Month: February 2019

సంగీత రంజని మార్చి 2019

I. కళావతి రాగం: కళావతి అంటే కళలు తెలిసిన స్త్రీ. చదువుల తల్లి సరస్వతి దేవికి మరో పేరు కళావతి. పారుడు అనే ఋషికి, పుంజిక స్థల అనే అప్సరకు పుట్టిన కూతురుకు కళావతి అని పేరు పెట్టారు. పార్వతీ దేవి ఆమె సౌందర్యానికి మెచ్చి ఆమెకు పద్మినీ విద్యను ఇచ్చింది. తరువాత కళావతి స్వరోచి ని వివాహం చేసుకోంది. తుంబురుని వీణ పేరు కూడా కళావతి. కర్ణాటక సంగీతం లోని కళావతి రాగం 16 వ మేళకర్త చక్రవాక జన్యరాగం. ఉపాంగ రాగం, ఔడవ-వక్ర షాడవ రాగం. ఆరోహణలో గాంధార, నిశాధాలు వర్జ్యం. అవరోహణలో నిషాధం వర్జ్యం. అపురూపమైన రాగం, కరుణ రస ప్రధానమైన రాగం. ఈ రాగం త్యాగరాజస్వామి సృష్టి. విళంబ కాలం లో పాడితే బాగుంటుంది. ఆరోహణ: స రి మ ప ద స ..అవరోహణ: స ద ప మ గ స రి స ..శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి ధైవతం స్వర స్థానాలు. హిందుస్తానీ సంగెతం లో కూడా ఒక కళావతి రాగం ఉంది. అది కర్ణాటక సంగీతం లోని వలజి రాగానిక

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
కుబేరుడి హితబోధ డా. అక్కిరాజు రామాపతిరావు ఇట్లా దశకంఠుడు చెలరేగిపోతుండగా కుబేరుడు తమ్ముడి ప్రవర్తనకు బాధపడి దూత నోకరిని హితవు బోధించడానికి పంపించాడు. ఆ దూత లంకకు రాగానే ముందు విభీషణుణ్ణి దర్శించాడు. విభీషణుడు ఆ దూతను ఆదరించి కుశలప్రశ్నలు వేసి ధనదుడి క్షేమసమాచారం కనుక్కున్నాడు. సమయం, సందర్భం చూసి విభీషణుడు ఆ దూతను రావణుడి సమక్షానికి తీసుకొని వెళ్లి అతడు వచ్చిన దెందుకో మనవి చేశాడు. అప్పుడా దూత ధనదుడి మాటలుగా ఇట్లా చెప్పాడు. “నీవు నా తమ్ముడివి కాబట్టి నీ మంచి చెడ్డలు తెలుసుకొని బోధించడం నా కర్తవ్యమ్, ఎందుకంటే సోదరబంధం విడదీయ రానిది. నీవు ఈ మధ్య ఋషులను, దేవతలను క్రూరంగా హింసిస్తున్నట్లు తెలుసుకున్నాను. నందనవనాన్ని ధ్వంసం చేసినట్లు విని బాధపడ్డాను. క్రూరకర్మలన్నిటికీ తగిన దండన ఉంటుందని నీకు తెలుసు ననుకుంటాను. పాపపు పనులు చేయకూడదు. ఊహించనైనా కూడదు. స్వానుభవం ఒకటి చెపుతున్నాను విను. ‘శివానుగ్ర

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య తాను చేసినచేత తరుణిమేనను నిండె కీర్తన: పల్లవి: తాను చేసినచేత తరుణిమేనను నిండె వీనులు చల్లుగ నిట్టె విన్నవించరే చ.1.జక్కవ గుబ్బలమీద చంద్రోదయములాయె చుక్కలు మొలచెనిదె సొంపు మోవిని అక్కజపుతురుమున నద్దమరేతిరి నిండె వెక్కసపు పతికిది వేళ చెప్పరే ||తాను|| చ.2.కనుచూపు తామెరల గక్కునను దెల్లవారె యెనయెని తలపోత నెండలు గాసె పనివడి విరహాన పట్టపగలై తోచె ననిచిన పతికి సన్నలు శేయరే ||తాను|| చ.3.వడిగొన్న జవ్వనాన వసంతకాలము వచ్చె పొడవైన కళలను పున్నమ గూడె యెడమిచ్చి శ్రీవేంకటేశుడింతలో గూడె బడివాయకుండు దన్ను బాస గొనరే ||తాను|| (రాగం: శంకరాభరణం; రేకు సం: 195, కీర్తన; 7-561) విశ్లేషణ: తాను చేసినచేత తరుణిమేనను నిండె వీనులు చల్లుగ నిట్టె విన్నవించరే ఆ శ్రీనివాసుడు చేసే శృంగారచేష్టలకు, తల్లి అలమేలుమంగమ్మ శరీరమంతా తమకంతో, మైమరుపుతో నిండి న

