ఋతురాగ మరుదెంచ మ్రుదు గానముల తోడ
మధుమాస శోభలన్ మహియెల్ల మురియంగ
భవ్యముగ ఏతెంచె నవ్య వత్సరము
సర్వధారికి పలుక జయము జయము||

స్వాగతము సుస్వాగతము - సర్వధార వత్సరమా
స్వాగతము సుస్వాగము యుగ - చైతన్య స్వరూపమా

స్వాగతం సుమ స్వాగతం
స్వాగతం శుభ స్వాగతం ||

చాతుర్యుగ సమిశ్రిత మగును గాక మహాయుగం
మహాయుగ సమాహార మౌగా మనువంతరం
చేరగ పదునాలుగు మన్వంతరములు కల్పము
చెరి కల్పము నలువకు రేయింబవలుకు సమము

నవ్యోదయ స్రుష్టికి అది - నాంది పలుకు తరుణము
నవయుగ ఆరంభమునకు - జగతికి తొలి చైత్రము
అదే అదే యుగ ఆది - అదే అదే యుగాది
యుగ యుగాన నవరసాల స్రుజన కదే పునాది

భవ్య భరితమై - వ్యధా రహితమై
శాంతి నిలయమై - కాంతి జనకమై
సుకీర్తి ఫలమై - శుభారంభమై
నిండు బ్రతుకులకు - పండు వెన్నెలై

వేయంగా విజయాంకితమై
ఇల వికసించిన ఆశ ఇది
కాల వాహినిలొ వచ్చి చేరిన
కలియుగ నూతన వత్సరంబిది


స్వాగతము సుస్వాగతము - సర్వధార వత్సరమా
స్వాగతము సుస్వాగము యుగ - చైతన్య స్వరూపమా

స్వాగతం సుమ స్వాగతం
స్వాగతం శుభ స్వాగతం ||

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
 Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)