Author: Sujanaranjani

TAGS – తెలుగు భాషా దినోత్సవం

జగమంత కుటుంబం
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 29, 2021 న ‘గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి - తెలుగు భాషా దినోత్సవం’, మరియూ ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గురించిన చర్చా కార్యక్రమం ఆగష్టు 29 న గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి ని...మనం “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని తెలుగు భాషలో ఉన్న అందాన్నీ, మాధుర్యాన్ని తెలియజెప్పిన మహనీయుడు గిడుగు వారి గూర్చి,  ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గురించిన ఒక చర్చా కార్యక్రమాన్ని శాక్రమెంటో తెలుగు సంఘం ఆన్ లైనులో నిర్వహించింది . పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చినా అది ఉండవచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, లేదా కరిగిపోవచ్చు. కానీ వారికి మనం అందించే భాష మరెన్నో తరాలకు చేరుతుంది. మన తెలుగు జాతి వైభవాన్ని, తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి ఖ్యాతిని చ

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ భూమిపూజ

సుజననీయం
ఇరవై ఏళ్ళుగా వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో ప్రగతిపథంలో ముందుకెడుతున్న సిలికానాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయానికి ఆగష్టు 14వ తేదీన నాంది జరిగింది. సిలికాన్ వ్యాలీకి అతి చేరువలో నున్న ట్రేసీ పట్టణంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి భూమిపూజ జరిగింది.  సువిశాల 65 ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో త్వరలో ప్రారంభం కానున్న విశ్వవిద్యాలయ భవన సముదాయ నిర్మాణానికి శుభాన్ని కోరుతూ సాంప్రదాపూర్వకంగా నిర్వహించే భూమిపూజను చేయడం జరిగింది. ముందుగా విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ఆయన సతీమణి శాంతి గారి సారథ్యంలో సిలికానాంధ్ర సభ్యులు కుటుంబ సమేతంగా సాముహిక సత్యనారాయణ వ్రతం ఆచరించారు. పురోహితుడు మారేపల్లి వెంకటశాస్త్రి గారు ఈ వ్రతాన్ని ముందు తరాల శ్రేయస్సును కోరుతూ జరిపే వ్రతంగా అభివర్ణించారు. భవిష్య విశ్వవిద్యాలయ ప్రాంగణానికి నిర్ణయించిన మూలస్థంభ ప్రాంతాన్ని సిలికానాంధ్ర ఆడపడుచులు రంగవల్లులతో అలంకరించారు. ఈ

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: రెండవ భార్యనేలుకొనరే పతులందరు తల్లిమెచ్చగన్ ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న: పంచెఁ గట్టు టిపుడు ఫ్యాషనాయె ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి. నాగిని, హైదరాబాద్ ఆ.వె. చీర కట్టు నచ్చె చిన్నదానికిపుడు గాశి పోసి సతము గట్టుచుండె! పాత కాలమిపుడు పదిలమాయె గనుక పంచె గట్టుటిపుడు ఫ్యాషనాయె చిరువోలు  సత్య ప్రసూన, న్యూ  ఢిల్లీ (1)ఆ.వె. వలువఁగట్టుటన్న పరువు నిలుపఁ గాదె

పుస్తకావిష్కరణ

"నేత మొగ్గలు" -డా. భీంపల్లి శ్రీకాంత్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి పులి జమున రచించిన "నేత మొగ్గలు" కవితాసంపుటిని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగష్ట్ 7 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల ఎక్స్ పో ప్లాజాలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరికతకు ఆనవాళ్ళు కులవృత్తులని ఆయా కులవృత్తుల ద్వారానే సమాజం అభివృద్ధి చెందిందన్నారు. సమాజానికి వస్త్రదానం చేసిన గొప్ప చరిత్ర పద్మశాలీయులదని ప్రశంసించారు. పద్మశాలీయులు బట్టలను నేయడం వల్లనే అందరూ ధరిస్తున్నారన్నారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూత పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రతి సోమవారం అందరూ

తేనెల సోన

కవితా స్రవంతి
తెలతెలవారున కలకూజితాల —తమిరిశ జానకి మధురమంజుల నాదమంటిది తెలుగు ! ఉదయించే రవి కిరణ శోభ సంతరించుకున్న గగనమంతటి సుందర దృశ్యకావ్య సోయగమే తెలుగు ! తెలిమంచు బిందువుల తడిసి తళతళలాడు తరువుల చిరునవ్వుల గలగలలే తెలుగు ! వివిధ వర్ణాల సుమాల వనాలతో విలసిల్లు ధరిత్రి వికసిత వదన లాలిత్యమే తెలుగు ! కృష్ణా గోదావరి తరంగాల కదలాడు కమనీయ సొబగులు తెలుగుపదాల పరవళ్ళలో తేలియాడేను ! ప్రకృతి రామణీయకతలా ప్రపంచమంత పరిఢవిల్లు తెలుగు ! నన్నయ తిక్కన యర్రాప్రగడ పోతన శ్రీనాధ దాశరధి దేవులపల్లి సి.నా.రె. మరెందరో మహాకవుల కలాల జాలువారిన రసామృతధార మన తెలుగు ! పద్య సంపదకు అవధాన విద్య విశిష్ఠతకు పేరొందిన తెలుగు తరిగిపోని భాషాగని తీయందనాల తేనెలసోన కురిసే వెన్నెలవాన ఎన్నటికీ కాబోదది మృతభాష ! దేశభాషలందు తెలుగులెస్సయన్న కృష్ణదేవరాయని మాట చెక్కు చెదరబోదు శిలాక్షరమె అది ! ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ పొగడబడిన భాష పొగ

