ప్రకృతి కోసం (నృత్య నాటిక)
గేయరచన, సంగీతం: శ్రి. సాయి మానాప్రగడ
మొదటి దృశ్యం: వేటగాడు అడవిలో జంతువులను చంపటానికి వెంటాడుతున్న ఘట్టం... అడవితల్లి మనిషితో ఆవేదనా భావంతో పాడుతుంది... వనమందు జీవులూ, నీకేమి కీడు చేసే? (2) వనమందు జీవులూ... గాయపరచి చంపినపుడూ, మనస్సుకు బాధ కాదా? వనమందు జీవులూ... (2) రెండవ దృశ్యం: అడవిలోని జంతువులు మనిషి సృష్టించిన భీబత్సానికి చెల్లా-చెదురై ఆందోళన చెందే దృశ్యం... అడవితల్లి మనిషితో మరో సారి మొరపెట్టుకుంటుంది... వనమెల్ల పూవులూ, నిలువెల్ల నవ్వులూ (2) వనమెల్ల పూవులూ... తెంచి ప్రాణం తీసినపుడు, చెలించని మనస్సు నీదా? వనమెల్ల పూవులూ... (2) మూడవ దృశ్యం: మనిషికి జ్ఞానోదయం కలిగి అడవితల్లిని క్షమించమని ప్రార్థించే దృశ్యం... అడవితల్లి, మనిషి, కలిసి పాడే పాట... మనమంత ప్రేమతో, కలిసుంటె మేలుకాదా? (2) మనమంత ప్రేమతో... ప్రకృతిని మనిషి ఆదరించి కలిసి-మెలిసున్న రోజూ... జగమంత వైభవం... (2) నాల్గవ దృశ్యం: అడవిలోని ప్రాణులంతా మనిషితో కలిసి ఆడి-పాడుకునే నాట్యం...























