సమస్యాపూరణం:
ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.
మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు మార్చి 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.
ఈ మాసం సమస్య
" ఆ.వె:// రాతి దేవునిదది రాతి గుండె "
క్రితమాసం సమస్య
" ఆ.వె.// ఆడ వారి మాటలర్థాలె వేరులే "
ఈ సమస్యకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.
మొదటి పూరణ - నారాయణ, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
బానిసలకు; కర్ర-బంతియాట
నాడువారి మాటలర్థాలె వేరులె
అమ్ముడౌట నిచట గారవంబె.
గమనిక: కర్ర-బంతియాట = క్రికెట్టు
ఈ మధ్య క్రికెట్టు యోధులందరినీ వేలం వెయ్యటం దీని సందర్భం.
రెండవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియ
సంతసంబు నుంటె సఖ్యతదియె !
ఆడువారిమాటలర్థాలె వేరులె
మనసున యొకటుంటె మాట నొకటి!
మూడవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫోర్నియ
పోటలాడుకొనిరి, నాటకంబు
లాడు వారి మాటలర్ధాలె వేరులె
స్టేజి మీద నటన చేయునపుడు
నాల్గవ పూరణ - సుబ్రహ్మణ్యం బత్తల, రోచెస్టర్ హిల్ల్స్, మిచిగన్.
ఆది ధర్మము నెంచి అమెరికా దేశము వారు
మగువ హిల్లరి మాటలను మరికాస్త శోధించి
పరువు నిలిపెడు వారలకె పదవినిచ్చిన మేలు.
భక్త హనుమ - తల్లాప్రగడ
సీ:// అనలుడర్కజుడును యసురేశుడనిలిడు యబ్ధిరాజర్ధేశుడలికలోచ
నులగూడి పూజించి నుతియించునే నన్ను, వేయికన్నుల వేల్పు వేయినోళ్ళ!
ప్రకటితామోద దివ్యకటాక్ష ప్రాప్తుండ! దంతుడి ముందేల దాంభికములు?
రాచమర్యాద పరామశ్చలేలను నెయ్యమాడితివనా నెనరులిచ్చి?
తే.గీ.// విఱ్ఱవీగెడి వానర వెఱ్ఱివాడ!
విరసవలయమ్ము వీడి, యీ విలయమేల
తెచ్చినాడవో పలుకుము తిన్నగయని
విమతుడట్లు పలికెనయా రామచంద్ర!
అనలుడు=అగ్నిదేవుడు
అర్కజుడును = యముడును
అసురేశుడు= నైరృతియును
అనిలిడు = వాయువును
అబ్ధిరాజు= వరుణుడును
అర్ధేశుడు= కుబేరుడును
అలికలోచనుల గూడి =నొసటియందు కన్నుకల ఈశానుడునీ కలుపుకొని వచ్చి
పూజించు = పూజిస్తాడు
నుతియించునే = పొగుడుతాడు
నన్ను = నన్ను (రావణుడను)
వేయికన్నుల వేల్పు = ఆ వేయి కళ్ళున్న దేవుడైనా (ఇంద్రుడు)
వేయినోళ్ళ= వేయినోళ్ళ పూజుస్తాడు పొగుడుతాడు వేయినోళ్ళతోటి!
ప్రకటిత=ప్రసిద్ధమైన
ఆమోద =సంతోషకరమైన
దివ్యకటాక్ష = దివ్య కటాక్షాలను, వరాలను
ప్రాప్తుండ = పొందిన వాడను (నాతో నీకెమిటి సంభాషణ అని తక్కువగా అనడం)
దంతుడి = ఇంద్రియ నిగ్రహం కల్గిన మహాతపస్వి కూడా అయినట్టివాని
ముందేల = ముందర ఎందుకు
దాంభికములు= నీ గొప్పలు!
రాచమర్యాద = రాజ మర్యాదలు
పరామశ్చ లేలను = కుశల ప్రశ్నలు ఎందుకు
నెయ్యమాడితివనా = స్నేహభావంతో వచ్చావనా
నెనరులిచ్చి?= లేక ఆప్యాయతలు చూపావనా?
విఱ్ఱవీగెడి వానర = విర్రవీగుతున్నటువంటి ఓ కోతీ
వెఱ్ఱివాడ!= వెఱ్ఱివాడవు నీవు!
విరస వలయమ్ము= మనస్సుకు నచ్చని పనులతో కూడిన వలయాన్ని
వీడి= వదిలి
యీ విలయము ఏల= నీ నాశనం ఎందుకు
తెచ్చినాడవో = చేసావో
పలుకుము = చెప్పుము
తిన్నగ అని = తిన్నగా చెప్పు అని
విమతుడు = శత్రువు/విరోధి (రావణుడు)
అట్లు పలికెనయా = అలా అన్నాడయా
రామచంద్ర!= రామచంద్రుడా!





























