Month: January 2019

ఆచారాల పేరిట

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు ఆచారాలపేరిట అజ్ఞానానికిలోను కాకండి. విచారాలపేరిట విజ్ఞానానికిదూరంకాకండి. ఆచార్యులపేరిట అజ్ఞానులనుఆదరించకండి. జాతకాలపేరిట జీవితాలనుబలిచేసుకోకండి. కులాలపేరిట కలకలం సృష్టించకండి. మతాలపేరిట మారణహోమం మొదలెట్టకండి. దైవంపేరిట దగాచేయకండి. నమ్మినవారిని నట్టేటముంచకండి. ప్రవచానాలపేరిట అసత్యాన్నిప్రచారంచేయకండి. మతమార్పిడిపేరిట మూర్ఖులనుముంచకండి. భక్తిముసుగులో భ్రమలనుప్రోత్సహించకండి. శక్తిపాతంపేరుతొ సత్యాన్నివక్రీకరించకండి. దైవానుగ్రహానికి దగ్గరదారులువెతకకండి. ****

త్యాగయ్య జీవిత విశేషాలు

- అక్కిరాజు ప్రసాద్ (రవిప్రసాద్ ఆదిరాజు సౌజన్యంతో) (చిత్రం - రఘునాథ్ దెందుకూరి) త్యాగరాజ స్వామి వైదిక వెలనాడు కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వీకులు 1600 ప్రాంతంలో ఆంధ్ర నుండి తంజావూరు ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడి నాయక రాజుల ఆశ్రయంలో జీవించారు. త్యాగయ్య తండ్రి రామబ్రహ్మం తంజావూరు మహారాజా తులజాజీ -II మన్నననలు పొందిన వారు. రామాయణాన్ని హరికథలు, ప్రవచనాల రూపంలో ప్రచారం చేసే వారు. కుంబకోణం వద్ద మరుదనల్లూరులో ఒక శైవమఠాధిపతి వద్ద ఆయన రామతారక మంత్రోపదేశాన్ని పొందారు. త్యాగరాజ పుట్టక ముందు తిరువారూరులోని త్యాగరాజస్వామి (నాట్యం చేసే యోగి రూపంలో ఉంటాడీ శివుడు) రామబ్రహ్మం దంపతులకు స్వప్న సాక్షాత్కారమిచ్చి నారదుని అవతారమై ఒక కుమారుడు జన్మిస్తాడు, అతనికి త్యాగరాజు అని నామకరణం చేయమని పలికాడు. 1767వ సంవత్సరం మే 4వ తేదీన త్యాగరాజస్వామి జన్మించారు. తల్లి పాలు తాగుతున్న పసిబాలుడు సంగీతం వినబడితే పాలు త్ర

ఇంటర్వ్యూ

ధారావాహికలు
ఈజీ ఈజీ గా ఇంటర్వూస్ చేసేద్దాం! అమరనాథ్ . జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257   ఇంటర్వ్యూ అంటే చాలామందికి మాటల్లో కంగారు, గుండెల్లో బేజారు ,ఎదుటివారిని చూస్తేనే భయాలు, పొడారిపోయే గొంతులతో , స్వాధీనం తప్పేశరీరాలతో. మొత్తంగా శరీరం మరియు మనసు వేటగాడి చేతిలో చిక్కబోయే లేడి పిల్లలా గజ గజ వణికి పోతూ వుంటారు. ఇది నిజంగానే మనసు ఆడించే ఆటే! ఎందుకని చాలామందికి ఇలా జరుగుతుంటుంది? ఎక్కువ భాగం ఈ పరిస్థితికి కారణం ఇంటర్వ్యూ ల్లో ఎదుర్కొబోయే విషయాల పట్ల పూర్తిగా అవగాహన లేకపోవటం ఒకటైతే ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనే ఆందోళన మరో వైపు మనసును ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మన మన మెదడులో ఆడ్రెనాలిన్ (Adrenaline) అనే న్యూరోట్రాన్సమీటర్ Stressful గా భావించే situations లో మన శరీరాన్ని అనేక మార్పు చేర్పులకు గురిచేస్తూ ఉంటుంది. దీనివలన మన శరీరం అనేక మార్పులకు గురి అవుతూ గుండె దడ, శ్వ

