Month: July 2017

నరసింహ సుభాషితం

శీర్షికలు
-ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి జన్మ భూమి శ్లోకం: अपि स्वर्णमई लङ्का न मे लक्ष्मण रोचते । जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।। అపి స్వర్ణమయీ లఙ్కా న మే లక్ష్మణ రోచతే । జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥ సంధి విగ్రహం అపి, స్వర్ణమయీ, లఙ్కా, న, మే, లక్ష్మణ, రోచతే, జననీ, జన్మ భూమి:, చ, స్వర్గాత్ అపి, గరీయసీ. శబ్దార్థం లఙ్కా = లంకా నగరము, స్వర్ణమయీ = పూర్తిగా బంగారుమయమైనప్పటికీ, అపి = కూడా, లక్ష్మణ = ఓ! లక్ష్మణ, మే = నాకు, న రోచతే = రుచించదు, ఇష్టం లేదు; జననీ = జన్మనిచ్చిన తల్లియు, చ = మరియు, జన్మ భూమి: = జన్మించినట్టి భూమియు, స్వర్గాత్ = స్వర్గము కంటెను, అపి = కూడా, గరీయసీ = ఉత్కృష్టం. Meaning After the war with Ravana and on seeing the beauty and grandeur of Lanka, when Lakshmana said to his brother Rama to stay put in Lanka itself, then Rama replied to Lakshma

ధర్మో రక్షతి రక్షితః

బాలానందం
-ఆదూరి. హైమావతి అనగనగా పర్తిపల్లి అనే గ్రామంలో గోపయ్య నే ఒక రైతు ఉండేవాడు. అతడి భార్య రావమ్మ అతడికి తగిన ఇల్లాలు. అత్త మామల ను తన స్వంత తల్లి దండ్రుల్లా చూసుకుంటూ ఆదరించేది . వారు కూడా రావమ్మను కూతుర్లా ప్రేమించే వారు . గోపయ్య దంపతు లు పగలనకా రేయనకా కష్ట పడి తమ కున్న ఒకే ఒక ఎకరం పొలంలో కాయా కూరా , నీరు లభించినపుడు వరీ పండించు కుంటూ ఉన్నంతలో సుఖంగా సంతోషంగా జీవించే వారు. గంజిని కూడా పాయసంలా భావించి ఆనందంగా నలుగురూ త్రాగేవారు. . వారికి ఒక నియమం ఉండేది. తమ పొలంలో వచ్చిన ఫలసాయం ఏదైనా కానీ మూడు భాగాలు చేసి ఒక భాగం తినను తిండి కూడా లభించని నిరు పేదలకూ, గ్రామం లోని అవిటి వారికీ , వృధ్ధులకూ ఇచ్చేవారు. దాన్ని ఒక గంపలో ఉంచి ఇంటి ముందు కొచ్చిన వారికి గోపయ్య తల్లీ, తండ్రీ ఇచ్చేవారు. ఒక భాగం దేవాలయంలో భగవంతునికి నివేదనగా సమర్పించుకునే వారు. మిగిలిన భాగా న్ని తమకోసం ఉంచుకునే వారు. పొలంలో ఏది పండినా ఇదే

చిత్రరంజని-july 2017

చిత్ర రంజని
-రషీద కజీజి (Rashida Kajiji) ఎండాకాలం వచ్చిందంటే బళ్ళకు సెలవు. చలి పూర్తిగా తుడుచుకొని పోతుంది. మామిడిపళ్లు, చల్లని సాయంకాలాలు, చెరువులో ఈతలు, ఇంకా ఎన్నెన్నో సంబరాలు. సముద్రం పక్కనున్న వాళ్లు ఎంతో అదృష్టవంతులు. సముద్రతీరంలో ఈతచెట్లు, స్వఛ్ఛంగా మిలమిల మెరిసే నీళ్ళూ, దురంగా ఉన్న లైట్ హౌస్... అక్రిలిక్ పేయింట్లతో, కాన్వాస్ పై వేసిన చిత్రమిది.

