Author: Sujanaranjani

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము ఈ కీర్తనలో అన్నమయ్య అమ్మ అలమేలుమంగమ్మ, చెలులతో గూడి స్వామికి విన్నవించుకుంటున్నపలుకులను మనకు అందిస్తున్నాడు. విశేషం ఏమిటంటే అన్నమయ్య కడపజిల్లా పులివెందులలో వెలసిన శ్రీరంగనాధ స్వామిపై వ్రాసిన శృంగార సంకీర్తనలో పదహారు వేల సతులతో గూడినవానికి సిగ్గెందుకు స్వామీ! మేమంతా నీ ఎదుటనే నిలబడ్డాము. భయమేల? వంకలు పెట్టకుండా మమ్ములను చేకొనండి అంటూ సాగుతుంది ఈ కీర్తన. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు ॥పల్లవి॥ చ.1 వావులు నీకెంచనేల వాడల గొల్లెతలకు దేవరవు గావా తెలిసినదే యీవల మావంక నిట్టె యేమి చూచేవు తప్పక మోవనాడితి మిధివో మొదలనే నేము ॥ఇంక॥ చ.2 చందాలు చెప్పఁగనేల సతినెత్తుక వచ్చితి విందుకు రాజవు గావా యెరిఁగినదే దిందుపడి మమ్ము నేల తిట్టేవు పెదవులను నిందవేసితి మిదివో నిన్ననే నే

అమెరికా ఉద్యోగ విజయాలు – 11

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న పదండి ముందుకు! “నిన్నొక విషయం అడగనా, బావా? కొత్త ఉద్యోగంలో చేరి ఇంకా ఒక్క సంవత్సరం కూడా కాలేదు, పాలు త్రాగే పసి వెధవ అప్పుడే పరుగెడతానంటున్నాడేమిటని అనుకోవు కదా!” కొంచెం సంకోచిస్తున్నా, నవ్వుతూనే అడిగాడు అర్జున్. పెద్దగా నవ్వాడు కృష్ణ. “సరే అడుగు. ఏ పసి వెధ.. నువ్వే ఏదో అన్నావు కదా.. ఎవరైతేనేమిలే.. ఎలాగైనా నువ్వు స్పెషల్. అడిగేసెయ్.. నేనేమీ అనుకోనులే..” అన్నాడు. “నువ్వే చెప్పావు కదా.. ప్రతి మనిషికీ ఒక ధ్యేయం వుండాలనీ, ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారం మనం అనుకున్నది సాధించాలనీ.. “ “అవును. మరి నీ లక్ష్యం ఏమిటి? ఎలా అది సాధిద్దామనుకుంటున్నావు?” అడిగాడు కృష్ణ. అర్జున్ ఒక్క క్షణం ఆలోచించాడు. అతను ముందే తన లక్ష్యం, ఆ లక్ష్య సాధనకి ఒక మంచి ప్రణాళిక ఆలోచించి పెట్టుకున్నాడని అర్ధమవుతూనే వుంది. తను చెప్పినవి పూర్తిగా పాటిస్తూ, వాటిని ఉపయోగించటంలో అప్పుడే ముందుకు వెడుతున

వృద్ధాశ్రమం

కథా భారతి
-యనమండ్ర భానుమూర్తి "నాన్నా! మీరు, అమ్మ పెద్దవారైపోయారు. పదవీవిరమణ చేసి కూడా పది సంవత్సరాలయింది. ఇంకా ఈఇంట్లో ఒంటరిగా ఉంటే ఎలా? నేను అన్నయ్య అమెరికాలో ఉంటున్నాం కదా. అక్కడికి రమ్మని ఎన్నోసార్లు చెప్పినా మీరు రారు. ఎంతసేపు పుట్టిన వూరు, పెరిగిన వూరు అని ఈ కాకినాడ లో ఉంటే, మీ బాగోగులు ఎవరు చూస్తారు." రాత్రి భోజనాలయిన తరువాత, ప్రస్తావన లేవనెత్తాడు రమేష్. జగన్నాధంగారి రెండో కొడుకు రమేష్. మొదటి వాడి పేరు సతీష్. జగన్నాధంగారికి ఒక అమ్మాయి కూడా వుంది. పేరు అనూరాధ. రమేష్, సతీష్ అమెరికాలో వుంటున్నారు. అనూరాధ, అల్లుడు హైదరాబాద్ లో వుంటున్నారు. దసరా పండుగకు అందరూ కలుసుకున్నారు. మిగతా రోజుల్లో కలుసుకోక పోయినా, దసరా పండుగకు మాత్రం ప్రతిఏడూ అందరూ కలుసుకుంటారు. జగన్నాధం ప్రధానోపాధ్యాయుడు గా చేసి పదవీవిరమణ చేసాడు. తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కస్టపడి పైకొచ్చాడు. టీచరుగా అందరిచేత శెభాష్ అ

