చూసే కనులకు మనసుంటే...

సునీత పెండేకంటి గారు ఒక కూచిపూడి కళాకారిణిగా, ఒక గృహిణిగా, ఒక పెద్ద సాఫ్ట్ వేరె కంపెనీలో ప్రాజెక్ట్ మానేజర్ గా ఎంతో అభివృద్దిని సాధించారు. ఆవిడ సమగ్ర జీవితాన్ని ఇప్పుడు మనం తెలుసుకొందాము.

కళాకారుల కుటుంబంలో నుంచి వచ్చిన సునీత గారు తమ నాలుగవ ఏటనే కూచిపూడి నాట్యాన్ని తమ తల్లి గారయిన శ్రీమతి కందాల జనని సరళ గారి వద్ద శిక్షణ ప్రారంభించానన్నారు. వారి తల్లి గారు గొప్ప నర్తకే కాకుండా ఎ.ఐ.ఆర్. లో మంచి పేరు పొందిన సంగీత విద్వాంసురాలు అని అన్నారు. వరంగల్ వాస్తవ్యులయిన వీరి తండ్రి గారు ఈ.ఎన్.టి.స్పెసలిస్ట్ అని చెప్పాకున్నారు.

సునీత గారు తమ అయిదవ సంవత్సరములో వెంపటి కోదండరామ శాస్త్రి గారి వద్ద కూచిపూడి నాట్య శిక్షణలోకి కాలు మోపానన్నారు. ఆ తరువాత వెంపటి నాగేశ్వరిగారి దగ్గర తమ కూచిపూడి నాట్య శిక్షణను చాలా సంవట్సరాలు కొనసాగించానన్నారు. అదే సమయములో ఎన్నో కూచిపూడి నృత్య రూపకాలలో పాల్గొంటూ, వేదాంతం ప్రహ్లాదు గారి దగ్గర కూడా తమ నాట్యాన్ని అభ్యసించడం జరిగిందని అన్నారు. ఆవిడ సొలో డాన్స్ డెబ్యు లో తమ పదహారవ ఏటనే రంగ ప్రవేశం చేసానన్నారు.

ఇంజనీరింగులో చేరిన తరువాత తాను నాట్యం నేర్చుకోవటం అపివేయ వలసి వచ్చిందని ఆవిడ అన్నారు. 1992 డిసెంబర్ లో పెళ్ళిచేసుకుని అమెరికాకి వచ్చిన తరువాత కూచిపూడి నాట్యాన్ని తిరిగి ప్రారంభించానన్నారు. 2001 సంవత్సరములో కూచిపూడి ఆర్ట్ అకాడెమి ద్వారా తాను విద్య్యార్ధులకు శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టానని అన్నారు. ఎన్నో నృత్య రూపకాలలో పాల్గొంటూ, మరెన్నో రూపకాలను కొరెయొగ్రాఫి చేస్తూ సిలికానాంధ్ర వారి నిర్వహణలో "ధ్రువచరిత్రము" అనే నృత్య రూపకాన్ని ప్రదర్శించటం కూడా జరిగిందని అవిడ అన్నారు.

భర్త పేరు రవి, సిలికాన్ గ్రాఫిక్స్ లో మానేజరుగా పని చేస్తున్నారు. శాన్ హోసెలో నివసిస్తున్న సునీత గారికి ఒక బాబు - రాధాకృష్ణ(15 సంవత్సరాలు)సంగీతములో శిక్షణను పొందున్నాడని, ఒక పాప - శృతలక్ష్మి (10 సంవత్సరాలు)తన దగ్గరే కూచిపూడి నాట్యాన్ని శిక్షణ పొందుతోందని ఆవిడ అన్నారు.

సునీత గారు తమ డాన్స్ స్కూలు ద్వారా కూచిపూడి నాట్య కళను తాళ, లయ బద్దం తో నేర్పటమే తమ అభిమతమని, ఈ నాట్య కళకు అభినయం జీవమిస్తుందని భావి యువ తరానికి తెలియచేయటమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. తాను ఈ స్కూలు తరపు నుండి ఎన్నో వర్క్ షాప్స్ కండక్ట్ చేసారని అలాగే తమ విద్యార్ధులు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని అన్నారు. తాను కూడా ఎన్నో డిస్ట్రిక్టు, స్టేటు, నేషనల్ అవ్వార్డులను గెలుచుకున్నారని తెలిపారు.

తాను 1986 లో "నాట్య మయూరి" బిరుదును లాస్య అభినయాలకు, 2006 లో కూచిపూడి నాట్యం పట్ల తన అభిరుచికి "నాట్య భారతి" బిరుదును పొందినట్లు చెప్పుకున్నారు. వెంపటి నాగేస్వరి గారి దగ్గర నాట్యం నేర్చుకుంటున్నప్పుడు శ్రీనివాస కల్యాణం, గిరిజా కల్యాణం, యశోదా కృష్ణ నృత్య రూపకాలలో ముఖ్య పాత్రలను పోషించినట్లు చెప్పారు. 2005 వ సంవత్సరములో పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారితో కలిసి మొహినీ భస్మాసుర లో "మోహిని" పాత్రను, మహిషాసుర మర్దిని లో, కీచకవధ లో ప్రముఖ పాత్రలను పోషించినట్లు తెలిపారు. 2001 లో కృష్ణ మహిమ, 2006 లో సర్వం కృష్ణ మయం, 2006 లో ధృవ చరిత్రం నృత్య రూపకాలను కొరియోగ్రాఫ్ చేసి ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలుపుతూ ముగించారు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)