అమెరికాలో యోగీశ్వరుడు

కథా భారతి
(మొదటి భాగం) -ఆర్. శర్మ దంతుర్తి సుబ్బారావు యోగీశ్వరుడిగా మారడానికీ, అమెరికా రావడానికీ అనేకానేక కారణాలు ఉన్నాయి. మునిసిపల్ స్కూల్లో తొమ్మిదో తరగతి పిల్లలకి పాఠాలు చెప్పుకునే ఉద్యోగం లో చేరిన రోజుల్లో మొదట్లో కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది పాఠాలు చెప్పడానికి. కానీ మూడు నాలుగు సంవత్సరాలు గడిచేసరికి చెప్పిన పాఠమే చెప్తూ రికార్డ్-ప్లేబేక్ అన్నట్టైపోయింది సుబ్బారావు పని. తెలుగులో పాఠ్య పుస్తకాలు అంత తొందరగా మారవు కనకా, మారినా పెద్దగా ప్రిపేర్ అయ్యేది ఏమీ ఉండదు కనకా సుబ్బారావు కి పాఠాలు చెప్పడానిక్కంటే గోళ్ళు గిల్లుకోవడానికీ, నవల్డానికీ ఎక్కువ టైం ఉండేది స్కూల్లోనూ ఇంట్లోనూ. అలాంటి రోజుల్లో సుబ్బారావు జాతకాలు చూడ్డం, చెప్పడం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అవును మొదట్లో సరదాకే. ఇరవైఏడు నక్షత్రాల పేర్లూ, నవగ్రహాలు ఎలా ముందుకీ, వెనక్కీ తిరుగుతాయో అవన్నీ నేర్చుకున్నాక దశా, మహా దశా, అర్ధాష్టమ శనీ,

నాన్నకే!

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. రక్త పోటు,ఆటుపోటు నాన్నకే! గుండెపోటు,వెన్నుపోటు నాన్నకే! భంగపాటు,భ్రమల ఓటు నాన్నకే! ఉలిక్కిపాటు,నిద్ర చేటు నాన్నకే! విచారపు కాటు,వినోదపులోటు నాన్నకే! సమస్యలలో తడబాటు,నగుబాటు నాన్నకే! మధుమేహం,సంతానంపై మోహం నాన్నకే! అష్టకష్టాలు,నియమితిలేని నష్టాలు నాన్నకే! పలవరింతలు,వెక్కిరింతలు నాన్నకే! ఆలోచన,ఆవేదన నాన్నకే! ఒంటరితనం,ఓరిమిగుణం నాన్నకే!

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు - స్వాధీనపతిక -టేకుమళ్ళ వెంకటప్పయ్య అష్టవిధ నాయికల గురించిన ప్రస్తావన మొట్టమొదట క్రీ.పూ.2వ శతాబ్దంలో భరతముని సంస్కృతంలో రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనబడినది. 16వ శతాబ్దిలో జీవించిన కందుకూరి రుద్రకవి అష్టవిధ నాయికలను వర్ణిస్తూ జనార్ధనాష్టకం రచించాడు. అష్టవిధ నాయికలు కేవలం రచనల్లోనే కాక చిత్రకళ, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్య సాంప్రదాయాలలో తెలుపబడ్డాయి. మధ్యయుగపు చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి. అన్నమయ్య రచించిన శృంగార కీర్తనల్లో ఈ నాయికల విశేష వర్ణన ఉంది. అన్నమయ్యకు ఈ ప్రేరణ వైష్ణవ భక్తి నుండి సంక్రమించినదని భావించవచ్చు. అన్నమయ్య శ్రీవైష్ణవ వేదాంత పద్ధతి ననుసరించి, శ్రీవైష్ణవ మతమునకు చెందిన పండ్రెండుమంది ఆళ్వార్ల యొక్క "నాలాయిర దివ్య ప్రబంధము"లో నున్న నాయికా భావనకు అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. గురువుల యొద్ద నేర్చిన వేదాంతము, ఆళ్వారుల