Month: April 2018

కొడుకు స్థిరపడితే!

కథా భారతి
“హలో!” “హలో! నేను బ్యాంకు మేనేజర్ ను మాట్లాడుతున్నాను, సుధీర్ గారా! మాట్లాడేది?” “నమస్తే సార్! నేను సుధీర్ నే మాట్లాడుతున్నా!” “మీరోసారి బ్రాంచ్ కు రాగలరా?” “అలాగే సార్! మరో అరగంటలో వస్తాను.” ఫోన్ పెట్టేసాడు మేనేజర్. ఈ మధ్యనే బ్రాంచ్ కు కొత్త మేనేజర్ వచ్చారు. నాకు కొత్త మేనేజర్ తో పరిచయం లేదు. కానీ వారు నన్ను ఎందుకు రమ్మన్నారో అర్థం కాక ఆలోచనలో పడిపోయా. మా నాన్న గారు రంగస్వామి గారు, మా ఊరి మాజీ సర్పంచ్. రెండు సంవత్సరాల క్రిందట ప్రమాదంలో చనిపోయారు. నాకు చదువు అబ్బక పోవడంతో ఆరేళ్ళ క్రితం నాలుగు లక్షల పెట్టుబడితో ఎలక్ట్రికల్ షాప్ పెట్టించారు. దేవుడి దయవల్ల, మా నాన్నగారి ఆశీస్సుల వల్ల అంతా బాగానే నడుస్తోంది. వ్యాపారం బాగా నడవడంతో బ్యాంకు వాళ్ళు కూడా పిలచి మరీ లోను ఇచ్చారు. రీపేమెంట్ కూడా బాగానే కడుతున్నాను. కానీ ఇప్పుడు బ్యాంకు మేనేజర్ ఎందుకు పిలిచారో మాత్రం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.

విశ్వామిత్ర 2015 – నవల ( 21 వ భాగము )

ధారావాహికలు
-ఎస్ ఎస్ వి రమణారావు ఎండి ప్రారంభించాడు."ఇది ఒక్స్ మల్టీపర్పస్ ఫ్లైఓవర్ గా మనం చెప్పుకోవచ్చు.మనకు మల్టీపర్పస్ డామ్స్ గురించి తెలుసు.అవి తాగునీరు ఇస్తాయి.సాగునీరు ఇస్తాయి.విద్యుత్ తయారీకి అవసరమైన నీరుకూడా ఇస్తాయి.దీనిని నేను మల్టీపర్పస్ ఫ్లై ఓవర్ అని దేనికి పిలుస్తున్నాను అంటే,ఈఫ్లైఓవర్ ట్రాఫిక్ సమస్యలను తీర్చడమే కాకుండా,మన విద్యుత్ అవసరాలను తీరుస్తుంది.కురిసే ప్రతి వర్షం బొట్టును రక్షించి మననీటి కొరతను కూడా నివారిస్తుంది.కాబట్టి దీనినొక ఇంజనీరింగ్ ఫీట్ గా చెప్పుకోవచ్చు.ఇప్పుడు నేను మీకు ఆర్టిస్టిక్ డిజైన్ ఆఫ్ ఫ్లైఓవర్ చూపిస్తాను."స్క్రీన్ మీద ఒక చిత్రం కనబడింది. ఎండి ఆచిత్రాన్ని వివరించడం ప్రారంభించాడు.".ఇది విశ్వామిత్ర మాకు మొదట చూపించిన ఆర్టిస్టిక్ పిక్చర్ ఆఫ్ ద ఫ్లైఓవర్స్.అవి రెండు ఫ్లైఓవర్ లు.ఈరెండు ఫ్లైఓవర్ లు ఆపోజిట్ స్లోప్స్ ప్రిన్సిపుల్ ఆధారంగా డిజైన్ చేయడం జరిగింది.ఒక ఫ్ల

