Month: November 2017

ఆదికుటుంబం

బాలానందం
-దాసు మధుసూదన రావు మూడు కన్నులవాడు పరమేశ్వరుండు నందివాహనుండతడు ఆదిదేవుండు; పరమ పావని గౌరి ప్రసన్న వదని పులి వాహనురాలామె శివుని పత్ని; ఒకరి మేనులో సగము ఇంకొకరు అయినారు పూజలందుకొనుచు వారు ఆది దంపతులైరి; గజముఖ వినాయకుండు వారి తనయుండు ఎలుక వాహనుండతడు గణనాయకుండు; ఆరుమోముల కొమరుడతని తమ్ముండు నెమలి వాహనుండతడు దేవసేనాని; కొమరులిద్దరితోడి ఆది దంపతులు ఆదికుటుంబమై మనల రక్షించెదరు.

కఠోపనిషత్ 

సారస్వతం
-శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) 'ఉపనిషత్' అనగా, దగ్గరగా అందించునది అని అర్ధం చెప్పుకోవచ్చును. (ఎవరి దగ్గర జ్ఞానం పొందవలనో, దానిని వారి సమీపమునుండి పొందటమే!) ఇట్టి ఉపనిషత్ లు ప్రధానంగా పది ఉన్నాయని చెప్పవచ్చు.కొందరు 108 అని అంటారు. ఇలాంటి దశోపనిషత్లలో చాలా ప్రధానమైనది,కఠోపనిషత్. ఈ ఉపనిషత్ కృష్ణయజుర్వేదమునకు చెందినది.ఈ ఉపనిషత్ లో విచిత్రమేమంటే, ఇది ఉపదేసించేవాడు,సాక్షాత్తు యముడు.'యమము' అనగా సద్గుణమునకు అధిదేవత. ఈ 'యమము' నకు సంబంధించిన శిక్షణ శరీరంలో జీవుడువుండగానే జరుగ వలెను.(బండి నడుచు చున్నప్పుడే, repair చేయించు కొనవలెను-- Master CVV ) జీవుడు దేహమున ప్రవేశించి భూమిపై పడిన తర్వాత జరుగునదే యమమునకు తగు శిక్షణ. కనుక,జననమే యమ దర్శనమనవచ్చును!ఈ ఉపనిషత్ లో వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు, ఋషి పుంగవుడు---విశ్వజిద్యాగం చేస్తూ ఉంటాడు.తనది అనేది అంతా  ఇచ్చేయాలని, పరబ్రహ్మం అంతర్యామియై తనయందు సృష్టిని క

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: సమస్య: బాంబుల వలనే దేశము బాగుపడును గతమాసం ప్రశ్న: దత్తపది: వంగ, దోస, కాకర, కంద పదములను అన్యార్ధములతో వాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరానికి సంభందించిన విషయముపై స్వేచ్ఛా ఛందస్సులో పద్యము వ్రాయాలి ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ తే.గీ|| ఊహ కందని రీతిగ సాహ సించి దోస మెరుగక గాంధీజి రోస మనక గొడ్డు కాకర వంటిఈ చెడ్డ దొరల చెఱను వి

ఎవరవయా నీవెవరవయా?

కవితా స్రవంతి
-డా.బి.బాలకృష్ణ నిలకడ నేర్వని నా నడకలకు జీవితమింకా సుదూరంగానే తోస్తున్నది నరాల దారులలో ధారలుధారలుగా ప్రవహిస్తున్న చైతన్యం తన మూలాలను వెతుక్కుంటున్నది తల్లికడుపులో, చీకటిలో, చీమూనెత్తురుల అశుద్ధంలో అణువుగానో, పరమాణువుగానో ప్రవేశించి రక్తపు బంతినై, మాంసపు ముద్దనై ఎదుగుతున్నప్పుడు ఎక్కడినుండో ఓ కదలిక నా అస్తిత్వానికి ఊపిరూలుదుతుంది మూసలో దాచబడిన ఈ జీవం తరతరలా ఆలోచనలకు తెరతీస్తుంది నేను ఎవరు? నా గమ్యమేమిటి? నా అస్తిత్వమెక్కడిది?ఇప్పుడున్న స్పృహ ఏనాటిది? ఉలి, శిలను తొలిచినట్లు ఏవేవో ప్రశ్నలు నన్ను తొలుస్తూనే ఉంటాయి సంద్రంలో ఎగసిన అల విసురుగా తీరాన్ని తాకి, వెనుతిరిగినట్టు అడుగంటిన నీటిబొట్టు ఆవిరై గాలిలో కలసినట్టు ఎందుకో పుట్టి, ఎందుకో గిట్టి ఉన్నన్నినాళ్ళు ఏదేదో వెలగబెట్టి అన్నీ నావనుకొని, అన్నింటినీ వదిలేసి రిక్త హస్తాలతో ఏ శూన్యాలకో సాగే పయనంలో ఒక్కోసారి నిన్ను గుర్తు చ

తోడు-నీడ వారికి వారే!

