Month: July 2017

శుభ తిథులు – శుభ కార్యాలు

కవితా స్రవంతి
-(డాǁ. దోముడాల ప్రమోద్, సంసకృతి సమితి, అలమాస్ గూడ, హైదరాబాద్ ) శుభ తిథులు,శుభ తిథులు, వేద పురాణాలశుభ తిథులు | శుభ కార్యాలు శుభ కార్యాలు , వేద శాస్తారాలమ శుభ కార్యాలు.ǁ గురువులను పూజించే పౌర్ణిమ, గూరు పౌర్ణిమ , గూరు పౌర్ణిమ| యుగారంభమైన పాడామి, యుగాది, యుగాది| యమునాతో భుజిoచిన యమ ద్వితీయ బహు బిజ౬,బహు బిజ౬| అభివృద్ధి పొoదే తృతీయ, అక్షయ తృతీయ, అక్షయ తృతీయǁ శుభ తిథులు,శుభ తిథులు| శుభ కార్యాలు శుభ కార్యాలు ǁ విఘ్న విమోచన చవతి, వినాయక చవతి, వినాయక చవతి| వస౦తాలనుపంచె పంచమి, వసంత పంచమి ,వసంత పంచమి| సుబ్రహ్మణ్యుని పూజించే షష్ట్టి, స్కంద షష్ట్టి, స్కంద షష్ట్టి| సప్త కిరణాలు పొయే సప్తమి, రథ సప్తమి, రథ సప్తమి ǁ శుభ తిథులు,శుభ తిథులు| శుభ కార్యాలు శుభ కార్యాలు| శ్రీ కృష్ణుడు, జన్మా౦ఛిన అషటిమి, జన్మాష్టమి జన్మాష్టమి| శ్రీ రాముడు అవతరించిన నవమి , శ్రీ రామ నవమి, శ్రీ రామ నవమి| విజయమలు లభి౦

బాటసారిని

కవితా స్రవంతి
-శిష్ట్లా. వి.యల్.యన్.శర్మ నేనొక బాటసారిని ఈ అనంత విశ్వంలో నా వంతు పాత్ర పోషిస్తున్న నటుణ్ణి! జీవన వేద వాదానికి నాదమై ప్రభవిస్తున్న ప్రాణిని! తిరోగమన పురోగమనాలలో మునకలు వేస్తున్న అనుభూతిని! రాగద్వేషాల రంగుల తెరపై ఆలపిస్తున్న జీవన స్వరాన్ని! తరాల స్వరాల నదుల అలలపై సాగిపోతున్న పడవను! విశ్వం అంచులు చూడాలని అంతరిక్షాన్ని అందుకోవాలనీ అనుక్షణం తపిస్తున్న ఆశావహుణ్ణి! వాదాల కతీతమైన జ్ఞానమేదో మేధస్సుతో మథిస్తున్న తాత్వికుణ్ణి! స్వాప్నిక ప్రపంచంలో స్నానం చేసే ఊహల వికాసాన్ని! కర్త కర్మ క్రియల రూపాన్నై వర్తమాన జగత్తును నడుపుతున్న మానవుణ్ణి! నేనొక బాటసారిని!

అహం

కవితా స్రవంతి
-నసీమ షైక్ మనుషులను విడదీస్తుంది ,మనసులను దూరంచేస్తుంది,మమతలను మసిచేస్తుంది,మంచిచెడుల తారతమ్యాలు మరిపిస్తుంది.... నీ....నా.....అంటూ తేడాలు చూపుతుంది,నేను...నాకు...అంటూ ముందుకు సాగుతుంది,ఓటమిని అంగీకరించనివ్వదు,గెలుపును నిలబడనివ్వదు.... తెలియనిది తెలుసుకోనివ్వదు,తెలిసింది తెలుపనివ్వదు,తప్పును ఒప్పుకోనివ్వదు,తప్పిదాన్ని మన్నించనివ్వదు ...... అన్నింటికి మూలకారణం అహమే....!!అహాన్ని జయించిన జీవితం ఆదర్శప్రాయమే.....!!!!

