Author: Sujanaranjani

తెలుగే వెలుగు

కవితా స్రవంతి
- సింహాద్రి (జ్యోతిర్మయి) ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు! (మనబడి బంధువు వ్రాసిన అద్భుత సాహిత్య ప్రక్రియ. అక్షరమాలతో తెలుగు వెలుగును చిందే తేటగీతులు) 1.తే. గీ. అ మ్మ జోలపాటకు సమమైన తెలుగు ఆ వు పాల కమ్మదనము లమరు తెలుగు ఇ టలి భాషతో సమమని ఎనయు తెలుగు ఈ డులేని మాధుర్యపు ఇంపు తెలుగు. 2.తే. గీ. ఉ గ్గు పాలతో అబ్బెడి ఊసు‌ తెలుగు ఊ హకు తొలిపలుకు నేర్పు ఒజ్జ తెలుగు ఋ ణము దీర్పలేము జనని ఇడిన తెలుగు ఋా తొ‌ మొదలగు పదముల నిడని తెలుగు. 3.తే. గీ. ఎ న్న భాషల లోకెల్ల మిన్న తెలుగు ఏ టి గలగల వినిపించు తేట తెలుగు ఐ క మత్యాన ప్రాంతీయ ఆస్తి తెలుగు ఒ. రుల భాషకు అచ్చుల ఊత తెలుగు 4.తే.గీ. ఓ పు చుండె నిర్లక్ష్యము చూప తెలుగు ఔ ర సహనాన భూదేవి, అమ్మ తెలుగు అం త మవనీకు భవితపై ఆశ తెలుగు అః వలదు నాకనకు మన ఆత్మ తెలుగు. 5.తే. గీ. క. వన సామ్రాజ్య విభవమ్ము గన్న తెలుగు

మనిషినే ప్రేమిస్తాను

కవితా స్రవంతి
- శిష్ట్లా. వి.యల్.యన్.శర్మ మనిషి జీవితానికి ప్రయాణం కావాలి కాలమనే వాహనం కావాలి చైతన్యమనే స్పందన కావాలి మజిలీలలో అనుభవాలు దాచుకొనే మనస్సు కావాలి..... ఈ ప్రయాణం నీ ఒక్కడిది కాదు నీ ఒక్కడికోసం కాదు కాలవాహినిలో నీవు కలసిపోయేవరకు...... నీ తోటి జీవి కొరకు.... ప్రక్కవానితో కలిసి బంధాల్ని ఆస్వాదిస్తూ మనిషిగా చరిత్రవౌతూ... మనసు సంద్రంలో భావాల అలలతో తీరాలు చేరాలనే తపనతో బడబాగ్నులు దాచుకుంటూ తుఫానులను తట్టుకుంటూ.... మనుషుల్ని కలపాలని మనిషిగా నిలపాలని నీ ప్రయాణం మనీషిగా సాగాలని.... జీవనదులన్నీ సముద్రంలో కలిసినట్లు మనసు జీవజల ప్రవాహం కాల సముద్రంలో కలిసి మనిషిని అందించాలని...... అందుకే మనిషి ప్రయాణమంటే నాకిష్టం.....అందుకే మనిషినే ప్రేమిస్తాను మనిషినై ప్రేమిస్తాను!

అమ్మ

కవితా స్రవంతి
- తమిరిశ జానకి ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో ముత్యాలు చుట్టి వేశాను అమ్మ మెడలో ! మంచి ముత్యాలు అక్షరముత్యాలవి ఆమె నా తెలుగుతల్లి ! తొలి దైవం అమ్మ తొలి పలుకు తెలుగు పలుకు అది ఎంతో ముద్దులొలుకు ! తొలి అడుగు తడబడినా తల్లికి అది మురిపమే ! తొలి ప్రణామం అమ్మకి అది విధాయకం నాకు ! ఉన్నఊరు కన్నతల్లి మాతృభాష మరువతగని వరాలు అవి మదిని నింపు సంతసాలు !

కృష్ణ పలుకు

కవితా స్రవంతి
- కృష్ణ అక్కులు ఆ.వె||వంట చేయు వరకు మంట కావలయును ఇంటిని మసి చేయు మంట వలదు కోపమధిక మయిన కొంపలు ముంచును కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||పేసు బుక్కు లోన పెరిగిన స్నేహము వాట్స అప్పు లోన పలుకు తీరు నాటి ఉత్తరముకు దీటుగా వచ్చునె కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||నల్ల ధనము నేడు చెల్లదనుట సరి వలదు హాని బీదవాని కెపుడు కలుపు తీయు నపుడు తులసి పోరాదు కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||ముద్దు చేయ రాదు మొద్దుబారు నటుల చురుకు కలిగి పనికి ఉరుకు నటుల పెంచినపుడె బిడ్డ మంచిగ బ్రతుకును కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె||కలసి బ్రతుకునపుడు కలహాములవి వచ్చు కాని అందులోనె కలదు సుఖము పెద్దలెపుడు మనకు బుద్ది భోధించరె కృష్ణ పలుకు వినగ గెలుపు ఆ.వె||పెద్ద నోట్లు రద్దు పేదవాడికి పాట్లు కొత్త నోట్ల కొరత కొంప ముంచె మోడి మాపైనేల మోపితివి బరువు కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు ఆ.వె