శ్రీరామ పట్టాభిషేక సంరంభం

ధారావాహికలు
అయోధ్యానగరమంతా సంతోషంతో కళకళలాడుతున్నది. శ్రీరాముడు తమ ఏలికగా పట్టాభిషేకం జరుపుకొబోతున్నాడు అని అయోధ్య పౌరుల హర్షం ఆకాశం అంటుతూ ఉంది. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకానికి కావలసిన సన్నాహాలన్నీ భరతుడు (ఆనాడు దశరథమహారాజులాగా) చూసుకుంటున్నాడు. సుగ్రీవుడితో ఆ మహాయశుడైన భరతుడు 'కపిరాజా! శ్రీరామ పట్టాభిషేకం జరగబోతున్నదికదా! సమస్త సముద్రజలాలు, నదీజలాలు వెంటనే తెప్పించే భారం నీదే' అని సుగ్రీవుణ్ణి అర్థించాడు. వెంటనే సుగ్రీవుడు శీఘ్రవేగులూ, అత్యంత బలపరాక్రమ సంపన్నులూ అయిన నలుగురు వానర ప్రముఖులను పిలిచి - ‘ఇప్పటికిప్పుడు మీరు నాలుగు సముద్రాల జలాలు తీసుకొని రావాలి' అని వాళ్ళను ఆదేశించాడు. నవరత్నస్థిగీతకాంచన కళాశాలను వారికందజేశాడు. “సూర్యోదయాత్పూర్వమే ఆ జలాలతో మీరిక్కడ ఉండాలి" అని సుగ్రీవాజ్ఞాగా వారినాయన ఆదేశించాడు. గరుడానిల వేగంతో వాళ్ళు ఆ పని నిర్వహించటానికి వెళ్ళారు. వీళ్ళే కాకుండా జాంబవంతుడూ, హనుమంతుడ

ఏప్రిల్ – 2018

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: వంకాయన చెఱుకు రసము వడివడిఁ యుబికెన్ గతమాసం ప్రశ్న: చైనాలో తెలుగుఁ నేర్చి చక్కగ బ్రదికెన్ ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ ఐనా యెందుకు తొందర వైనము తెలియని పలుకులు వ్యర్ధము గాదా వీనుల విందగు భాషని చైనాలో తెలుగుఁ నేర్చి చక్కగ బ్రదికెన్ అయినాపురపు శ్రీనివాసరావు,సెయింట్ లూయిస్, మిస్సోరి. (కొన్ని సవరణలతో) జానుగ తెలుగునుఁ జది

వీక్షణం సాహితీ గవాక్షం- 67

శీర్షికలు
-పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ వీక్షణం 67 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కథా రచయిత శ్రీ అనిల్ రాయల్ గారింట్లో జరిగింది. శ్రీ సి.బి.రావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా కథల్లోని "రెడ్ హేరింగ్స్" అనే అంశమ్మీద సోదాహరణమైన ఉపన్యాసాన్నిస్తూ తన కథ "శిక్ష" ను మరొకసారి సభకు పరిచయం చేసారు అనిల్ రాయల్. "రెడ్ హేరింగ్స్" ని తెలుగులో "ఎండు చేపలు" అని అనొచ్చని అన్నారు. "శిక్ష" కథలోని "రెడ్ హేరింగ్స్" ని కనిపెట్టే కథా క్విజ్ అందర్నీ అలరించింది. ఆ తరువాత శ్రీ చెన్న కేశవ రెడ్డి గారు సినారె కవిత్వాన్ని వినిపించేరు. ఆ సందర్భంగా శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు సినారె దుబాయి యాత్రలో తమ అనుభవాలు సభలోని వారితో పంచుకున్నారు. ఎప్పటిలాగే శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యాన జరిగిన సాహితీ క్విజ్ అత్యంత ఆసక్తి దాయకంగా జరిగింది. విరామం తర్వాత శ్రీ సి.బి.రావు హైదరాబాదులో తమ ఆధ్వర్యాన నెల నెలా నిర్వహిం