పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. పాఠకులందరకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వారణాసి సూర్యకుమారి కం. నూతన సంవత్సర మున మీ తపనలు తీరి కలుగు  మెండు శుభమ్ముల్ పూతావి వోలె  కీర్తియు యేతావున  పరిమళించి  మిమ్మలరించున్ కం. పిల్లా పాపల  గూడియు చల్లగ  కాపురము సాగి చక్కగ  శుభముల్ వెల్లివిరియు  సుఖశాంతులు కొల్లగ  సంపదలు కలిగి  కోర్కెలు  తీరున్ సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ విద్వాన్ శ్రీమతి జి. సందిత, బెంగుళూరు కవిరాజవిరాజి

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: సమస్య: బాంబుల వలనే దేశము బాగుపడును గతమాసం ప్రశ్న: దత్తపది: వంగ, దోస, కాకర, కంద పదములను అన్యార్ధములతో వాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరానికి సంభందించిన విషయముపై స్వేచ్ఛా ఛందస్సులో పద్యము వ్రాయాలి ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ తే.గీ|| ఊహ కందని రీతిగ సాహ సించి దోస మెరుగక గాంధీజి రోస మనక గొడ్డు కాకర వంటిఈ చెడ్డ దొరల చెఱను వి