అమెరికా ఉద్యోగ విజయాలు – 3

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న అమెరికా ఉద్యోగ విజయాలు - 3 మాటే మంత్రము “బావా, మొన్ననే ఒక ఇంటర్వూకి వెళ్ళాను. నువ్వు చెప్పినట్టే నెమ్మదిగా వాళ్ళకి అర్ఢమయేటట్టు జవాబులు చెప్పాను. సరిగ్గా నువ్వు అన్నట్టు ఆ బిహేవిరల్ టైపులోనే అడిగారు అన్ని ప్రశ్నలూ. అన్నీ బాగానే చెప్పానుగానీ, ఆ హైరింగ్ మేనేజరు నేను చేతులు కట్టుకుని కూర్చుంటే, మాటిమాటికీ నా చేతుల వేపే చూస్తూ కూర్చున్నాడు. ఎందుకంటావ్?” అడిగాడు అర్జున్, ఆరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి. కృష్ణ కొంచెం నొచ్చుకుంటూనే, ఇబ్బందిగా నవ్వి అన్నాడు, “అవును. నేను ఈ విషయం కూడా ముందే చెప్పవలసింది. పోనీలే మిగతా ఇంటర్వూలలోనూ, తర్వాత ఉద్యోగం వచ్చాక నీకు ఉపయోగ పడుతుంది. చాల ముఖ్యమైనది ఇది. విను” అని కొంచెం ఆగాడు. “ఏమిటది, బావా?” అడిగాడు కృష్ణ. కృష్ణ సాలోచనగా చెప్పటం మొదలుపెట్టాడు. “ముఫై ఐదేళ్ళయిందేమో, నేనిక్కడే ఒక హైటెక్ కంపెనీలో పనిచేస్తున్నపుడు ఒక సంఘటన జరిగింది. అప్పటి

మురికి

కథా భారతి
 -ఆర్ శర్మ దంతుర్తి అప్పల్నాయుడు సర్పంచి అయినప్పటినుండీ డబ్బులు వెనకేసుకోవడంలో చూపించిన చొరవ మరొకరెవరికీ చేతకానికిది. ఎక్కడ ఏమూల పైసా దొరికినా అందులో నాయుడి చేతిలోకి వాటా రావాల్సిందే. అయితే ఎలా తినేసినా కొంతలో కొంత ఊరికి మంచి చేసినట్టే లెక్క. మరుగుదొడ్లు కట్టించడం, వాటిని రోజూ క్లీన్ చేయడానికో టీం ఏర్పాటు అలా మొత్తంమీద ఏదో ఒక మంచి చేస్తూంటే ఎలక్షన్ లలో నెగ్గుతూ వస్తున్నాడు. అయితే మరుగుదొడ్లు కట్టడంలో ఇరవై శాతం తినేసాడనీ, వాటిని రోజూ క్లీన్ చేయడానికి ఇచ్చే సరుకుల్లో, ఫినాయిల్ కి ఇచ్చే డబ్బులో సగం నాయుడిదేననీ జనం అనుకున్నా మనం అటువంటి పనికిరాని అమాయకపు ప్రశ్నలు అడగరాదు. చేతులు తడవకుండా ఉత్తినే ఎవరూ ఏ పనీ చేయడానికి ఇది సత్యయుగం కాదు కదా? సర్పంచ్ నుంచి, ఎమ్మెల్యే దాకా ఎదిగే సరికి నాయుడికి మూడు కార్లూ, ఒక బంగళా, గేటు దగ్గిర కాపలాకి గూర్ఖా, వీళ్ళందర్నీ చూడ్డానికో పెర్సనల్ సెక్రటరీ ఇలా మందీ మా

పరీక్షలు

ధారావాహికలు
అమరనాథ్ . జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 పరీక్షలంటే ఫియర్ ఫియర్....భయం లేదు మీకిక డియర్ డియర్! జీవితంలో ఏవైనా కొత్త విషయాలను ఎదుర్కొనే ప్రతి సందర్భంలో చాలా మంది తమకు తామే ఒత్తిడికి గురి అవుతుంటారు. ఎందుకంటె ఎక్కవలసిన మెట్లు విజయవంతంగా ఎక్కగలనా లేదా అని! ముఖ్యంగా ఇది ఏంతో మంది విద్యార్థులు పరీక్షలలో ఎదుర్కొనే ఒక ప్రధానమైన సమస్య. చదువులు పూర్తి చేసేంత వరకు ఈ పరీక్షల తాలూకా భయం ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. మరి ఈభయం తాలూకా ఒత్తిడిని మానసికంగా పెంచుకుంటూ వెనకడుగు వేయటమా? లేదా సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకు అడుగులు కడపటమా? అనేది మన చేతిలోనే వుంది. అందుకే ప్రతి విద్యార్థి మొదట తప్పనిసరి గా మననం చేసుకోవాల్సింది సమస్యా పరిష్కారం రెండూ మన చేతిలోనే ఉన్నాయని. సముద్రంలో అలలు తగ్గినా తర్వాత స్నానం చేద్దామంటే కుదిరే పనేనా? అలలనేవి సముద్రం యొక్క సహజ లక్షణం. అదే విధంగా సమస్యలనేవి

