Month: April 2019

జోల పాట

కవితా స్రవంతి
~ తిరునగరి శరత్ చంద్ర హైదరాబాద్ చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకున్నాడు రేయి మంచంపైన నక్షత్రాలు లాలిపాట పాడుతున్నాయి మబ్బులు వీవన వీస్తున్నాయి తన నీలి నీలి ముంగురులు గాలికి రెపరెపలాడుతుంటే ఉలిక్కిపడి నిద్రలేచాడు చంద్రుడు ఇది యేమిటి వింతగా ఉందే! పసిపాపలను నిద్ర పుచ్చడానికి 'చందమామ రావే జాబిల్లి రావే' అని జోలపాటలు పాడే తల్లులకు ఉపయోగపడే ఈ చంద్రునికి లాలిపాటలు పాడడం కొత్తగా గమ్మత్తుగా ఉందే అనుకుంటూ మళ్లీ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు చంద్రుడు. నిదురపోతూ ముద్దొస్తున్న చంద్రునికి దిష్టి తీయడానికి చీకటిరేఖను త్రుంచిందొక మేఘం. చంద్రుడు హాయిగా నిదురపోవడానికి తీయతీయని రాగాలను వాడుకున్నాయి నక్షత్రాలు తమ లాలిపాటలో.. సౌందర్యం వర్షించే సౌజన్యం దీపించే సౌశీల్యం నడయాడే సౌకుమార్యం జాలువారే ఆ చంద్రున్ని చూసి స్వర్గలోకాలు చిన్నబోయాయి. మనోవీవనలతో వీచి

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య యిందుకంటె నున్నదదే యెంచఁగ మూలధనము ఈ కీర్తనలో అన్నమయ్య ప్రతిపాదంలో “మూలధనం” అనే మాటను వాడారు. మనం ఈ నాటి అర్ధంలో చూస్తే మూలధనం అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క కార్యక్రమము కొనసాగుటకు అవసరమైన పెట్టుబడి ధనము. దీనిని కంపెనీ వాటాలవలన కాని, ఋణపత్రములవలనకాని, అప్పువలనకాని, గత సంవత్సరములలో కలిగిన లాభాంశముల వలన కాని సేకరింపవచ్చును. కానీ, కొన్ని శతాబ్దుల క్రితం ధనవంతులు తమ వద్ద మిగిలి ఉన్నధనాన్ని భూమిలో ఒకచోట మూటగట్టి దాచిపెట్టుకుని అవసరమైనపుడు తీసి వినియోగించేవారు. ఇంకా బాగా ధనవంతులైతే లంకెల బిందెల్లో దాచుకునేవారు. ఈ కీర్తనలో అన్నమయ్య లౌకిక మూలధనం కాక శృంగారపరమైన మూలధనం ఏమిటో వివరిస్తున్నాడు. అన్నమయ్య అనేక కీర్తనల్లో ఈ మూలధనం అనే ప్రస్తావన ఉంది. "మేలులో సాకారము మించులోకము భాగ్యము తాలిమితో నీకు మూలధనమాయను" - "సిగ్గులే మూలధనమా చేరి పైకొనఁగరాదా అగ్గమై శ్రీ వేంకటేశుఁడలమఁగాన" అంటూ ప

అమెరికా ఉద్యోగ విజయాలు – 5

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా..’ ఆరోజు కృష్ణ ఇంట్లో భోజనాలు అయాక, కృష్ణ అర్జనుడితో అన్నాడు, “వసంత ఋతువు వచ్చేసిందిగా.. అలా లేక్ ఆస్టిన్ ఒడ్డున కూర్చుని మాట్లాడుకుందాం పద” అన్నాడు. “మీరిద్దరూ వెళ్ళండి. నిర్మల వస్తానంది, మా ఇద్దరికీ వేరే పనుంది” అంది రుక్మిణి. “అయితే ఎక్కడో సేల్ వుంది, మేం వేరే వెడతాం అని అర్ధం అన్నమాట. సరే వెళ్ళండి. మేము ఒక గంటా, రెండు గంటల్లో వస్తాం” అన్నాడు కృష్ణ. ఆదివారం అవటం వల్ల లేక్ ఒడ్డున చాలమంది జనం వున్నారు. ఇద్దరూ దూరంగా ఒక చెట్టు దగ్గర కూర్చున్నాక , అర్జున్ అన్నాడు. “బావా, తాము చేసే ప్రతి పనిలోనే కాక, వారి జీవితంలో కూడా అడుగడుగునా విజయం సాధించాలని ప్రతివారికీ వుంటుంది. కానీ ఆ విజయ పథంలో విహరించటం ఎలా?” కృష్ణ అన్నాడు, “ముందుగా అసలు విజయం అనే మాటకి అర్ధమేమిటో తెలుసుకోవటం అవసరం. ఎన్నో తెలుగు, హిందీ సినిమాల్లోనూ, కొన్ని ఇంగ్లీషు సినిమాల్లోనూ చూస్

