Month: February 2019

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి వీళ్ళు ఈ కాలంలో ఎందుకు ఇంత తీవ్రంగా అనుభూతి గురించి చెప్పాల్సివచ్చింది. బహుశా, వీరు రచనలు చేస్తున్న కాలంలో అంటే సమకాలీనంగా వస్తున్న రచనలను ఆధారంగా చేసుకుని చెప్పి ఉండవచ్చేమో. లేక ఇప్పటి వరకూ ఉన్న కవిత్వం ఇలా ఉంది కానీ, అలా కాక ఇలా ఉండాలి అని మార్గనిర్దేశం చెయ్యటానికి పూనుకున్నారా? లేక మానవుడు అనుభూతి జీవి కాబట్టి మానవుడికి కావలసిన అనుభూతిని మనం మన రచనల ద్వారా అందించాలనే అనుభూతి స్పృహ వీరందరికీ ఒకేసారి కలిగిందేమో. అనుభూతివాదానికి అనుకూలంగానైనా సరే, ప్రతికూలంగానైనా సరే జరిగిన విస్తృతమైన చర్చల వల్ల 1966ప్రయోగంలోకి వచ్చిన 'అనుభూతివాదం' అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనుభూతి లేని కవిత్వం ఏనాడు లేదు? అంటూ మనం ఆధునిక కవిత్వం దాకా వచ్చిన కవిత్వంలోని అనుభూతి అంశాలను పరిశీలించుకున్నాం. విదియనాటి చంద్రునిలా అనుభూతి రేఖలున్న రచనలు, పూర్ణిమనాటి చంద్రునిలా సమగ్రానుభూతిని పొందిన

నిధి చాల సుఖమా

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి ఆ రోజుకి చేయాల్సిన పనంతా అయిపోయాక తనకిచ్చిన వేరే గదిలోకి పోయి పడుకోబోయే ఇల్యాస్ ని పిలిచేడు మహమ్మద్ షా, "రేపు మనింటికి ఓ ముల్లా గారూ, ఆయన స్నేహితులూ మరో కొంతమంది చుట్టాలూ వస్తున్నారు. ఓ మేకని కొట్టి వాళ్లకి విందు చేయాలి. నువ్వు చేయగలవా?" "సరే, రేపు సాయంత్రానికి కదా?" అదెంత పని అన్నట్టూ చెప్పేడు ఇల్యాస్. "నీకు వయసు వల్ల కష్టం అవుతుందేమో అని అడిగాను అంతే. కష్టం అయితే వేరే వాళ్ళకి చెప్తాను ఈ పని." "అబ్బే ఏవీ కష్టం లేదు. నేను దగ్గిరుండి చూస్తాను." "మంచిది. మీ ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది కదా?" "లక్షణం గా ఉంది. ఇక్కడికొచ్చి మీ ఇంట్లో పనిలో జేరాకే కదా అసలు మేమిద్దరం సంతోషంగా ఉండడం మొదలైంది." "పోనీలే, అదే చాలు కదా ఈ వయసులో?" మర్నాడు షా గారి ఇంట్లో విందు జరుగుతూంటే ఇల్యాస్, వాళ్ళావిడా అన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షణ. వచ్చినవాళ్లకి వడ్డన, గ్లాసుల్లో వోడ్కా అవీ సర

పారాడే పిల్లడు

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు పొత్తిళ్ళలో ఉన్న పిల్లడు ఆ అవస్థనుండి బయటపడి గబగబ పారాడటం మొదలెడితే తల్లికి ఎంతో ఆనందం కలుగుతుంది. అదే భావన, అనుభవం జనవరి 27న సిలికానాంధ్ర కుటుంబసభ్యులకు కలిగింది. ఆ రోజు సిలికానాంధ్ర రెండేళ్ళ క్రితం స్థాపించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra) మొదటీ స్నాతకోత్సవం జరిగింది. అత్యద్భుతంగా జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో సర్టిఫికేట్, డిప్లోమా, మాస్టర్స్ కోర్సులలో చదువులు పూర్తిచేసిన విద్యార్థులు సర్టిఫికేట్లు అందుకొన్నారు. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' చూడండి. అలాగే, కాకర్ల త్యాగరాజస్వామి వారు పుష్య బహుళ పంచమి (1847 సంవత్సరం)న సిద్ధి పొందారు. తెలుగులో మధురమైన కృతులు రచించి స్వరపరచిన త్యాగయ్య గురించి 'సంగీతరంజని ' లో చదవండి. తీపి తెలుగురా-సొగసు చూపు తెలుగురా-ఎదల ఊపు తెలుగురా బంగారు తెలుగురా పై పలుకులు బులుసు వెంకటేశ్వర్లు గారివి.

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: శివరాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్ గతమాసం ప్రశ్న: వే-లం-టై-ను అనే నాలుగు అక్షరములు వరుసగా ఒకొక్క పాదారంభలో యుండునట్లు మీకు నచ్చిన ఛందస్సులో ప్రేమపై పద్యము వ్రాయాలి ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి . రాజేశ్వరి, న్యూజెర్సీ వేయి జన్మల కైనను వేచి వేచి లంక బిందెలు దెఛ్చినే లక్ష ణముగ టైము గమనించి నినుజేరి మోము గలిపి నుంకు  జేసెద ననునమ్ము మంకు మాని