Author: Sujanaranjani

బ్రహ్మ పునః సృష్టి

కథా భారతి
- ఆర్ శర్మ దంతుర్తి ఉమ్మడి ఆంధ్రదేశం విడిపోయాక ప్రథానమంత్రుల వారు గంగాజలం పట్టుకొచ్చి, ఆంధ్రదేశ శంఖుస్థాపన నాడు తనకూడా పట్టుకొచ్చిన మట్టితో సహా దాన్ని కాబోయే రాజథాని నోట్లో కొట్టాక నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళారు. ఆ నవ్వు చూసి డబ్బులు బాగా రాల్తాయనుకుని రాష్ట్ర అమాత్యులవారు రాజథాని నిర్మాణం అట్టహాసంగా మొదలుపెట్టారు. అందులో ఆయన చేసిన మొదటి పని భూసేకరణ కోసం రెండు చేతుల్తో ఓ ఖాళీ చిప్ప పట్టుకుని భిక్షకి బయల్దేరడం. రెండేళ్ళు తిరిగేసరికి భూమి దొరికింది గానీ దానిమీద భవనాలకీ, రోడ్లు వేయడానికీ డబ్బులు లేకపోయాయి. భూదేవి అసలే ఎండలకి తట్టుకోలేక గిలగిల్లాడుతూంటే, మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టూ వర్షాభారం, నిథుల కొరతా మొదలయ్యేసరికి అమాత్యుల వారికేం తోచలేదు. ఈ లోపుల అరాచకం, రాజకీయాలతో రాజ్యం అస్తవ్యస్తం అవుతుంటే ప్రజలు విశృంఖలంగా దోచుకోబడుతున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది రాజకీయనాయకులవల్ల; ప్రజాధనం

రామాయణ సంగ్రహం ఆగస్టు 2019

ధారావాహికలు
ఇంద్రుడితో రావణుడి యుద్ధం మేఘనాధుడు ఆగ్రహావేశంతో సింహనాదం చేసి రాక్షస సైన్యానికి ఉత్సాహం కలిగించాడు. దావాగ్నిలా విజృంభించాడు. ఇంద్రుడు తన కుమారుడైన జయంతుణ్ణి మేఘనాధుడిపై యుద్ధం చేయటానికి పంపాడు. మేఘనాధ, జయంతుల పోరు అరవీరభయంకరంగా మహాతీవ్రంగా జరిగింది. శతసహస్ర సంఖ్యో అస్త్రశస్త్రాలు పరస్పరం గుప్పించుకున్నారు వాళ్ళు. మేఘనాధుడి మాయా ప్రయోగం దేవతలకు భరించరానిదై పోయింది. అస్త్రశాస్త్రాలతో చీకటి ఆవరించింది. యుద్ధభూమిలో ఎవరు ఎవరో తెలియక దేవతలు దేవతలను, రాక్షసులు రాక్షసులను చంపుకున్నారు, మోదుకున్నారు. జయంతుడి మాతామహుడు పులోముడు జయంతుణ్ణి తీసుకొని వెళ్లి సముద్రంలో దాచాడు. జయంతుడు కనపడక దేవరలు విచారంతో ఉండగా మేఘనాధుడు మరింత రెచ్చిపోయి శత్రుసంహారం చేశాడు. ఇక ఇంద్రుడే స్వయంగా యుద్ధరంగాన నిలిచాడు. ఆయన సారథిగా మాతలి ఒడుపుగా యుద్ధంతో ఇంద్రుడికి సారథ్యం చేశాడు. దేవతలంతా ఉల్లసిల్లారు. అయితే దేవతలకు కొన్న

