు ' (గీతాంజలి, చలం) 'ఎందులోంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలము? ఎవరివల్ల, ఎవరికోసం జరిగిందీ ఇంద్రజాలం?' (త్వమేవాహం, ఆరుద్ర) 'గాలంవలె శూలం వలె వేలాడే కాలం వేటాడే వ్యాఘ్రం అది, వెంటాడును శీఘ్రం' (ఖడ్గ సృష్టి, శ్రీ శ్రీ) పైవన్నీ మన తెలుగు కవులు తమ కవితల్లో కాలానికి అన్వయించుకున్న అర్థాలవి. మరి తత్వవేత్తలు, ఆధ్యాత్మికులు కాలాన్ని ప్రవాహమని, చక్రమని పరిగణించారు. ఇదలా ఉంచితే, శాస్త్రవేత్తలు కాలం ఈ విశ్వం ఉద్భవించినప్పటినుండి పుట్టిందని పేర్కొన్నారు. నిరంతరం క్రియప్రక్రియలతో నిరాఘాతంగా వ్యాపిస్తున్న ఈ విశ్వంలో ఎప్పుడో ఒకప్పుడు వివిధరూపాల్లో ఉన్న శక్తులు ఉట్టడుగుతాయని (Thermal Equillibrium), అప్పుడు సంకోచం ప్ర

దేవతగా మారిన మనిషి “అమ్మ”

కవితా స్రవంతి
  - భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అమ్మకుకూడా కొరుకుడుపడని కోపం ఉంటుంది, అది అప్పుడప్పుడూ తన విశ్వరూపాన్ని చూపుతూనే ఉంటుంది, కానీ,తరుచూ శాంతం దాన్ని అధిగమిస్తూ ఉంటుంది. అమ్మకుకూడా లోలోపల దహించే ద్వేషం ఉంటుంది, అది అప్పుడప్పుడూ పడగవిప్పి నాట్యమాడుతూనే ఉంటుంది, కానీ, తరుచూ ప్రేమ దానిని అధిగమిస్తూ ఉంటుంది. అమ్మకు కూడా దుర్గుణాలు కొన్ని ఉంటాయి, అవి అప్పుడప్పుడూ తమ ఉనికిని చాటుతూనే ఉంటాయి, కానీ,తరుచూ సుగుణాలు వాటిని అధిగమిస్తూ ఉంటాయి. అమ్మకి కూడా పక్షపాత బుద్ధి ఉంటుంది, అది అప్పుడప్పుడూ తన పవర్ ఫుల్ పాత్రను పోషిస్తూనే ఉంటుంది, కానీ,తరుచూ సమత్వబుద్ధి దానిని అధిగమిస్తూ ఉంటుంది. ఆవేశం,కావేశం అమ్మకు కూడా తప్పనిసరిగా కలుగుతుంటాయి, అవి అమ్మను వశపరుచుకోవాలని ఉవ్విళ్ళుఊరుతూనే ఉంటాయి, కానీ, తరుచూ ఆవేశాన్ని ఆత్మీయత, కావేశాన్ని ఆర్ద్రత అధిగమిస్తూ ఉంటాయి. అవివేకం,అసహనం అమ్మను కూడా త