Month: December 2018

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి అనుభూతివాదం, అనుభూతి కవిత్వం అనే పేర్లు శ్రీకాంతశర్మగారి తర్వాత సాహిత్యంలో మరింత బలంగా పాతుకున్నట్లుగా తోస్తుంది. 1982లో నందిని సిద్దారెడ్డిగారి 'అనుభూతివాదం', 1982లో కొడవంటి లీలామోహనరావుగారి 'అనుభూతి కవిత్వం', 1983లో డా, ముదిగొండ వీరభద్రయ్యగారి 'అనుభూతి కవిత్వం' (కొన్ని వ్యాసాలు), 1987లో డా|| జి.వి. సుబ్రహ్మణ్యంగారి 'అనుభూతి కవిత్వం', 1989లో ఆర్. యస్. సుదర్శనంగారి ‘అనుభూతి కవిత్వం’ - ఈ వ్యాసాలన్నీ వివిధ పత్రికలలోనూ, సంకలన గ్రంథాలలోనూ ప్రచురితమయ్యాయి. వీరి తర్వాత పైన పేర్కొన్న విమర్శ వ్యాసాలు ప్రచురితం కావటమే ఇందుకు తార్కాణం. ఈ కాలంలో అత్యధిక విమర్శకులు అనుభూతిని కవిత్వ ప్రధాన లక్షణంగా గుర్తించటం కూడా మనం గమనించాల్సిన అంశం. కుందుర్తిగారి అనుభూతివాదం అనే పదాన్ని ప్రయోగించటమే కాకుండా, “తిలక్ తాను ప్రధానంగా అనుభూతి వాదినని బల్లగుద్ది చెప్పుకున్నాడు” అని వీరు చెప్పారు. “పాఠక