నిధి రహస్యం

కథా భారతి
G.S.S.కళ్యాణి రాజయ్య, కోటయ్య గోపాలపురంలో వర్తకులు. వారిరువురి వ్యాపారాలూ పోటాపోటీగా నడుస్తూ ఉండేవి. నలుగురికీ మంచి చేస్తే మనకు ఆ భగవంతుడు మంచి చేస్తాడన్నది రాజయ్య నమ్మకమైతే, ఈ కలియుగంలో అందరితో మంచిగా ఉంటూపోతే వ్యాపారం సమర్థవంతంగా చెయ్యలేమనేది కోటయ్య నమ్మకం. రాజయ్య మంచితనం తెలిసినవారంతా ఎట్టిపరిస్థితులలోనూ రాజయ్య తమను మోసం చెయ్యడన్న ధీమాతో ఉంటూ, తమ వ్యాపార అవసరాల కోసం రాజయ్య వద్దకు మాత్రమే వెళ్లేవారు. రాజయ్యకు తరతరాలుగా సంక్రమించిన ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. అందువల్ల రాజయ్య తన వ్యాపారానికి సంబంధించి ఏ సాహసోపేత నిర్ణయం తీసుకోవాలన్నా అందుకు వెనుకాడేవాడు కాదు. ఆ కారణంగా అప్పుడప్పుడూ కోటయ్య కన్నా రాజయ్యకు వ్యాపారంలో ఎక్కువ లాభం వస్తూ ఉండేది. కోటయ్య పూర్వీకులు ఆస్తులేవీ పెద్దగా కూడబెట్టలేదు! అందుకని తన వ్యాపారానికి నష్టం కలిగించే అవకాశమున్న వ్యవహారాలకు దూరంగా ఉంటూ, డబ్బుల విషయంలో ఎప్పుడూ జా

అనగనగా ఆనాటి కథ

కథా భారతి
సత్యం మందపాటి స్పందనః మనుష్యులు ధనవంతులయితే, వారి మనసులు అంత గొప్పగా వుంటాయా? అలాగే బీదవారి విలువలు అంత తక్కువగా వుంటాయా? ఆరోజుల్లోనే కాదు, ఇప్పటి దాకా కూడా మనవారి ఆలోచనల్లో పెద్ద తేడా వచ్చినట్టు కనపడదు. ఎందుకని? మానవత్వపు విలువలు డబ్బుతో ముడిపడి వుంటాయా? ఆరోజుల్లో సాధారణంగా జరిగే ఇలాటి విషయాల మీద విశ్లేషణతో కూడిన ఆలోచనలే ఈకథకి స్పందన. స్పూర్తి. చదివే ముందు నా ప్రియ మిత్రుడు, ఈమధ్యనే మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఎంతో గొప్ప చిత్రకారుడు ‘చంద్ర’ ఈ కథకి వేసిన బొమ్మని నిశితంగా చూడండి. అందంగా వుండటమే కాక, నేను కొన్ని పేజీల్లో చెప్పిన కధని బహు కొద్ది గీతలతో ఎంతో అర్ధవంతంగా చిత్రించిన తీరు, నా కథకే చిరస్మరణీయమైన గుర్తింపుని అందించింది. జయహో మిత్రమా! ధన్యోస్మి! 0 0 0 నింగీ నేలా (ఈ కథ ‘జ్యోతి’ మాసపత్రిక, ఆగష్ట్ 1977 సంచికలో ప్రచురింపబడింది) “ఈ సముద్రపు ఒడ్డున ఇలా కూర్చుని, పైన వున్న ఆకాశాన

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: పంచెఁ గట్టు టిపుడు ఫ్యాషనాయె ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న: సంసార సుఖంబులబ్బు సన్యాసికిలన్ ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి. ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్ (1) కం. హంసగమన యనె, రంగ ని నంసాగుణము విడి, విప్ర నారాయణ, నా సంసేవ జేయ, తోడనె సంసార సుఖంబులబ్బు, సన్యాసి కిలన్. (2) కం. కంసారి, యతియగు నరో త్తంసుని గేరెను, సుభద్ర దరి, ఖాండవ వి ధ్వంసకుడగు నీ రాకను

వీక్షణం సాహితీ గవాక్షం-107 వ సమావేశం

వీక్షణం
వీక్షణం సాహితీ గవాక్షం-107 వ సమావేశం-వరూధిని వీక్షణం-107 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జూలై 11, 2021 న జరిగింది. ఈ సమావేశంలో డా|| కె.గీత గారి కథాపఠనం, చర్చ, కవిసమ్మేళనం, శ్రీధర్ రెడ్డి గారి కవిత్వ సంపుటి "ప్రతిబింబం" ఆవిష్కరణ జరిగాయి. ముందుగా డా|| కె.గీత గారు కాలిఫోర్నియాలోని వైల్డ్ ఫైర్స్ నేపథ్యంలో రాసిన కథ "ఇవేక్యుయేషన్" ను చదివి వినిపించారు. ఈ కథ జూలై 4న ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. ఈ కథలో ప్రధాన కథ ఒకపక్క విరుచుకుపడుతున్న విపత్తును గురించి తెలియజేస్తూ ఉన్నా, అంతర్లీనంగా కోవిడ్ కష్టకాలంలో భార్యా భర్తల మధ్య దూరమవుతున్న అనుబంధాన్ని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యంగా కొనసాగింది. ఉద్యోగమే సర్వం అనుకునే భర్త, భర్తే సర్వమనుకునే భార్య. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట అయినా జీవితాల్లోని ఒడుదుడుకులు ఎదురయినపుడు ఒకరినొకరు ఓదార్చుకోకుండా సమస్యని జటిలతరం చేసుకోవడం