సంగీత రంజని

శ్రీరామదాసు జయంతి

విద్వాన్ DV మోహనకృష్ణ గారి సంగీత కచేరీ గంటలు 10:30:00 దగ్గరనుండి వినండి. అంతకు ముందు సంపద విద్యార్థుల సంగీతనాట్య సమ్మేళనాలను వీక్షించండి.

సంగీత రంజని మార్చి 2019

I. కళావతి రాగం: కళావతి అంటే కళలు తెలిసిన స్త్రీ. చదువుల తల్లి సరస్వతి దేవికి మరో పేరు కళావతి. పారుడు అనే ఋషికి, పుంజిక స్థల అనే అప్సరకు పుట్టిన కూతురుకు కళావతి అని పేరు పెట్టారు. పార్వతీ దేవి ఆమె సౌందర్యానికి మెచ్చి ఆమెకు పద్మినీ విద్యను ఇచ్చింది. తరువాత కళావతి స్వరోచి ని వివాహం చేసుకోంది. తుంబురుని వీణ పేరు కూడా కళావతి. కర్ణాటక సంగీతం లోని కళావతి రాగం 16 వ మేళకర్త చక్రవాక జన్యరాగం. ఉపాంగ రాగం, ఔడవ-వక్ర షాడవ రాగం. ఆరోహణలో గాంధార, నిశాధాలు వర్జ్యం. అవరోహణలో నిషాధం వర్జ్యం. అపురూపమైన రాగం, కరుణ రస ప్రధానమైన రాగం. ఈ రాగం త్యాగరాజస్వామి సృష్టి. విళంబ కాలం లో పాడితే బాగుంటుంది. ఆరోహణ: స రి మ ప ద స ..అవరోహణ: స ద ప మ గ స రి స ..శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి ధైవతం స్వర స్థానాలు. హిందుస్తానీ సంగెతం లో కూడా ఒక కళావతి రాగం ఉంది. అది కర్ణాటక సంగీతం లోని వలజి రాగానిక

సంగీత రాగాలు

-డా. కోదాటి సాంబయ్య 1. భీమ్ పలాశ్రీ \భీమ్ పలాసి \ అభేరి : కాపి థాట్ కు చెందిన రాగం. ఔడవ-సంపూర్ణ రాగం. ఒక సంగీత విద్వాంసుడు పలాస (మోదుగు) చెట్టు కింద కూర్చుని భీమ్ రాగాన్ని పాడుతుంటే అనుకోకుండా కొన్నిస్వరాలను వర్జ్యం చేస్తే కొత్త రాగం వచ్చింది దానికే భీమ్ పలాసి అని పేరు పెట్టారని ఒక కథ ప్రచారం లో ఉంది. కర్ణాటక సంగీతం లో ఈ రాగానికి దగ్గరి రాగం అభేరి. అభేరి లో రిషభ,ధైవతాలు తక్కువగా వాడతారు, భీమ్ పలాసి లో తరుచుగా వాడతారు, అదొక్కటే తేడా రెంటికీ. ఈ రాగం పాడితే మానసిక ఆందోళనలు తగ్గి ప్రశాంతత నెలకొంటుందని పెద్దల మాట. భక్తి, శృంగార, విరహ భావాలను కలుగ చేస్తుంది. ఆరోహణ: స గ మ ప ని స....అవరోహణ: స ని డ ప మ గ రి స ...వాది స్వరం: పంచమం,కొందరు మధ్యమం అంటారు, సంవాది: షడ్జమం. పకడ్ మరియు చలన్....ని స మ, మ గ ప మ, గ మ గ రి స ..పాడవలసిన సమయం..మధ్యాహ్నం . ... హిందీ చలన చిత్రాలలోని కొన్ని భీమ్ పలాసి పాటల

త్యాగయ్య జీవిత విశేషాలు

- అక్కిరాజు ప్రసాద్ (రవిప్రసాద్ ఆదిరాజు సౌజన్యంతో) (చిత్రం - రఘునాథ్ దెందుకూరి) త్యాగరాజ స్వామి వైదిక వెలనాడు కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వీకులు 1600 ప్రాంతంలో ఆంధ్ర నుండి తంజావూరు ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడి నాయక రాజుల ఆశ్రయంలో జీవించారు. త్యాగయ్య తండ్రి రామబ్రహ్మం తంజావూరు మహారాజా తులజాజీ -II మన్నననలు పొందిన వారు. రామాయణాన్ని హరికథలు, ప్రవచనాల రూపంలో ప్రచారం చేసే వారు. కుంబకోణం వద్ద మరుదనల్లూరులో ఒక శైవమఠాధిపతి వద్ద ఆయన రామతారక మంత్రోపదేశాన్ని పొందారు. త్యాగరాజ పుట్టక ముందు తిరువారూరులోని త్యాగరాజస్వామి (నాట్యం చేసే యోగి రూపంలో ఉంటాడీ శివుడు) రామబ్రహ్మం దంపతులకు స్వప్న సాక్షాత్కారమిచ్చి నారదుని అవతారమై ఒక కుమారుడు జన్మిస్తాడు, అతనికి త్యాగరాజు అని నామకరణం చేయమని పలికాడు. 1767వ సంవత్సరం మే 4వ తేదీన త్యాగరాజస్వామి జన్మించారు. తల్లి పాలు తాగుతున్న పసిబాలుడు సంగీతం వినబడితే పాలు త్ర

సంగీత రంజని జనవరి 2019

కేదార గౌళ \ దేశ్ -డా. కోదాటి సాంబయ్య కేదారగౌళ 28 వ మేళకర్త హరికాంభోజి జన్యం...భక్తీ, శృంగార రసాలు పలికించే రాగం. ఔడవ-సంపూర్ణ రాగం. ఉపాంగ రాగం, వర్జ్య రాగం. ఆరోహణ: స రి మ ప ని స ....అవరోహణ: స ని ద ప మ గ రి స...చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి ధైవతం, కైశిక నిషాధం. ని ద పా అన్నప్పుడు ని ద దానిప అనీ...మ గ రీ అన్నప్పుడు మ గ గామరీ అనీ పలుకుతుంది. ఈ రెండు ప్రయోగాలలో దానిప, గామరీ అనే గమకాలు కేదారగౌళ రాగం యొక్క ముఖ్యమైన గమకాలు . సురటి, నారాయణ గౌళ రాగాలు ఇంచుమించు కేదారగౌళ స్వరస్థానాలు ఒక్కటే. పాడేప్పుడు జాగ్రత్తగా పాడాలి. గమకాల తోటే మూడు రాగాలనూ పోల్చవచ్చు. ఉదయం పూట పాడవలసిన రాగం. కేదారగౌళ లో కొన్ని ముఖ్యమైన రచనలు: సామి దయ జూడ-ఆది తాళ వర్ణం-తిరువట్టియూర్ త్యాగయ్య; వేణుగానలోలుని గన, తులసీ బిల్వ, కరుణా జలధి -త్యాగయ్య; సరగున పాలింప-రామనాధపురం ( పూచి)శ్రీనివాస అయ్యంగార్ ; ఏమ