నకళ్ళు

కవితా స్రవంతి
-పారనంది శాంతకుమారి నీ ప్రవర్తనలకు నకళ్ళు నీ పిల్లలు వారిలోని పరివర్తనకు నీ ప్రవర్తనలే ఎల్లలు నీ బుద్ధులే నీ పిల్లలకు సుద్దులు నీ ముద్దులే నీ పిల్లలకు అమృతపు ముద్దలు నీ ఆలోచనలే నీ పిల్లల కాచరణీయాలు నీఆశీస్సులే నీ పిల్లలకు ఉషస్సులు నీ ప్రేమే నీ పిల్లలకు గరిమ(గొప్పతనము) నీ సహనమే నీ పిల్లలకు సంపద నీ ఆవేశమే నీ పిల్లలకు ఆపద నీ ఒర్పే నీ పిల్లలకు తీర్పు నీ నేర్పే నీ పిల్లలకు చేర్పు నీ నీతే నీ పిల్లలకు రీతి నీ నిజాయితీవే నీ పిల్లలకు రాయితీ నీ నిబద్ధతే నీ పిల్లల ఉద్ధతి నీ పెచ్చే(అధికము) నీ పిల్లలకు ఉచ్చు నీ ధర్మమే నీపిల్లల సుఖాల మర్మం నీ అంతరంగమే నీ పిల్లల జీవితరంగం

వీక్షణం సాహితీ సమావేశం-78

వీక్షణం
-వరూధిని వీక్షణం 78 వ సాహితీ సమావేశం కాలిఫోర్నియా బే ఏరియాలోని ప్లెసంటన్ లో ఫిబ్రవరి 10, 2019 న శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు, శ్రీమతి ఉమా వేమూరి గారి ఇంట జరిగింది. ఈ సమావేశానికి శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు అధ్యక్షత వహించారు. ఈ సభలో ముందుగా శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి కథ "ఉద్యోగం" మీద కథా చర్చ జరిగింది. కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు. ఒక మధ్యతరగతి వాడు ఉద్యోగం కోసం ఎన్ని పాట్లు పడాలో వివరించే కథ ఇది. ఇక కథ పట్ల సభలోని వారు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతూ, చిన్న చిన్న విషయాలు వివరంగా చెప్పడం కొ.కు స్టైల్ అనీ, కథాంశం కంటే చెప్పే విధానం చాలా బావుందని, కథ చదువుతున్నపుడు కాలమానపరిస్థితులు చక్కగా తెలుసుకోగలిగిన కథ, ఆశ, నిరాశల మధ్య ఊగిసలాటని వ్యంగ్యంగా చెప్పడం బావుందని, కథ వేగంగా నడిచినా కథలో వేగం లేదని, చిన్న ఉద్యోగి కేపిటలిస్టిక్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలియజెప్పే కథ అనీ అన్నారు

🌷నీ పరిచయం🌷

కవితా స్రవంతి
నీ పరిచయం రచన శాంతి కృష్ణ, హైదరాబాద్. 9502236670 వసంతపు పరిమళాలను అద్దిందేమో... చివురులు తొడిగాయి శిశిరపు గురుతులన్నీ...! ప్రతి వేకువ కొన్ని నవ్వుల పువ్వులతో ప్రతి రేయి తీయని ఊసులతో.... మన మాటలన్నీ కోయిల కూజితాలుగా మధుర ధ్వనులయ్యాయి... మన నవ్వులన్నీ విప్పారిన కుసుమాలుగా నందనవనమయ్యాయి... మన మనసులు మళ్ళీ పురి విప్పిన మయూరాలై నర్తించడం మొదలెట్టాయి... మనకే తెలియని సరికొత్త లోకాన్ని సృష్టించుకుంటూ... ఇప్పుడేమైందో తెలియదు ఆ మైత్రీవనం వాడిపోతోంది... వసంతపు పరిమళం జాడలేక... ఇప్పుడు.... రాత్రంతా నడచిన జాబిలి అడుగులు వేకువ కళ్ళకు నిట్టూర్పులుగా మిగిలాయి.... కొన్ని గురుతులంతే కాలాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి.... కరిగి పోయిన క్షణాలను లెక్కించుకుంటూ...!!