నీ పద్యావళు లాలకించు చెవులున్ ని న్నాడు వాక్యంబులన్

కథా భారతి
- ఆర్. శర్మ దంతుర్తి కైలాసం లోపలకి వచ్చే నారదుణ్ణి నందీ, విఘ్నేశ్వరుడు సాదరంగా ఆహ్వానించారు. ఆది దంపతులకి నమస్కారం చేసి అడిగాడు నారదుడు, "ఈశ్వరా, పులస్త్య బ్రహ్మ కుమారుడైన వైశ్రవణుడు తెలుసు కదా? ఆయన కుమారుడైన కుబేరుడనేవాడు మీ కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. అతన్ని కరుణించేదెప్పుడో తెలుసుకుందామని ఇలా వచ్చాను." భవుడు చిరునవ్వు నవ్వేడు జగదంబ కేసి చూసి. అమ్మవారు చెప్పింది, "నారదా ఈ తపస్సు ఫలించి కుబేరుడికి కోరికలు తీరినా ఆయన అడిగినది ఎంతో కాలం నిలవదు." నారదుడు ఆశ్చర్యంగా చూసాడు అదేమిటన్నట్టు. పార్వతి వివరణ ఇస్తున్నట్టూ చెప్పింది, "నువ్వే చూద్దువు గాని కదా? కోరికలీడేరడం వల్ల సుఖం వస్తుందనేది ఎంత నిజమో." అంతకన్న చెప్పడానికేమీ లేదన్నట్టు అమ్మవారు ఆగేసరికి భవుడు సమాధిలోకి జారుకున్నాడు. జగజ్జనని కూడా కళ్ళు మూసుకోబోయేంతలో ద్వారం వరకూ వచ్చే నందీశ్వరుడితో త్రిలోకసంచారి నారదుడు “నారాయణ,

నాకు నచ్చిన కథ – ఒక్కనాటి అతిథి

కథా భారతి
కథారచన - ఆచంట శారదాదేవి శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి ఈ కథ నాకెందుకు నచ్చిందంటే శ్రీమతి ఆచంట శారదాదేవి ఆ తరం రచయిత్రులలో మంచి వాసిగల రచయిత్రి. ఆవిడ రాసిన కథ ల ఆణిముత్యాలు. భావుకతని, వర్ణనల్ని జోడించి ఎంత బాగా రాస్తారో కథలావిడ, వాటిలో కొన్ని హారమై 'ఒక్కనాటి అతిథి' కథల సంపుటి రూపంలో మెరిశాయి 1965లో సున్నితమైన మనసుని సుందరంగా లలిత లలితంగా చిత్రీకరించి కనుల ముందు నిలబెట్టిన కథ శారదగారి 'ఒక్కనాటి అతిథి' మనిషి శరీరంలో అతుకుపెట్టలేని భాగం మనసొక్కటే అని నా అభిప్రాయం ఎంత డబ్బు పోసినా కొనుక్కోలేనిది మనసు. ఆ మనసు లోతుల్లోకి తుంగిచూస్తే కథలంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే 'ఒక్కనాటి అతిథి' కథ ఎంతో ఇష్టం నాకు. ఈ కథలోని కేతకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అప్పుడే విరిసిన పువ్వల్లే అతి నాజూకుగానూ, భావనాలోకంలో విహరిస్తూనే భాధ్యత తెల్సిన భారపు రూపం గానూ కనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రతి మనిషి మనసుకీ ఈ రెం

అనగనగా ఓ కథ – ఓ మహిళా దారి ఇదిగో…

కథా భారతి
- కొడవంటి కాశీపతిరావు మేస్టారి కోపం చూడ్డానికి పౌర్ణమినాటి వెన్నెల్లా తెల్లగా చల్లగా ఉన్నా అనుభవానికి వచ్చేసరికి నట్టనడి వేసవిలో మిట్టమధ్యాహ్నపు ఎండలా తీవ్రంగా ఉంటుంది. పైగా "అమ్మాయ్ హోంవర్కు చెయ్యలేదేం? ఓ గంట సేపు ఎండలో నిలబడు... ఊఁ "అంటే ఆ ఎండే వెన్నెల్లా వుంటుంది. అదే... "హోంవర్కు చెయ్యలేదూ... ఊఁ... సరే" అని పెదాలుబిగించి రెప్పెయ్యకుండా ఓసారి చూసి తలపంకించేరంటే అది మరి భరించలేను నేను. నేనే కాదు బహుశా ఎవరూను. అంతకుముందు క్లాసులో ఇంగ్లీషు ఏమేస్టారెలా చెప్పేవారో కూడా తెలియనంత మరపుకొచ్చిందిగాని, ఈ మేస్టారు మాత్రం పాఠంలోకి తిన్నగా వెళ్ళిపోయే వారు కాదు. ఒక్కో స్ట్రక్చరూ తీసుకుని తీగమీద డ్రిల్లు చేయించినట్టు చేయించి, ఒక్కో కంటెంటు వర్డూ తీసుకుని ఒక్కో పిప్పరమెంటు బిళ్ళ నోట్లోవేసి చప్పరించినట్టు చేయించేవారు. ఆపైన ఒక్కసారో, రెండుసార్లో మరి పాఠం చదివించి అరటిపండు వలిచి చెతిలో పెట్