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు నాన్నలేని అమ్మ ఎక్కడుంది ....ఆలోచించి చూస్తే! అమ్మలేని నాన్న ఎక్కడున్నారు....అవలోకించి చూస్తే! లేచినవెంటనే మంగళసూత్రాలను కళ్ళకద్దుకొంటూ అమ్మ, అమ్మకళ్ళను సూత్రాలనుంచే చుంబిస్తూ నాన్న, తనుకలిపిన మొదటికప్పు కాఫీని అందిస్తూఅమ్మ, బెడ్ కాఫీని చిరునవ్వుతో అందుకుంటూ నాన్న! అమ్మ స్నానంచేసి వచ్చేసరికి పువ్వులు కోసిఉంచిన నాన్న, నాన్నకోసిన పువ్వులతో పూజమొదలెడుతూ అమ్మ! అమ్మ పూజముగించుకొనివచ్చి టిఫిన్ ఇచ్చేసరికి అమ్మ వంటకు కావాల్సిన కూరగాయలు కొనితెచ్చి, సమయానికి అమ్మకు అందించే నాన్న! అమ్మ అడగకుండానే పిల్లలకు కావలసినవి కొనిపెట్టమంటూ అమ్మచేతిలో డబ్బుంచిమరీ ఆఫీసు కు వెళ్ళేనాన్న! వస్తున్నప్పుడు ఏంతేవాలంటూ ప్రేమగా మధ్యలోఒకసారి అమ్మకు ఫోన్చేసే నాన్న! పిల్లల్ని అలాతిప్పివద్దాం పదండి అంటూఅమ్మ, మారు మాట్లాడకుండా,విసుక్కోకుండా, వచ్చినవెంటనే షికారుకు తీసుకొనివెళ్

జోస్యం

కథా భారతి
- ఆర్. శర్మ దంతుర్తి జ్యోతిషం చెప్పే వాడికి పేరు రావాలంటే మార్గం ఆయన చెప్పేవి నిజం అవుతున్నాయని వ్యాప్తి చేయడం. ఆ వ్యాప్తికి ఉన్న అనేకానేక పద్ధతుల్లో జనా లు ఒకరి కొకరు చెప్పుకోవడం, లేకపోతే అదృష్టం ఉంటే పత్రికల్లోనో పేపర్లలోనో వార, నెల వారీగా రాశి ఫలితాలు రాయడమో అనేవన్నీ ఒకప్పటి మాట. హై టెక్ యుగానికి ఇవన్నీ అక్కర్లేదు. ఓ బ్లాగో, వెబ్ సైటో మొదలుపెట్టి అంతర్జాలం మీదో ఫేసు బుక్కులోనో వదిల్తే చాలు. గొర్రెల్లాంటి జనం పొలోమంటూ వచ్చి పడతారు. అదిగో అలాగే అప్పారావు పండిట్ గానూ, దైవజ్ఞుడిగానూ మారిపోయేడు బ్లాగు మొదలుపెట్టి. ఇందులో ఆయన పోస్టుచేసేవి వరుసగా జరుగుతూ ఉండడంతో అప్పారావుని 'గురువుగారూ’ అని పిలిచే అభిమాన సంఘం ఒకటి మొదలైంది. ప్రతీ పోస్టుకీ 'ఆహా ఓహో' లనడం, బాజా భజంత్రీలు వాయించడం, లైకులు కొట్టడం వీళ్ల పని. అప్పారావు మొదటి జోస్యం - మార్చ్ నెలలో రాబోయే అమావశ్య కి జనం చావడం – ఎక్కడో కాదు కానీ దే

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కుంతీదేవి ద్రౌపదిని చూసి సహదేవుని విషయమై “కాదు(బ సిబిడ్డ వీ(డొకటి గాదవునా నేఱు(గండు ముందరె య్యెడ నొక పాటేఱుంగ(డెద యెంతయు(గోమల మెప్పుడైన నే( గుడువ(గ బిల్తు(గాని తనకుం గల యా(కటి ప్రొద్దేఱుంగ(డీ కొడుకిటు పోకకున్ మనము గుందెడు ని గని యూఱడిల్లెడున్" ఈ పద్యంలో తనకు సహదేవుని పట్లగల వాత్సల్యాతిశయాన్ని హృదయద్రవీకరణంగా ద్రౌపదికి కుంతీదేవి తెలపటం కన్పిస్తుంది. భాగవతాన్ని రచించిన పోతన్నగారి కవిత్వం అంతా రసార్ణవమే. "నల్లనివా(డు పద్మనయనంబుల వా(డు కృపారసంబు పై( జల్లెడు వా(డుమౌళి పరిసర్పిత పింఛమువా(డు నవ్వురా జిల్లెడు మోమువా(డొక(డు చెల్వల మానధనంబు దెచ్చెనో మల్లియలార! మీ పొదలమాటున లే(డు గదమ్మ! చెప్పరే" ఈ పద్యం మనోహరమైన అనుభూతులతో నిండిన పద్యం. ఈ మహాకావ్యాలన్నీ అనుభూతికి ఉదాహరణలే అయినా, స్థాలీపులాక న్యాయంగా నేను ఈ ఉదాహరణలను ఇస్తున్నాను. ప్రబంధయుగంలో ప్రథమ ప్రఖ