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
మనిషి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అబ్రహం మాస్లో (Abraham Maslow) ప్రతిపాదించిన సిద్ధాంతమే ఆత్మ ప్రస్థాపన సిద్ధాంతం (Self-actualization). మనిషి కనీసావసరస్థాయి నుంచి ఉత్తమస్థాయి వరకు తీసుకుని వెళ్లేదే ఈ ఆత్మ ప్రస్థాపన సిద్ధాంతం. పంచకోశాలైన అన్నమయకోశం నుండి ఆనందమయకోశం వరకు మనిషి అనుభూతి ఏవిధంగా ఉత్తమస్థాయి దాకా అంచెలంచెలుగా సాగిందో దాదాపు ఆ విధంగానే ఈ సిద్ధాంతం సాగింది. Self-actualization ↑ Esteem Needs ↑ Belongingness and Love needs ↑ Safety Needs ↑ Physiological Needs శారీరక అవసరాలు (Physiological Needs) – ఆహారం, నీరు, సెక్స్ ,ఓడలైన వాటిని శారీరక అవసరాలుగా గురించాడు. భద్రత, స్థిరత్వం, క్రమబద్ధం మొదలైనవి రక్షణావసరాలు (Safety Needs). ఆదరణ, కలయిక, తదాత్మ్యీకరణం మొదలైనవి ప్రేమకు సంబంధించిన అవసరాలు (Belonging and Love Needs). ఖ్యాతి, జయం, ఆత్మగౌరవం మొదలైనవి గౌరవ అవసరాలు (Esteem Needs

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య ఏల నీవు సిగ్గువడే వింతలోనను ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీనివాసుని వలచి వలపించుకొన్న అమ్మ పద్మావతీదేవి ఆభిజాత్యంతో అంటున్న మాటలను మనకు వినిపిస్తున్నాడు. "స్వామీ! మీరెందుకు సిగ్గుపడతారు. నేను మీ పట్టపు రాణిని. నిన్ను ఎంతమంది కాంతలు మోహించినా వలచినా నాకేమి స్వామీ! బంగారం వంటి భార్యను నేనే కదా! నీ హృదయంలో నే నాకు చోటిచ్చావు నాకు ఇంక నాకు దిగులేమిటి" అంటున్నది అమ్మ. అన్నమయ్య అమ్మచే పలికిస్తున్నాడు అందంగా. అదేమిటో ….ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం…. కీర్తన: పల్లవి: ఏల నీవు సిగ్గువడే వింతలోనను మేలిమియిల్లాల నీకు మించి నేనేకాదా || ఏ ల నీవు || చ.1. క్కడఁ దిరిగినా మాయింటికే వత్తువు నీవు తొక్కుమెట్టాడి నిన్ను దూరనేఁటికి పుక్కట తుమ్మిదకును పువ్వులెన్ని కలిగినా తక్కిన చుట్టుపు పొందు తామరే కాదా చ.2. తలఁపు నీకేడనున్న తనువు నాపై వేతువు చెలరేఁగి నిన్ను రట్టుసేయనేఁటికి సొల

అమెరికా ఉద్యోగ విజయాలు – 8

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న అడగందే అమ్మయినా పెట్టదు! రుక్మిణి అన్నగారిని చూడటానికి చికాగో వెళ్ళిందేమో కృష్ణ, అర్జున్ అక్కడే ఒక మెక్సికన్ రెష్టారెంట్లో భోజనం చేసి, మౌంట్ బనేల్ కొండ ఎక్కి, పైన కూర్చున్నారు. ఆస్టిన్ నగరంలో ప్రకృతికి వన్నె తెచ్చే ఎన్నో అందమైన ప్రదేశాలు వున్నాయి. వాటిల్లో మౌంట్ బనేల్ ఒకటి. ఆ కొండ మీద నించీ చూస్తుంటే పక్కనే వున్న నది, అక్కడ నీళ్ళల్లో తిరుగుతున్న చిన్నా పెద్దా బోట్లు, నీళ్ళలో స్కీయింగ్ చేస్తున్న వాళ్ళూ, ఎన్నో రకరకాల పచ్చని చెట్ల మధ్య రంగురంగుల పూల చెట్లూ, దూరంగా పెద్ద పెద్ద భవనాలు.. ఆస్టిన్ నగరం ఎంతో సుందరంగా వుంది. “అర్జున్, ఎలా వుంది నీ ఉద్యోగ పర్వం. ఇప్పటికి ఆరు నెలలు దాటింది కదూ..” అడిగాడు కృష్ణ. “అవును బావా.. నువ్వు చెబుతున్నవన్నీ నేను కళ్ళారా మా ఆఫీసులో చూస్తున్నాను. ముందుగానే నీతో మాట్లాడి అవన్నీ తెలుసుకోవటం వల్ల, నాకు అవన్నీ కొత్తగా అనిపించటం లేదు. అంతేక