తండ్రి

కవితా స్రవంతి
-అన్నసముద్రం శ్రీదేవి చిట్టి వేలితో గుట్ట నెట్లాఎత్తావయ్యా అన్నా మిమ్మల్ని పైకి తెచ్చిన మీ తండ్రి నడగమన్నాడు గురితప్పని రామబాణం రహస్య మేమిటన్నా మీ లక్ష్య సాధనలో విలుకాడు నడగమన్నాడు గండ్ర గొడ్డలిలోని గొప్పేమిటన్నా తండ్రి తోడు గ ఉంటే తెలియదన్నాడు కాళింది పైన ఆ తాండవమేమిటి అన్నా కష్టాల తోటి నాన్న దోస్తీ చూడమన్నాడు సారథి గా నీవిచ్చిన సారమేమిటన్నాను నీ జనకుని మాటలను నెమరువేయమన్నాడు అంత గొప్ప తనముందా నాన్న లోన అన్నాను అన్ని ప్రశ్నలకు అయ్యే నా బదులన్నా అయ్య మాటతో నే అట అయ్యాడొక దైవంగా అయ్యొ మరి నేనే కద నా బదులుగ పంపాను అన్ని అవతారాల అంశ అందున కలదన్నాడు (Happy Fathers Day)

చిన్న నాటి గురుతులు

కవితా స్రవంతి
-భువనగిరి ఫ్రసాద్ స్వర్గాని నేలకు దించి చేతి కందిస్తానంటే వద్దు పొమ్మన్నాను! భువిలోని సంపదలన్నీ ఓ పెద్ద మూటగా కట్టి పెరడులో పెడతా నంటె కాదుపోమన్నాను!! నీకు చేతనైతే చిననాటి బాల్యం తెచ్చి చిందులేసి అడ మన్న! వాననీటి గుంటల్లో గంతులేసిన జ్ఞాపకాలూ, కాగితపు పడవలతో మురికి నీటి పోటీలు, సంకురాత్రి సందెల్లోఎగరేసిన గాలిపటాలు, హరిదాసుల జోలేల్లో బిచమేసి చిట్టి చేతులు, స్వర్గాని నేలకు దించి!! గుడి గోపురం పైకెకి పావురాలను తరిమిన రోజులు, ఊరచేరువు మధ్యలో ఈది తెచిన కలువ పూలు, చవితి పొద్దున్న తిట్లకోసం విసేరేసిన పల్లేరు కాయలు, తిరిగిరాని జ్ఞాపకాలు, మరిచిపోని గురుతులు, స్వర్గాని నేలకు దించి!!

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
ఇంద్రజిత్ సంహారం ఈ విధంగా వాళ్ళు ఎన్నో ప్రభావమహితాలైన దేవతాస్త్రాలతో పోరాడారు. ఇట్లా ఎడతెగని పోరు సలుపుతూ ఉండగా లక్ష్మణుడు ఒక తీవ్రాతితీవ్ర శరాన్ని ఇంద్రాస్త్రంతో అభిమంత్రించి - ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది, పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిమ్ (యుద్ధ 01.72) “ఓ బాణమా! దశరథమహారాజు పెద్దకొడుకు శ్రీరాముడు ధర్మాత్ముడూ, సత్యసంధుడూ, అవక్రవిక్రమపరాక్రముడూ అయితే, నీవు ఇంద్రజిత్తును తక్షణం వధించాలి'’ అని అంటూ ప్రయోగించాడు. అప్పుడా బాణం వెళ్ళి ఇంద్రజిత్తు తలను ఖండించింది. ఆకాశంలో దేవతలు, మహర్షులు, గంధర్వులు హర్షధ్వానాలు చేశారు. లక్ష్మణుణ్ణి వానర యోధులు ఆలింగనం చేసుకొని అభినందించారు. అప్పుడిక లక్ష్మణుడు-జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు పక్కన తనకు ఊతమిస్తుండగా శ్రీరాముణ్ణి దర్శించటానికి వెళ్ళాడు. శ్రీరాముడు, లకష్మణుడి శిరసు నాఘ్రాణించి సంబరంతో కౌగిలించుకున్నాడు. ఇక రావణుడు య

