Author: Sujanaranjani

సంజీవని – జీవనప్రదాత

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు సిలికానాంధ్ర తను దత్తత తీసుకొన్న కూచిపూడి గ్రామాభివృద్ధిలో బాగంగా నిర్మిస్తున్న 'సంజీవని ' ఆసుపత్రి కోసం TV9 భాగస్వామ్యంతో నిధుల విరాళల కోసం ఒక విన్నూత్న కార్యక్రమం నిర్వహించింది. ఆ ప్రోగ్రాం పేరు 'sanjivanithon. వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=hyaUIaq_SfI అలాగే మార్చి నెలలో విళంబి ఉగాది ఉత్సవంలో నిర్వహించిన 'అచ్చ తెలుగు అవధానం' ఈ నెలలో పుస్తక రూపంలో అచ్చు అవుతున్నది. Softcopy కూడా వెబ్ లో ఉంచబడుతుంది. తెలుగు సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి ప్రధానంగా వివిధ శీర్షికలతో వెలువడుతున్న సుజనరంజని ని ప్రోత్సాహించండి.

వీక్షణం- 70

వీక్షణం
వీక్షణం 70 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో జరిగింది. ఈ సమావేశాన్ని డా||కె.గీత కన్నడంలో నుంచి తనే అనువాదం చేసిన స్వాగత గీతంతో ప్రారంభించేరు. శ్రీ లెనిన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం ముందుగా "వేదం" గురించి శ్రీ శ్రీచరణ్ గారి ఉపన్యాసంతో ప్రారంభించబడింది. ముందుగా వేదం అంతే ఏవిటో వివరిస్తూ, వేదం ఆని చోట్లా ఉందని, అనుభవమే వేదమనీ అన్నారు. వేదాలు ముఖ్యంగా నాలుగు. ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వ వేదం. మత్స్య పురాణంలో వేదాల గురించిన ప్రస్తావన ఉంది. వేదాలు అపౌరుషేయాలు. విభజన చేసినంత మాత్రాన వ్యాసుడు వేదకర్త కాదు. ఈశ్వరుడి చేత బ్రహ్మకు వేదాలు ఇవ్వబడ్డాయి. వేదంలో అన్నీ ఉత్తమ పురుషలో ఉంటాయి. ప్రతీ వేదం మళ్లీ నాలుగు విభాగాలు. సంహితము, బ్రాహ్మణకము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. వీటిలో చెప్పిన సారాన్ని చివరగా చెప్పేది వేదాంతము. ఇలా వేదాల గురించి వివరంగా విశదీకరిస్తూ ఉపన్యాసం

ఆచరణ

కథా భారతి
-ఆదూరి హైమావతి సత్యానందులవారు " సునందూ!" అంటూ తన శిష్యుడ్ని పిలిచారు. "గురుదేవా!" అంటూ సునందు గురువు ఎదుట నిలిచాడు వినయంగా. " సునందూ! నీవు ఒకపని చేయాల్సి ఉంది .. కావేరీ నదికి ఆవల ఉన్న నామిత్రుడు విజయానందులవారి 'ఆనందాశ్రమానికి ' వెళ్ళి , మన తోటలో కాసిన ' చూత ' ఫలాలను , సమర్పించి రావాలి ,వాటిని ఒక వెదురు బుట్టలో నింపి తయారుగా ఉంచాను." అని చెప్పారు. " అలాగే గురుదేవా!" అంటూ తన సమ్మతిని తెలిపాడు సునందు. " సునందూ ! నీవు ఒక్కడివే వెళ్ళిరాగలవా లేక నీకు తోడుగా మరొకర్ని పంపమన్నావా?" అని అడి గారు గురుదేవులు. "గురుదేవా తమ ఆశీస్సులే నాకు తోడు ..తమ సమ్మతి ప్రకారం చేస్తాను." అని వినయంగా గురువు పాదాలంటి నమస్కరించాడు సునందుడు. " సరేమరి . నీవుఒక్కడివే బయల్దేరు , ఎప్పుడు బయల్దేరుతావు?" " వెంటనే గురుదేవా! ఆ వెదురు బుట్ట ఇప్పించండి "అన్నాడు. అది మధ్యాహ్న సమయం .మరికొద్ది క్షణాల్లో భోజనాలు మొదలవు తాయి.శిష

యద్దనపూడి సంస్మరణ

జగమంత కుటుంబం
లేఖి మహిళా చైతన్య సాంసృతిక సంస్థ, శ్రీ త్యాగరాయ గాన సభ, రాగసప్త స్వరం.... సంయుక్త అద్వర్యంలో కళా సుబ్బారావు కళా వేదిక పై ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచన రాణి సంస్మరణ సభ జరిగింది.  జంట నగరాల సాంస్కృతిక సంస్థలు, కవులు, రచయిత్రులు పాల్గొన్నారు.  

యద్దనపూడి జ్ఞాపకాలు

సారస్వతం
నవలారచనలో మకుటం లేని మహారాణి... యద్దనపూడి సులోచనారాణి జ్ఞాపకాలివి (ఈనాడు ఆదివారం అనుబంధంలో.. 2004 మే నెలలో ప్రచురితమైన, కథనం) (మిత్రుడు రవిప్రసాద్ ఆదిరాజు సౌజన్యంతో) పదో తరగతితోనే చదువు ఆగిపోయినా... చుట్టూ ఉన్న సమాజాన్నే ఆమె నిరంతరం అధ్యయనం చేశారు. ఆ నిశిత పరిశీలనలో ప్రాణం పోసుకున్న పాత్రలే ఆమె నవలల్లోకి నడిచి వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నవలారచనలో మకుటం లేని మహారాణిలా వెలుగొందిన ఆమె.. ఆంధ్రుల అభిమాన రచయిత్రి... యద్దనపూడి సులోచనారాణి. రచయిత్రిగా ఆదర్శాలు వల్లించడమే కాకుండా స్వయంగా సామాజిక సేవకూ నడుం బిగించిన సులోచనారాణి సాఫల్యాలతోపాటు వైఫల్యాలనూ చవి చూశారు. తన జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలకు ఆమె ఇచ్చిన అక్షరరూపమిదీ... చిన్నప్పటి నుంచి నాకు మే నెల అంటే చాలా ఇష్టం. సహజంగా ఆ నెల్లో మండే ఎండలకి అందరూ హుష్షూ-హుష్షూ అంటూ హైరానా పడిపోతూ ఎండలను తిట్టకుంటారు. నేను మాత్రం సంవత్సరం మొత్త

శృంగార వియోగ నాయిక

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య శృంగార తాపంతో బాధపడుతున్న నాయిక అలమేలు మంగను వర్ణిస్తున్నాడు. పరి పరివిధాల సపర్యలు చేసినా అవన్నీ ఏమీ ఎక్కడం లేదు. మన్మధ తాపంతో తన్మయావస్థలో ఉన్నది అమ్మ. ఈ కీర్తనలో అన్నమయ్య చెలికత్తెలతో ఏమి చెప్పిస్తున్నాడో చూద్దాం. కీర్తన: పల్లవి: ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును చ.1.చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా యెందును నిద్రలేదేమి సేతమే గందపుటోవరిలోనఁ గప్పరంపుటింటిలోన యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును || ఉయ్యాల|| చ.2.పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక మంచముపైఁ బవ్వళించి మాటలాడదు నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు|| ఉయ్యాల|| చ.3.వెన్నెలల వేంకటద్రివిభుని లేనవ్వులాన నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి మన్ననల యింత లోన మలసేని జెలియ|| ఉయ్యాల|| (రాగం: కాంబో