Month: March 2018

విశ్వామిత్ర 2015 – నవల ( 18వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు "అది సార్ సంగతి" రాజు పూర్తి చేశాడు "అంతేనా?"అన్నాడు అభిషేక్"ఈ విషయం చెప్పడానికి నువు ఇంత సంకోచం పడడమెందుకు?" రాజు ఆశ్చర్యపోయాడు"అదేంటి సార్,ఒక అమ్మాయి అర్థరాత్రి బీచ్ కి వెళ్ళడం,అక్కడ రౌడీలని చితక బాదడం,అదంతా వీడియో రికార్డింగ్ చేయడం,ఇదంతా మీకు వింతగా ఎబ్నార్మల్ గా అనిపించడం లేదా?" "ఏంలేదు.అర్థరాత్రి బీచ్ కి వెళ్ళాలనే ఉత్సాహం ఉంది,అనుకోనిదేమైనా జరిగితే తనను తాను రక్షించుకోగలననే ధైర్యం ఉంది.అంతకు మించి ఏం కనబడట్లేదు నాకు" "మీరిలా అంటారని మీ సంస్కారాన్ని బట్టి ఊహించాను సార్.కాని తరవాత ఇంకొక విషయం జరిగింది సార్." రాజు ఆగాడు.అభిషేక్ వింటున్నాడు" ఆ ఇంటి బయటకు వచ్చి కేతుబాబుని ఏ హాస్పటల్ కి తీసుకు వెళ్ళారో కనుక్కుని ఆ హాస్పటల్ కి వెళ్ళుతుండగా నాకు ఓఫోన్ వచ్చింది సార్"రాజు మళ్ళీ ఆగి ఇంకో పెగ్గు పోసుకున్నాడు అభి దింకా మొదటిపెగ్గే ఇంకా పూర్తికాలేదు.రాజు అప్పుడే నాలుగుల

నాన్న

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. అమ్మ పెదవిపై విరిసే నవ్వులో నాన్న, అమ్మ జడలో మురిసే పువ్వులో నాన్న. అమ్మ చీరకట్టులో బెట్టులా నాన్న, అమ్మ నుదిటిపై బొట్టులా నాన్న. అమ్మ కలలకు ఆకారం నాన్న, అమ్మ కళలకు సాకారం నాన్న. అమ్మ కనులలో కాంతి నాన్న, అమ్మ మనసులో శాంతి నాన్న. అమ్మ గుండె ధైర్యం నాన్న, అమ్మ మాట శౌర్యం నాన్న. అమ్మకొచ్చిన మంచిపేరులో నాన్న, అమ్మ చూపే ప్రేమ తీరులో నాన్న. నాన్న లేని అమ్మ అయిపోతుంది సున్నలా, తనని తాను భావించుకుంటుంది మన్నులా.

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
స్థూలంగా వివేచిస్తే శ్రీశ్రీ వర్గరహితమైన సమాజాన్ని, ఆర్ధిక అసమానతలను తొలగించి సమసమాజాన్ని నిర్మించాలాని ప్రభోదించినాడు. ఆర్ధికాభ్యున్నతి సాధించినా జాతిజీవనం ఆధ్యాత్మిక ధర్మ చైతన్యంతో ముందుకు నడిచినప్పుడే మానవవికాసం సంపూర్ణమౌతుందనీ, అప్పుడే సమసమాజం సాధ్యపడుతుందనీ విశ్వనాథ ప్రభోదించాడు. ఒకరు ఆర్ధిక ధర్మానికి ప్రాధాన్యమిస్తే, మరొకరు హార్థిక ధర్మానికి ప్రాణం పోశారు" భావకవి ఊహాలోకాల్లో ఊరేగుతాడనీ, లోకం పట్టనివాడనీ సమాజంలో కొందరు కవులు భావించారు. ఆత్మాశ్రయ కీర్తనంగా, ప్రణయకీర్తనంగా పేరుగాంచిన భావకవిత్వం సమాజావసరాలు తీర్చలేదని భావించటం జరిగింది. ‘నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు' అని భావకవి, ‘మనసారగ ఏడ్వనీరు నన్ను' అని బజారున పడటంతో కృష్ణశాస్త్రి బాధంతా లోకానికీ బాధ అయికూర్చుంది. ఇందులో నిజం లేకపోలేదు. కానీ అంతా యథార్థంమటుకు కాదు. కవి ఎప్పుడూ తన కోసం కవిత్వం రాసుకోడు. ఈ సందర్భంలో వెల్చేరు నారాయణరావుగ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు – అభిసారిక - టేకుమళ్ళ వెంకటప్పయ్య "మదనానలసంతప్తా యాభిసారయతి ప్రియమ్| జ్యోత్స్నాతమస్వినీయానయోగ్యాంబరవిభూషణా| స్వయం వాభిసరేద్ యా తు సా భవేదభిసారికా"|| (రసార్ణవసుధాకరము) మదనానలసంతప్తయై ప్రియుని తనకడకు రప్పించుకొనునది గాని, వెన్నెల రాత్రులలో, చీకటిరాత్రులలో తన్నితరులు గుర్తింపనిరీతిగా వేషభూషలను ధరించి రహస్యముగా ప్రియుని గలియుటకు సంకేతస్థలమునకు బోవునది గాని, అభిసారిక యనబడునని పైశ్లోకమునకు అర్థము. కానీ ఈ అభిసారిక నాయికలలో ఉన్న స్వల్ప బేధాలను గమనిస్తే మొదటి రకమైన యభిసారిక సామాన్యముగా నొక దూతిక ద్వారా సందేశమును పంపి, ప్రియుని తనకడకు రప్పించుకొనును. అతడు వచ్చినప్పుడు వాసకసజ్జికవలెనే సర్వము సంసిద్ధము చేసికొని అతనితో సవిలాసముగా గడపును. ఇట్లు ఈవిధమైన అభిసారికకు, వాసకసజ్జికకు, కించిద్భేదమే యున్నది. వస్తుతః శృంగారమంజరీకర్త వంటి కొందఱు లాక్షణికులు ఈరకమైన అభిసారికను వాసకసజ్జికగానే ప

సంగీత రంజని మార్చి – 2018

-A.S.Murali గాత్రకచేరీ ఏప్రిల్ 30, 2017 న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ A.S.Murali గాత్రకచేరీలోని కొన్ని త్యాగరాయ కీర్తనలు. శ్రీమతి సంధ్య శ్రీనాథ్ వయొలిన్, శ్రీ రవీంద్రభారతి శ్రీధరన్ మృదంగం