నాడీజంఘుడు

సారస్వతం
-శారదాప్రసాద్ ధర్మరాజు " పితామహా ! రాజుకు కావలసిన వాళ్ళు, అక్కరలేని వాళ్ళు ఎవరు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఓర్పుగలవారు, ధర్మపరులు, సత్యంపలికే వారు, చంచల బుద్ధిలేని వారు, మదము, కోపం, లోభం లేనివారు, చతురతగా మాట్లాడి కార్యమును సాధించే వారు, తమ రాజుకు సకలసంపదలు చేకూర్చుతుంటారు. వీళ్ళంతా రాజుకు కావలసిన వాళ్ళు. క్రూరుడు, లోభి, ఆశపోతు, చాడీలు చెప్పేగుణం కలవాడు, మందబుద్ధులు, చేసినమేలు మరిచేవారు, అబద్ధాలు చెప్పేవారు, ఒకరితో నిందింపబడిన వారు, పిరికివారు, ధైర్యం లేనివారు, అవినీతిపరులు, దురలవాట్లకు బానిస అయినవారు రాజుకు నష్టం కలిగిస్తారు. వీరు అందరిలో చేసినమేలు మరిచేవారు పరమనీచులు. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను,జాగ్రత్తగా వినుము! ఒక బ్రాహ్మణుడు తన కులధర్మాన్ని వదిలి ఒక బోయవనితను వివాహం చేసుకున్నాడు. బోయవాళ్ళతో చేరి వేటసాగించి మాంసంతినడం లాంటి భోగములు అనుభవించ సాగాడు. మరింత

స్వార్థమనర్థము

కవితా స్రవంతి
-చంద్రశేఖర్. పి.వి. తానొక సమిధగా పరమార్థభావనతో ప్రకృతి మన ప్రత్యక్ష దైవమై స్ఫూర్తిగా నిలిచె ! పృథివి పథము జూపె, జనుల మనుగడ నెంచె సహన మార్గమే మనకు సహజమని నేర్పె ! ప్రాణవాయువు మనకు పరమావశ్యమనె కలుష జీవనమది విషతుల్యమని ఎంచె ! నింగి నేలను కలుపు నిత్యరశ్మితో మనకు చైతన్యము నింపె మనము చతురతతో మెలగ ! రెక్కలతో పైకెగిరి విత్తన వ్యాప్తితో సతత హరితము కొరకు పక్షులు ప్రాకులాడె ! కొండకోనలు దాటి నిండైన మనసుతో దాహార్తి తీర్చిన నీరు ప్రాణదాతగ మెరిసె ! ఎదిగి ఒదగమని దిగజారవద్దని ఆకసమే హద్దని వృద్ధి హితవుల పలికె ! పంచభూతాలన్ని పరహితము నెంచగా కించిత్ ప్రేమ లేని ఈ మానవాళి ! కలికాలమన్న ఏ కాలమో ఎరుగ అపకారమే కాని ఉపకారమెరుగదు ! స్వార్థ రచనలే కాని, సర్వహితములు లేవు ఆర్తనాదమే కానీ, ఆర్ద్రతలు కరువు ! విశ్వ విజయమునకు నిస్వార్థ మవసరము మానవా ! మానవా ? స్వార్థచింతనము !

కుమార సంభవం

సారస్వతం
-శారదాప్రసాద్ కుమారస్వామి జననం గురించి పురాణాలలో పలు కధలు ఉన్నాయి.మహాకవి కాళిదాసు వ్రాసిన కుమార సంభవంలో కుమారస్వామి జననం వరకే ఉన్నది.మిగిలిన వృత్తాంతం శివపురాణం,స్కాంద మరియు ఇతర పురాణాల్లో ఉంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు అహంకారపూరితుడై సకల సజ్జనులను హింసిస్తూ ఉంటాడు.అతని బాధలను భరించలేని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు -- శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్లైతే,వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు అని! దేవతలు వెంటనే శివుడి మీదకు మన్మధుడిని ప్రయోగిస్తారు. శివుడు మన్మథుడిని దహించి వేస్తాడు .తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు జారి భూమిపై