సంగీత పాఠాలు

సేకరణ: డా.కోదాటి సాంబయ్య (రెండవ భాగం) ద్వాదశ స్వర స్తానములు :- రెండు శ్రుతులకు లేక రెండు స్వరములకు గల వ్యత్యాసమును ' అంతరం ' ( difference ) అంటారు. సంగీతములో ద్వాదశ స్వరాంతర్గత స్థానములను చెప్తారు. సప్త స్వరముల లోని షడ్జ, పంచమ ములకు వికృతి భేదములు లేవు. రిషభ, గాంధార, మధ్యమ, దైవత, నిషాధ ములకు ప్రక్రుతి, వికృతి బేదములు రెండూ కలవు. అందువల్ల షడ్జ , పంచమ ములను ప్రక్రుతి స్వరములని, రిషభ , గాంధార, మధ్యమ, దైవత, నిషాధ స్వరములను వికృతి స్వరములు అని పేరు. ఈ విధమైన తేడాలు హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతం లో కూడా కలవు. మూర్చన :- ఏదైనా ఒక రాగం లో రాగల స్వరముల ఆరోహణ, అవరోహణ లను కలిపి మూర్చన అంటారు. మానవ దేహమునకు ఆస్థి పంజరము ఎలా ఆధారభూతమో ఒక రాగానికి కూడా మూర్చన అలా అధారమవుతుంది. ఆస్థి పంజరానికి పైన మాంసము తదితర అంగములు సమకూరి మానవ శరీర మవుతుంది అలాగే వాగ్గేయకారులు ఒక రాగ మూర్చనకు రాగ ప్రయోగాలు, రంజక

ఆకాశవాణి

శీర్షికలు
జానపదాల నుండి జ్ఞానపీఠం దాకా డా.సి. నారాయణ రెడ్డి ప్రస్థానం డా. జె. చెన్నయ్య 9440049323 విద్యార్థి దశలో అలవోకగా సీసపద్యాలనే అల్లిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు 70 సంవత్సరాల పాటు మహా ప్రవాహంలా నిరంతరం సాగిన కవితాయాత్రను ఆపి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మహాకవి డా.సి.నారాయణ రెడ్డి. సినారె అన్న మూడు అక్షరాలు తెలుగు సాహితీ క్షేత్రంలో భిన్న పక్రియల్లో పేరెన్నిక గన్న రచనల ఆవిర్భావానికి అక్షయపాత్రలై నిలిచాయి. కోట్లాది మంది అభిమానులను ఆయనకు సంపాదించిపెట్టాయి. జానపదవాఙ్మయ ప్రభావంతో సాహితీ సృజనకు శ్రీకారం చుట్టింది మొదలు అత్యున్నతమైన జ్ఞానపీఠ గౌరవాన్ని పొందడమే గాక మరెన్నో కావ్యాలను సృష్టించిన దశ వరకు సాగిన సినారె జీవనయాత్రను, కవితా యాత్రను గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. అక్షరాస్యతే కాదు విద్యాగంధం సైతం అంతంతమాత్రంగా వున్న తెలంగాణ జనపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల ఒడిలో పెరిగి ఇంతింతై విరాణ

పద్యం – హృద్యం

శీర్షికలు
-పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్ గతమాసం ప్రశ్న: "చిత్ర" కవిత్వం - ఈ క్రింది ఛాయచిత్రమునకు ఒక వ్యాఖ్యను లేదా వర్ణనను మీకు నచ్చిన ఛందస్సులో పద్యరూపములో పంపాలి ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. అయినాపురపు శ్రీనివాసరావు, సెయింట్ లూయిస్, మిస్సోరి. ఆ.వె. వాలు జడను గూర్చి వయ్యార మొలికించు హావ భావ యుక్త హాస్య లాస్య నవ రసములనెల్ల నాట్యమందున జూపు కులుకు లాడి నడక కూచ