Month: January 2020

పదవీ విరమణ

కథా భారతి
రచన: సోమ సుధేష్ణ నీరజ నవ్వుతూ వెనక్కి తిరిగి “బాగుంది మీ వరస. పిల్లలు లేని ఇంట్లో ముసిలాడు పాకినట్టుంది. మరీ కొంగుకు వేళ్ళాడుతున్నారేమిటి! ” “కొంగు లేదుగా అందుకే నీ షర్ట్ చివర పట్టుకుని వేళ్ళాడుతున్నాను.” నవ్వుతూ ఆ పక్కనే ఉన్న కుర్చీని బట్టలు ఐరన్ చేస్తున్న నీరజ పక్కకు లాక్కుని కూర్చున్నాడు వివేక్. ‘పదవీ విరమణ తర్వాత మాఆయన మరీ కొంగుకే వెళ్ళాడుతున్నాడు, చిరాగ్గా ఉంది.’ అలవాటైన లేడీస్ లంచులకు, షాపింగులకు ఫ్రీగా వెళ్ళలేక పోతున్నానని స్నేహితురాలు శోభ గొణగడం గుర్తుకు వచ్చి ‘అలా వెంట తిరుగుతూ ఉంటె నాకిష్టమే’ నవ్వుకుంది నీరజ. ఎలాగు ఉద్యోగ పర్వం అయిపొయింది ఇక వాన ప్రస్త పర్వం మొదలు పెడితే మంచిది అని చెప్పిన రావుగారి మాట కాదన లేక వివేక్ ఒక రోజు సత్ సంఘుకు వెళ్ళాడు. “మొక్కుబడిగా రెండు శ్లోకాలు చదివామనిపించి, ఆవురావురు మంటూ భోజనం మీద దాడి ఆ తర్వాత ఒహటే ముచ్చట్లు. ఊళ్ళోని వాళ్ళని, దేశంలోని వాళ్ళన

కొప్పరపు కవులు

సారస్వతం
-టీవీయస్.శాస్త్రి భారతీయ భాషా సాహిత్యాలలో మరే భాషకు లేని విలక్షణమైన స్థానాన్ని తెలుగు భాషా సాహిత్యాలకు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానం. పద్య విద్యకు పట్టంగట్టిన సాహిత్య ప్రదర్శన కళగా అవధాన ప్రక్రియ ప్రత్యేక గుర్తింపును పొందింది నాటి తిరుపతి వెంకటకవులు, కొప్పరపు సోదర కవులు మొదలుకుని ఆధునిక కవుల వరకు పద్యాన్ని అవధాన వేదికలపై ఊరేగించిన మహాకవులెందరో ఉన్నారు. కాళిదాసు కావ్యాలకు సంజీవనీ వ్యాఖ్య రాసి విశ్వవిఖ్యాతి గడించిన మల్లినాథసూరి మెదక్ జిల్లావాడే. వీరి తాతగారైన మల్లినాథుడు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని ఆస్థానంలో శతావధానం నిర్వహించి కనకాభిషేక సత్కారాన్ని పొందాడని ప్రతీతి. బహుశా వీరే మొట్టమొదటి అవధాని అయి ఉంటారు. ఈ విషయమై విస్తృతమైన పరిశోధన చేయవలసి ఉంది.కొప్పరపు సోదర కవులు తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదరకవులు. కొప్పరపు కవులుగా ప్రఖ్యాతులైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, కొప్పరప