రావణుడి వివాహం

ధారావాహికలు
-అక్కిరాజు రామాపతి రావు లంకారాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత దశగ్రీవుడు తన చెల్లెలు శూర్పణఖను, కాలరాక్షసుడి కొడుకైన విద్యుజ్జిహ్వుడి కిచ్చి పెళ్ళి చేశాడు. ఒకనాడు లంకాధిపతి వేటకు వెళ్లి, అక్కడ - నవయౌవనవతి అయిన తన కూతురితో చెట్టుకింద నిరీక్షణ దృక్కులుతో ఉన్న ఒక దైతుణ్ణి చూశాడు. రావణుడు విస్మయం చెంది 'ఈ నిర్జన వనంలో మీరెందుకిక్కడ ఉన్నారని' ఆ దైతుణ్ణి అడిగాడు. అప్పుడా పిల్ల తండ్రి 'నేను దితి పుత్రుణ్ణి. నన్ను మయు డంటారు. దేవతలూ, రాక్షసులూ కూడా నాకు దగ్గర వాళ్ళే. దేవతలు నా ప్రజ్ఞాశాలితను మెచ్చి హేమ అనే అప్సరసను నాకు భార్యగా ఇచ్చారు. ఆమెతో నేను సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఉండేవాణ్ణి. ఇంతలో హేమ దేవతల పనిమీద స్వర్గానికి వెళ్లి ఇప్పటికి పదమూడు సంవత్సరాలైనా ఇంకా తిరిగిరాలేదు. పద్నాలుగో సంవత్సరం నేను నా ప్రజ్ఞనంతా వినియోగించి స్వర్ణప్రభా విలసితమైన, వజ్రవైడూర్య శోభితమైన ఒక నగరాన్ని నా మాయాశక్తితో నిర్

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి 1989లో ఈ వాదంపై వెలువడిన మరో వ్యాసం ఆర్,ఎస్, సుదర్శనంగారి "అనుభూతి కవిత్వం" అస్తిత్వవాదంలో మనిషికీ బాహ్యప్రపంచానికీ ఆత్మీయమైన సంబంధం కావాలేకానీ, ఆలోచనాత్మకంగా ఉండదని పేర్కొంటూ, అనుభూతి వాదాన్ని అస్తిత్వవాదంతో ముడిపెట్టారు. ముందు పేర్కొన్నట్లుగా, ఈ కాలంలోనే 'అనుభూతి కవిత్వం', ‘అనుభూతివాదం' అనే అంశాలపై ఏవిధంగా చర్చ సాగుతుందో, అదేవిధంగా అనుభూతి అనే అంశంపై కూడా చర్చసాగటం గమనార్హం. కవి పొందిన అనుభూతిని పాఠకులకు అందించగలగాలనీ, అసలు కవిత్వానికి గీటురాయి అనుభూతే అని వీరందరి అభిప్రాయం కావటం ముదావహం. ఇలా అభిప్రాయపడిన వారిలో ఎక్కువగా ప్రత్యేకించి 1960 తర్వాత వారు కావటం కూడా గమనించాల్సిన మరో విషయం. వీరు కేవలం అనుభూతి గురించి చర్చించటమేకాక, వారి వారి అనుభూతులను కావ్యరూపంలో వ్యక్తం చేసిన వారు కావటం కూడా గమనించాల్సిన మరో విషయం. కేవలం అనుభూతిని గురించి మాత్రమే చర్చించిన వారిలో ముఖ్యులు త

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ముందస్తుగా పద్యకవితాసక్తులందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాఠకులకు శుభాకాంక్షలు తెలుపుతూ మాకు అందిన పద్యాలు: భైరవభట్ల శివరామ్, కొక్కిరాపల్లి ఆ:   నూత్న వత్సరంబు నూలుకొనగరమ్ము ఆశలన్నితీర్చ అవనిజనుల యువతమేధనందు యోగ్యతలరుచుండ భావిజీవితంబు బంగరవగ ఆ:  రైతుకూలిమనసు రమ్మమైవెలుగొంద కొత్తపంటలన్ని కొలువుదీర ప్రకృతిసహకరించి ఫలితమివ్వంగను భావిజీవితంబు బంగరవగ ఆ:   మనుషులందుమార్పు మంచినికోరంగ

సంపాదకవర్గం

సుజననీయం
ప్రధాన సంపాదకుడు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకవర్గం: తమిరిశ జానకి శైలజా మిత్ర డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ Cheif Editor: M J Thatipamala Editorial Board: Janaki Tamirisa Shailaja Mitra Dr. Bhimapally Srikanth