రామాయణంలో రత్నాలు

అహల్య

" రాయినైనా కాక పోతిని రామపాదము సోకగ" అన్న పాట అహల్య శాపవృత్తాంతాన్ని తెలియ జేస్తుంది. ఒకానొక సమయంలో బ్ర హ్మ అందమైన అమ్మాయిని సృ ష్టించి హల్యము= అనగా వంకర. ఎట్టి వంకరా లేనిదికనుక ( న హల్య) "అహల్య "అని పేరుపెడతాడు. తొలుత అహల్యని చూసి ఇంద్రుడు తనకిమ్మని అడుగుతాడు.కాని బ్రహ్మ ఉత్తముడైన గౌతముడికిచ్చి వివాహం చేస్తాడు. ఇక అహల్య కథ అందరికి తెలిసిందె.

ఇప్పుడు రామాయణంలొ ఉన్న కథ,జన బాహుళ్యంలో ఉన్న కథ లోని మార్పులనుతెలుసుకొందాం. రాతిని నాతిగ చేసిన రామపాద మహిమ జగద్విదితం.అందుకే గుహుడు నావ యెక్కబోయే రాముణ్ణి ఆపి పాదాలు కడిగినపిదప ఎక్క మంటాడు,లెకుంటే రా మపాద ధూళి సో కి తన నావ రూపాంతరం చెందితే తన జీవనోపాధికి అంత రా యం కలుగుతుందని భయం. అహల్య ఇంద్రుడితో రమించడం, అదిచూసి గౌతముడు ఆమెను శిలగా పడి ఉండమని శపించి, రామపాదశ్పర్శతో శాపవిమోచనం కలుగుథుంది అని తెల్పే గాధ జన బాహుళ్యంలో మిక్కిలి ప్రచా రమై ప్రాచుర్యం పొందింది. జానపద గాధల్లో, నాటకాలలో, చలన చిత్రాల్లోఇదే చూపుతున్నారు.

కాని వాల్మీకి రామాయ ణం లో మాత్రం ఇలాలేదు."భస్మ రాశిలో ధూళి దూసరితంగా,ఆహార నిద్రలు లేకుండా చలన రహితంగా పడిఉండమని , రామ పాద శ్పర్శచే చలనం లభిస్తుంది" అని మాత్రమే ఉంది. ఇలా శపించడమే సమంజసంగా ఉంది అని వ్యాఖ్యాతల అభిప్రాయం.ఇందుకు వారు తెల్పిన వివరణ ఇలాఉంది. తప్పు చేసిన వారు శిక్షని తప్పక అనుభవించాలి, దాని వల్ల మానసిక పరి వర్తన చెంది మనిషిలో మార్పు వస్తుంది అని సిద్దాంతం.

అహల్యకి వచ్చింది ఇంద్రుడనితెలుసు. తెలిసే తప్పు చేస్తుంది.అందుకు తగిన శిక్ష మానసికంగా,శారీరకంగా అనుభవించి, పరితాపం చెంది, పవిత్రురాలై తిరిగి భర్తని చేరుకోవాలి అనేది వాల్మీకి హృదయం. అలాకాకుండా శిలగా పడిఉండి రామ పాదంతాకినంతనే చైతన్యం పొందితే శిక్ష అనుభవించినట్లు కాదుకదా!ఎందు కంటే శిలకి అనుభూతి ఉండదు.కనుక భస్మ రాశిలో పడి ఉండమన్న శాపమే సమంజసమని పెద్దల వివరణ. మరి శిలగా మారిన వృత్తాంతమెలావచ్చింది అన్నది ప్రశ్న.

వాల్మీకి రామాయణానికి అనువాదాలు దక్షిణ భారత దేశంలో అనేకం వచ్చాయి.తమిళంలో "కంబ కవి"వ్రాసిన "కంబ రామాయణం" మిక్కిలి ప్రాచుర్యం పొందింది.తరువాత "ఎళుత్తచ్చన్" మళయాళ రామాయ ణం. కన్నడ భాషలో "పంప కవి" వ్రాసిన పంప రామాయణం , తెలుగులో గోన బుద్ధా రెడ్డి వ్రాసిన "రంగనాధ రామాయణం.మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. వీటి రచనలకు వాల్మీకి రామాయణంతో పాటు తరువాత సంస్కృతంలో వచ్చిన "అధ్యాత్మరామాయణం"కుడా ఆధారం.అందుండి కొన్ని మార్పులు కంబ రామాయణంలో వచ్చి చేరాయి. కంబకవి చే సిన కొన్ని మార్పులు ఇతర రామాయణాల్లో వచ్చి చేరాయి.అదో అలా వచ్చిన మార్పే "అహల్య శిలగా" మారడం.ఇలా కాల క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. జనుల మనస్సులో రామాయణం , రామ భక్తిశాశ్వతంగా నిలిచి పోవాలనే సంకల్పం తోనే ఈమార్పులు చోటు చేసుకొని ఉండవచ్చు అని పెద్దల అభిప్రాయం.

ఇంకొక ఉదాహరణ చూద్దాం. రామావతార విషయంలో, నారాయణుడు రాముడిగాను,ఆదిశేషుడు లక్ష్మణుడిగాను, శంఖం,చక్రం భరత, శతృఘ్నులు గాను అవతరించి నట్లు ప్రచారంలో ఉంది. కాని వాల్మీకి రామాయణంలో అలా లేదు. నారాయణుడే తనని నాలుగు అంశలుగా విభజించుకొని అవతరించాడు అని వర్ణింప బడింది. రాముడు, భరతుడు, లక్ష్మణుడు ,శతృఘ్నుడుఇలా వరుస క్రమంలో జన్మిస్తారు.కాని లోకంలో రామ,లక్ష్మణ ,భరత ,శతృఘ్నులని వ్యవహరిస్తున్నాము. అట్లే రామునితో లక్ష్మ ణుడు ,భ రతునితో శతృఘ్నుడు ఎలా జతకలిసారు .అన్న విషయానికి కూడ వాల్మీకి చ క్కని ప్రణాలిక చూపించాడు .అది ఎలాగో పరికిద్దాం. సంతానం కోసం దశరధుడు పుత్ర కామేష్థి యాగం చేస్తాడు. యజ్ఞ పురుషుడు ఇచ్చిన పాయసాన్ని భార్యలకు పంచుతాడు. ఆపంపకం ఇలాజరిగింది.సగభాగం కౌ సల్యకి, ఉన్నదానిలో సగ భాగం సుమిత్రకి , మిగిలిన దానిలో సగభాగం కైకకి, మిగిలినది మరల సుమిత్రకి ఇస్తాడు. కాని ఈ పంపకం ఇంకో విధంగ జరిగి ఉండవచ్చు అని పెద్దల అభిప్రయం.పాయసా న్ని దశరధుడు సగం కౌ సల్యకి ,సగం కైకకి ఇస్తాడు . వాళ్ళిద్దరు సగం సగం సుమిత్రకి ఇస్తారు.కౌ సల్య ఇచ్చినసగం లక్ష్మ ణుడుగాను. కైక ఇచ్చిన సగం శతృఘ్నుడు గాను జన్మిస్తారు.కనుకనే లక్ష్మణుడు రామునితోను, శతృఘ్నుడు భరతునితో ను ఉంటారు అన్నది ఇప్పుడు సరిపోతుంది. చూ సారా వాల్మీకి రామాయణంలో ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి . పెద్దల ద్వారా వాటిని తెలుసుకొని తరించడం మన విధి.తరువాతి భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకొందం.స్వస్తి.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)