సాహితీవేత్తలు

సాహితీవేత్తలు

సాహిత్య అకాడమీ గ్రహీతలకు అభినందనలు ఎన్నో ఏళ్ళ కృషి, దీక్ష, పట్టుదల తో సాగుతున్న కవి లేదా రచయిత ఎవరైనా ఒక్క సాహిత్య అకాడమీ అవార్డు రావడంతో ఒక్కసారిగా సేదదీరుతారు. అంటే సాహిత్యం లో తమకంటూ ఒక పేజీ ఉంటుందని ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం కవిగా సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న దిగంబర కవి నిఖిలేశ్వర్ గారు అసలు పేరు కుంభం యాదవరెడ్డి. తెలుగులో నిఖిలేశ్వర్ రచించిన అగ్నిశ్వాస కవిత్వానికి ఈ అవార్డు ఇచ్చారు. వీరు కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని నిఖిలేశ్వర్‌ గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు.దిగంబర కవులలో ఒకరిగా, 1965 నుండి 1970 వరకు మూడు సంపుటాల దిగంబర కవిత్వమును ప్రచురించారు. నిఖిలేశ్వర్ విప్లవ కవిత్వోద్యమంలో కూడా ప్రధానమైన కవి.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనటానికి విచ్చేసిన అతిధుల్లో కొందరిని కలిసినప్పటి చిత్రాలు

సీతాకాంత మహాపాత్ర (ప్రముఖ ఒరియా కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత); పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ (రచయిత) సత్యవ్రత్ శాస్త్రి (జ్ఞానపీఠ పురస్కార గ్రహీత - సంస్కృతం; ఎడమనుండి మూడు) కారా మేస్టారు (కాళీపట్నం రామారావు, ప్రముఖ కథారచయిత, కథానిలయం వ్యవస్థాపకుడు) కె. శివారెడ్డి (సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, ప్రముఖ కవి) అంపశయ్య నవీన్ (సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, ప్రముఖ నవలా రచయిత) సుధామ (సాహితీవేత్త) కె.దేశికాచారి (కెనడా, 1990లలో కంప్యూటర్లలో పోతన లిపి, పోతన కీబోర్డు శ్ర్ష్టికర్త) కుప్పిలి ఫద్మ (రచయిత్రి) జగన్నాథశర్మ (నవ్య వారపత్రిక సంపాదకుడు, సాయి బ్రహ్మానందం గొర్తి (బే ఏరియ రచయిత) బి.యెస్.రాములు (ప్రముఖ దళితవాద రచయిత) డా. సూర్యా ధనంజయ్ (తెలుగు శాఖాధిపతి, ఉస్మనియా విశ్వవిద్యాలయం) కాట్రగడ్డ దయానంద్ (కథా రచయిత) కె.వి.నరేందర్ (కథ రచయిత, కరీం నగర్ జిల్లా) గంటాడ గౌరీనా