ఇక్కడికెందుకొచ్చాను

కథా భారతి
- భారతీనాథ్ చెన్నంశెట్టి ఇక్కడికెందుకొచ్చానబ్బా, అంటూ మిత్రుడు, శాత కర్ణి, వాట్సప్ గ్రూపులో తన స్వగతం పంచిన నాటినుoడి, నాలో అంతర్మథనం మొదలయ్యిoది. అసలు నేనెoదుకు వచ్చాను, అని, నేనెవ్వరు, అన్న పుస్తకం చదువుతున్న మా ఆవిడను అడిగాను. జీడి పప్పుల కోసం అయ్యుoటుoది. వంట గదిలో పై అరలో వుoటాయి తీసుకోoడి అంది మా ఆవిడ. అసలు ఈ భూమి పైకి ఎందుకు వచ్చానో అని నా సందేహం, అన్నాను. నా బుర్ర తినడానికి వచ్చుoటారు, నా పనికి అడ్డం రాకండి అంటూ విసుక్కుoది. అప్పుడెప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాల రావు అన్నట్టు “తిని తొoగుoటే మనిషికీ గొడ్డుకు తేడా ఏముoటుoది”, మనిషన్నాక కాసిoత జ్ఞానాన్వేషణ వుoడాలి, అంటూ గతంలోకి వెళ్ళాను. ఉన్న చిన్న బుర్రను పగలకొట్టుకోకుoడా, ఆలోచిoచడం మొదలు పెట్టాను. అరవై మూడు సంవత్సరాల జీవన పయనంలో, ఎన్నెన్నో ఎత్తు పల్లాలు. ఎన్నెన్నో వింతలు విశేషాలు. ఎందుకు జరుగుతున్నాయో, అర్ధమయ్యే

” తిండి యావ” (హాస్య కధ)

కథా భారతి
పెళ్ళి చూపుల్లో ముద్దబంతి పువ్వులా ఉన్న సుందరి అందచందాల మీద గాని వాళ్ళు జరుపుతామంటున్న పెట్టిపోతలు, కట్నాల మీద గాని ధ్యాస లేదు సుబ్బారావు కి..ఆడపెళ్ళి వారు పళ్ళాలలో పెట్టిన తినుబండారాల మీదే అతని దృష్టి మొత్తం..ఉంది.చూపులయ్యాక " ఏరా సుబ్బూ.. పిల్ల నచ్చిందా? అనడిగాడు అటు ఆడపెళ్ళి వారికి ఇటు మగ పెళ్లి వారికి మథ్యవర్తిగా వ్యవహరిస్తున్న సుబ్బారావు సొంత మేనమామ..తినబండారాలపై దృష్టి మరచలేని సుబ్బారావు నోరూరించే మైసూర్ పాక్ ఇంకా తినవేంటి అంటూ పచ్చగా హొయలు బోతూ నవ్వినట్లనిపించి అమాంతం ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకుని దాని రుచిని ఆస్వాదిస్తూ 'ఆహా'..అన్నాడు తన్మయంగా.... ఇహనేం మా వెధవాయ్ కి పిల్ల నచ్చింది ఇక శుభస్యశీఘ్రం ..పెళ్ళున నవ్వుతూ అన్నాడు మేనమామ. ఆ నవ్వు అదురుకి టేబిల్ పై నున్న పళ్ళాలలో నీటుగా సర్ది పెట్టిన తినుబండాలు చెల్లా చెదరు అయేసరికి ఆడపెళ్ళి వారు హడలిపోయారు..! ఇక పెళ్ళి చూపుల తతం

సెల్ ఫోను స్తోత్రము

కవితా స్రవంతి
- పుల్లెల శ్యామసుందర్ ఉదయంబున నిద్దుర లేవగనే నిను చూడక డే మొదలవ్వదులే దినమందున ఓ పదిమారులు నిన్ ప్రియమారగ జూడక సాగునటే సెలిఫీలను దీసెడి కేమెరవై పదిమందికి నువ్ చరవాణివియై ముఖపత్రము జూపెడి బ్రౌసరువై సమపాలున నిస్తివి సౌఖ్యములన్ పరిశోధన సల్పెడి గూగులుగా గణితమ్మును జేసెడి యంత్రముగా సమయమ్మునకై గడియారముగా అవతారము దాల్చితి వీవుభళా! సరి తిండియు తిప్పలు మానుకొనీ పనులన్నిటినీ వదిలేసి ప్రజల్ నిను వీడక యుందురు నెల్లపుడూ జగమంతయు భక్తులు నీకెగదా స్పెలియింగుల తప్పుల నన్నిటినీ సవరించుచు రక్షణ చేయవటే మరి చీకటి ద్రోలెడి దీపమువై మము కావగ నీవిట వెలసితివే వినా సెల్లు ఫోనూ ననాదో ననాద సదా స్మార్టు ఫోను స్మరామి స్మరామి భలే ఆండురాయిడ్ ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం అయ్యి ఫోను ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రయాణాలయందున్ ప్రమోదాలయందున్ నినున్ వీడి నేనుండ లేన్సెల్లు ఫోనా ఒకస్పేరు బ్యాట్రీతొ నే నిన్