Month: February 2020

ఆ అడుగు

కవితా స్రవంతి
- డా . మీసాల అప్పలయ్య ఆ అడుగు నీ జాడనే చెరిపేసింది నీ రేఖా చిత్రాన్నిచించేసి నీ నీడపై ఉమ్మేసి నీ తలంపును కూడా పిసర్లగా కోసి గొనె సంచికెత్తి మౌన వాసనలను విసర్జించే గబ్బిలాల నూయిని గోరి చేసింది అది నీ బ్రతుకు డెడ్ ఎండ్ కు టికెట్ రాసి ఇచ్చింది కన్నెత్తి కూడా చూడని కాలధర్మాన్ని నీ ముంగిటిలోకి విసిరి నిన్ను రెచ్చ్చగొట్టిన ఉచ్చు అయింది నీవు నిలబడ్డానికి చోటునిచ్చిన జీవనాడి కూడా నీ చెయిదం తోనే కుత్తుక తెగి కార్చిచ్చు అంతః కేంద్రంలో నిర్జీవ రేణువయింది ముకుళిత హస్తాలుగా ఆదమరచి నీచుట్టూ నిలబడ్డ నీ బలగం నీ చేతల సైనైడ్ తో కుప్పకూలిన గోడయింది నీవు నిలబిడ్డ నేల నీ మరణపు రొంపయింది నీ సమాధి పై రాయి అయింది చీకటిగోడల మధ్య వెక్కివెక్కి ఏడ్చిన నిందయి పిడిగుద్దులు ఓర్చుకొన్న పచ్చిపుండయింది పెను తుఫాన్లకు ఒరిగి విరిగిన కొంపయి చిరిగిన ఎముకల గూడయి అరచేతులమధ్య బరువుగా ఒద

కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారు

సారస్వతం
-శారదాప్రసాద్ సాహితీ స్రష్టల్లో నోరి నరసింహశాస్త్రి గారు సుప్రసిద్ధులు. కవిగా, కథకునిగా, నవలాకర్తగా, విమర్శకునిగా, పరిశోధకునిగా బహుముఖీనమైన పాత్ర పోషించి తనదైన ప్రత్యేక బాణిలో తమ వాణిని వినిపించారు ఆయన. నోరి నరసింహశాస్త్రి గారు 6-2-1900 న మహాలక్ష్మమ్మ, హనుమచ్ఛాస్త్రి. దంపతులకు గుంటూరులో జన్మించారు. నోరివారి వంశము శిష్టాచార సంపదలో పేరుమోసినది.నరసింహశాస్త్రి గారి తండ్రి హనుమచ్ఛాస్త్రి గారు గుంటూరు "మిషను కళాశాల"లో సంస్కృతాంధ్రాధ్యాపకులు. వారి తండ్రి గోపాల కృష్ణయ్యగారు మంత్రశాస్త్ర కోవిదులు. అటువంటి గొప్ప వంశంలో నరసింహ శాస్త్రి గారు పుట్టారు. వీరి పినతండ్రి గురులింగశాస్త్రి గారు చెన్నపురి తొండ మండలము హైస్కూలులో పండిత పదవిలో ఉండేవారు. వ్యాకరణము, వేదాంతము, జ్యోతిషము, మున్నగు శాస్త్రములలో వీరిది గట్టిచేయి. తెలుగు వచనములో అనేక పురాణాలు వ్రాసారు. శ్రీ నరసింహశాస్త్రిగారు ఆంధ్రకవులలో సంప్రదాయ సిద

ఆత్మఘోష

కథా భారతి
అన్ని ఛానెల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. విశాల్ ఇండస్ట్రీస్ అధినేత చైర్మన్ భరద్వాజ్ తన ఆఫీస్ బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండస్ట్రీ ప్రపంచంలో భరద్వాజ్ అనే పేరు ఒక సంచలనం. భరద్వాజ్ తండ్రిపేరు విశాల్. తండ్రిపేరుమీదే గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ వున్నాయి. మొట్టమొదట టెక్సటైల్స్ తో ప్రారంభమైన వ్యాపారం, మూడు పువ్వులు ఆరు కాయలు గా ఎదుగుతూ సిమెంట్, హార్డ్వేర్, టాయ్స్,హోటల్స్ ఇలా విస్తరించి పెద్దదయింది. షుమారు పది సంవత్సరాలలోనే ఇండియాలోనే ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థగా విశాల్ ఇండస్ట్రీస్ ఎదిగింది. తండ్రి తరువాత, భరద్వాజ్ చైర్మన్ పదవి చేపట్టాడు. భరద్వాజ్ చైర్మన్ అయిన తరువాత విశాల్ ఇండస్ట్రీస్ మరింతగా అభివృద్ధి చెందింది. ఉద్యోగస్తుల సంఖ్య యాభై వేలకు పెరిగింది. స్టాక్ మార్కెట్ లో షేర్ విలువ పదింతలు పెరిగింది. అన్నే సవ్యంగానే సాగుతున్నాయి. కానీ ఒకరోజు భరద్వాజ్ హఠాత్తుగా తన ఆఫీస్ బిల్డ