Month: February 2018

రాశి ఫలాలు

కథా భారతి
జ్యోతిష్ పండిట్, ఆస్ట్రో సిద్దాంతి, దైవఙ్ఞ చింతామణి, జంతు జీవన జిజ్ఞాసి, ప్రకృతి ప్రేమిక్, కధా రచయిత, బ్రహ్మశ్రీ డా॥ ఆర్. శర్మ దంతుర్తి,పి.హెచ్.డి (అమెరికా) (ఈ రోజుల్లో అసలు జ్యోతిషం అంటే ఏమిటో కూడా తెలియకుండా రాశి ఫలితాలు రాయవచ్చు అని గ్రహించడం కష్టం కాదు. “మేఘాలు వస్తే వర్షం వస్తుంది,” “రోహిణీ కార్తెలో ఎండబారి పడకుండా ఉంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు” లాంటి ఫలితాలు అంతర్జాలంలో, పత్రికల్లో చదివి నేను కూడా రాయగలను అని వెక్కిరించడానికి ఇది రాసాను. దీనికోసం తెలుగు రాయడం వస్తే చాలు; మిగతా ఎటువంటి పరిజ్ఞానం అవసరం లేదు. బ్రహ్మశ్రీ,, ఆస్ట్రో పండిట్, వేదాంతిక్ అనే బిరుదులు ఎన్నికావాలిస్తే అన్ని తగిలించుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనే వాటికి ఏ సంఖ్య వేసినా ఫర్వాలేదు. మీరుకూడా రాయవచ్చు; ప్రయత్నం చేయండి.) [ఈ సంపూర్ణ జీవిత ఫలితాలు రాశి దృష్ట్యా చూసి నిశితంగా గమనించి ర

అభ్యుదయ మహిళ

కవితా స్రవంతి
సత్యవతి దినవహి విచక్షణ కలిగిన విద్యావంతురాలై ఎల్లచోటులా తన ఉనికిని చాటుతూ అన్నిటా పురుషులతో సరితూగగలనని చూపుతూ సమాజానికి తన అస్తిత్వాన్ని తెలియజేసిన అభ్యుదయ మహిళ దక్షత కలిగిన కార్య నిర్వాహకురాలై శక్తి యుక్తులతో పలురంగాల పురోగమిస్తూ తానెవ్వరికంటే తక్కువ కాదని నిరూపిస్తూ సంఘంలో తన స్థానాన్ని ఉన్నతంగా నిలుపుకున్న అభ్యుదయ మహిళ క్షమత కలిగిన గృహ నిర్వాహకురాలిగా సహజ సిద్ధమైన సౌమ్యత , సౌశీల్యతతో ఇంటా బయటా కార్యసాధకురాలిగా రాణిస్తూ సమస్త స్త్రీ జాతికే తలమానికమై నిలుస్తున్న అభ్యుదయ మహిళ కుశాగ్ర బుద్ధి కలిగిన నారీ మణిగా ఎల్లరి మన్ననను మెప్పును పొందుతూ రాజనీతిలో చాణుక్యుడిని మించిన కౌశలం కనబరుస్తూ ఉత్తమ ప్రజా నాయకురాలిగా ప్రశంశలు అందుకుంటున్న అభ్యుదయ మహిళ అధ్భుత ప్రతిభా పాటవాలతో శాస్త్రవేత్తగా , వ్యోమగామిగా రోదశీయానంలో సౌరమండలమున పాదము మోపి వచ్చి అసాధ్యమైనది సాధించి ఉన్నతికి హద్దులే

నిర్ణయం

కథా భారతి
- పాలెపు బుచ్చిరాజు సాగర్ తో తన పెళ్లి ఇలా బెడిసి కొడుతుందని అనుకోలేదు జలధి. అన్నయ్య అయితే అమ్మానాన్నలని కాదని కులంగాని పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబం నుంచి వేరుపడి వేరే కాపురం పెట్టాడు. పిల్లల మీద ఎన్నో ఆశలు పెంచుకునే అందరు తలిదండ్రుల లాగే వారిద్దరూ చాలా కృంగి పోయారు. వాళ్ళని మరింత నిరాశ పరచడం ఇష్టం లేక, వాళ్ళు చూపించిన సంబంధమే చేసుకోవడానికి ఒప్పుకుంది జలధి. సాగర్ తలిదండ్రులు బాగా డబ్బున్నవాళ్ళు. అతను ఎం టెక్ . చదివి, వైజాగులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అందంగా ఆకర్షణియంగా ఉంటాడు. జలధి కూడా ఐ.టి లో డిగ్రీ చేసి, కేంపస్ ఇంటర్వ్యులో టి. సి. ఎస్. లో సెలక్టు అయింది. పెళ్ళయిన కొత్తలో మూడు నెలల పాటు రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. అత్తవారింట్లో ఆ ఆస్థి పాస్తులు, ఆడంబరాలు చూశాక, తమ తాహతుకు మించిన సంబంధమే అనిపించింది జలధికి. తలిదండ్రులకి ఒక్కడే కొడుకు అతి గారాబంగా పెరిగాడు. ఆ యింట్లో అ

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
భావకవితాయుగ ప్రతినిధిగా కృష్ణశాస్త్రిని చెప్పుకున్నా ఆయన మధ్యమమణిలా ప్రకాశించినవాడు. కాబట్టి ఆధ్యంతాలూ పరిశీలిస్తేనే కానీ భావకవితాయుగంలోని అనుభూతి తత్త్వాన్ని చర్చించినట్లూ కాదు. ఈ నవ్యకవితానికి నాందీ వాక్యం పలికింది ఎవరన్న వివాదం జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రాయప్రోలు, గురజాడవారలు చెరో రీతిలో నవ్యకవిత్వ లక్షణాలను వెల్లడించారని చెప్పుకోవచ్చు. ప్రణయ కీర్తనం గురజాడవారిలో ఉన్నా, సంస్కరణాభిలాష వారిలోని తీవ్రత. “మర్రులు ప్రేమని మదిదలంచకు మరులు మరలును వయసుతోడనె మాయమర్మములేని నేస్తము మగువలకు మగవారి కొక్కటె బ్రతుకు సుకముకు రాజమార్గము" వంటి గేయాలలో ప్రేమకీర్తన కన్పిస్తుంది. సమకాలీనంలో దేశంలో ఉన్న కులాల కుమ్ములాటలను చూసి, “మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండెకులములు మంచియన్నది మాలయైతే మాలనే అగుదున్" అని ఎలుగెత్తి చాటాడు. ఈ విధంగా సంస్కరణవాదిగా ప్రేమను వ