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం 2019

ధారావాహికలు
“అనుభూతి కవిత్వం ప్రధానంగా జీవచైతన్య ప్రవృత్తికి సంబంధించింది. మిగిలిన నాలుగు ప్రవృత్తులను సాధ్యమైనంత వరకు జీవచైతన్య ప్రవృత్తిలో సంగమింప చేసుకోవడమో, దానికి పోషకంగా నిలుపుకోవడమో చేస్తారు అనుభూతి కవులు. దీని వల్ల ఆయా కవుల యొక్క అభివ్యక్తి వైవిధ్యాన్ని బట్టి - వాస్తవ చైతన్యాన్ని, జీవచైతన్యానికి పోషకంగా నిలిపే కవులని, కాల్పనిక చైతన్యాన్ని జీవచైతన్యానికి పోషకంగా నిలిపే కవులని, జ్ఞాన ప్రవృత్తిని జీవచైతన్య ప్రవృత్తిని పోషకంగా నిలిపే కవులని, నాలుగు విధాలుగా అనుభూతి కవులను నింగడించ వచ్చు. ఈ రకంగా పరిశీలిస్తే అనుభూతివాద కవులు ఐదు రకాలుగా కన్పిస్తారు. జీవచైతన్య ప్రవృత్తిని వాస్తవచైతన్యంతో పోషించిన కవులు. జీవచైతన్య ప్రవృత్తిని కాల్పనిక మార్మిక చైతన్యాలతో పోషించిన కవులు. జీవచైతన్య ప్రవృత్తిని కాల్పనిక చైతన్యాలతో పోషించిన కవులు. జీవచైతన్య ప్రవృత్తిని వైజ్ఞానిక, తాత్విక చైతన్యాలతో పోషించిన కవులు. జ

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
ఇక కిష్కింధకు రావణుణ్ణి అట్లా చంకలో ఇరికించుకొనే వచ్చిన తర్వాత వాణ్ణి కిందకి దింపి నవ్వుతూ 'ఏమిటి సమాచారం? ఎక్కడి నుంచి వచ్చారండి!’ అని అడిగాడు వాలి. రావణుడు బిక్కచచ్చిపోయినాడు. రావణుడి సంభ్రమాశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ‘నేను రావణుణ్ణి. లంకాధిపతిని. నాకు బాగా శాస్తి జరిగింది. నా గర్వం అణగారిపోయింది. భళిరా! ఏమి బలం! ఏమి వేగం! మనోవేగం, వాయువేగం, సుపర్ణుడి వేగం కూడా నీ వేగం ముందు తీసికట్టు. నన్ను మన్నించు. నీ స్నేహితుడిగా చేసుకో నన్ను. నీ వాణ్ణిగా చూసుకో' అని ప్రాధేయపడ్డాడు రావణుడు, వాలిని. అప్పుడు అగ్నిసాక్షిగా వాళ్ళు మిత్రులైనారు. వాలి రావణుణ్ణి కౌగిలించుకొని మన్నించాడు. ‘ఇవాల్టి నుంచీ మనం అన్నీ నీది, నాది అనే భేదం లేకుండా మైత్రీభావంతో చూసుకుందాం' అని రావణుడు, వాలిని వేడుకున్నాడు. వాలి రావణుణ్ణి, సుగ్రీవుడితో సమానంగా సమాదరించాడు. ఒక నెల రోజులు రావణుడు కిష్కింధలో గడిపాడు. తన కోసం వచ

బతుకమ్మ చరిత్ర

సారస్వతం
- AVR & KNR తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో చాలా మంది విశ్వసించే నేపధ్యం ఇది. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ(ప్రస్తుత కరీంనగర్ జిల్లా)లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరా

జ్ఞానం-మోక్షం

సారస్వతం
-శారదాప్రసాద్ ​ మోక్షం అంటే ఏమిటి ? బందాల నుంచి విడుదల అవ్వటం మోక్షం! బందం అంటే ?. ఎప్పుడైతే జీవన భ్రాంతిలో పడి కర్మలు చేస్తున్నామో, వాటి ఫలాలు అనుభవించాల్సి వచ్చి మళ్ళీ మళ్ళీ జన్మలను పొందుతున్నాం..ఈ కర్మ ఫలాలను అనుభవించటమే బంధం అంటే! ఈ జన్మ, కర్మల వలయంలో చిక్కుకోకుండా ఉండటమే మోక్షం అంటే. మనం కర్మలు చేయకుండా ఉండలేము. బ్రతకాలంటే కర్మలు చేయాల్సిందే! మనం చేసే కర్మ నిష్కామ పూరితమై ఉంటే, అప్పుడు కర్మ ఫలాలు మనకు అంటవు. నిష్కామ కర్మ యోగం,జ్ఞాన యోగం, భక్తి యోగాలు మోక్షానికి సోపానాలు! నిష్కామ కర్మే అసలైన మోక్ష మార్గం. మనిషి జీవితానికి నాలుగు లక్ష్యాల్ని చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నీతి, నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా గడవటానికి కావల్సిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు.ఇవి కూడా ధర్మాన్ని అనుస