విశ్వామిత్ర 2015 – నవల ( 9వ భాగము )

ధారావాహికలు
- యస్. యస్. వి రమణారావు ఉదయం తొమ్మిదికల్లా రాజు కారుతో సిబిఐ గెస్ట్ హౌస్ దగ్గర సిద్ధంగా ఉన్నాడు.అభిషేక్ వచ్చి కారులో కూర్చున్నాడు.’ఎడ్రస్ సార్"అడిగాడు రాజు."లక్ష్మీపురం దగ్గరకు వెళదాం. అక్కడికి వెళితే గుర్తు పట్టగలను "విశ్వామిత్రని చూశానని చెప్పి గొప్ప షాక్ ఇచ్చారు సార్.మేమింకా విశ్వామిత్ర హోమ్ కి భయపడి అండర్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడని అనుకుంటున్నాం అంతవరకు."నవ్వాడు అభిషేక్,కారులోంచి అందంగా కనబడుతున్న విశాఖ నగరాన్ని చూస్తూ."మీరు వెళ్ళాక జగదీష్ గారు మినిష్టర్ గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయనకూడా షాక్ అయ్యారు సార్" "అందులో నా గొప్పతనం ఏముంది?It`s purely accidental." "వాట్ ఈజ్ మిరకిల్ టు మేన్ ఈజ్ లాజికల్ టు గాడ్ అన్నాడు సార్ షేక్స్పియర్. భగవంతుడు మీద్వారానే ఈ కేసు సాల్వ్ చేద్దామనుకుంటున్నాడు సార్.అందుకునే మిమ్మల్ని విశ్వామిత్రని కలుసుకునేలా చేశాడు."అంతవరకూ సిటీని చూస్తూ లైట్ మూడ్ లో ఉన్న
శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
- డా. అక్కిరాజు రమాపతిరావు యుద్ధంలో ఇంద్రజిత్తు మాయాసీతను సంహరించటం శ్రీరాముడి నిర్ణయం తన మాయాబలంతో ఇంద్రజిత్తు తెలుసుకున్నాడు. వెంటనే లంకలోకి పారిపోయినాడు. జరిగిన రాక్షస మారణహోమాన్ని తలచుకొని మరింత క్రుద్ధుడై రామలక్ష్మణులకు దూరంగా ఉన్న లంక పశ్చిమద్వారానికి వెళ్ళాడు. వానరులూ, రామలక్ష్మణులూ శోకోపహతచేతనులై, నిస్తేజులై, నిర్వీర్యులైపోయే ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక మాయాసీతను సృష్టించి తన రథంపై ఆసీనురాలిని చేశాడు. ఆ మాయాసీతను తాను సంహరించి వానరులను భ్రమింపచేసే పూనికతో యుద్ధరంగంలో నిలిచాడు. ఇంద్రజిత్తు మళ్ళీ యుద్ధభూమికి రావడం వానరసేనా, శ్రీరామలక్ష్మణులూ చూశారు. క్రోధవివశులైనారు. హనుమంతుడు ఒక పర్వతశిఖరాన్ని ఇంద్రజిత్తుపై విసరడానికి ఉద్యుక్తుడైనాడు. కాని రథంలో అత్యంతకృశాంగి, దుఃఖ పరిదీనవదన, ధూళిధూసరితదేహ, మలినవస్త్ర, కేశసంస్కారరహిత, ఏకవేణీధర అయిన సీతాదేవిని హనుమంతుడు నివ్వెరపాటుతో ఒక్కక్షణం సేపు ఇ

ఏకలవ్యుడు ఎవరు?-ఒక పరిశీలన

సారస్వతం
- టీవీయస్.శాస్త్రి (శారదాప్రసాద్) మనలో చాలామందికి ఏకలవ్యుడి కధ ఈ క్రింది విధంగా తెలుసు! ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప పాత్ర. ఇతను ఎరుకల కులానికి చెందినవాడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలని కోరిక ఇతనికి ఎక్కువగా ఉండేది. ఆ కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. ద్రోణుడు అతని కోరికను మన్నించక, దాన్ని తిరస్కరించాడు.కానీ కొన్ని కథల్లో, ద్రోణుడు ఏకలవ్యుడిని దూరంగా ఉంచటానికి కారణం అతని కులం అని చెపుతారు.ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా తెలియక ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషదారణతో ఏకలవ