ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 18వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు "అది సార్ సంగతి" రాజు పూర్తి చేశాడు "అంతేనా?"అన్నాడు అభిషేక్"ఈ విషయం చెప్పడానికి నువు ఇంత సంకోచం పడడమెందుకు?" రాజు ఆశ్చర్యపోయాడు"అదేంటి సార్,ఒక అమ్మాయి అర్థరాత్రి బీచ్ కి వెళ్ళడం,అక్కడ రౌడీలని చితక బాదడం,అదంతా వీడియో రికార్డింగ్ చేయడం,ఇదంతా మీకు వింతగా ఎబ్నార్మల్ గా అనిపించడం లేదా?" "ఏంలేదు.అర్థరాత్రి బీచ్ కి వెళ్ళాలనే ఉత్సాహం ఉంది,అనుకోనిదేమైనా జరిగితే తనను తాను రక్షించుకోగలననే ధైర్యం ఉంది.అంతకు మించి ఏం కనబడట్లేదు నాకు" "మీరిలా అంటారని మీ సంస్కారాన్ని బట్టి ఊహించాను సార్.కాని తరవాత ఇంకొక విషయం జరిగింది సార్." రాజు ఆగాడు.అభిషేక్ వింటున్నాడు" ఆ ఇంటి బయటకు వచ్చి కేతుబాబుని ఏ హాస్పటల్ కి తీసుకు వెళ్ళారో కనుక్కుని ఆ హాస్పటల్ కి వెళ్ళుతుండగా నాకు ఓఫోన్ వచ్చింది సార్"రాజు మళ్ళీ ఆగి ఇంకో పెగ్గు పోసుకున్నాడు అభి దింకా మొదటిపెగ్గే ఇంకా పూర్తికాలేదు.రాజు అప్పుడే నాలుగుల

విశ్వామిత్ర 2015 – నవల ( 17వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు మర్నాడు పొద్దున్న ఉదయం పొద్దున్న ఎనిమిదింటికి త్రీటౌన్ కానిస్టేబుల్ రాజు సెల్ ఫోన్ గట్టిగా మోగడంతో ఉలి్క్కిపడి లేచాడు. ఎస్సై కేతుబాబు నుంచి ఫోన్. "హోమ్ కొడుకు సురేష్ ఫోన్ చేశాడు. నిన్నేదో గొడవైందంట గదా,నీకు తెలుసంట గదా. అమ్మాయంట గదా. కంప్లయింట్ గూడా ఇచ్చారంట గదా?ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి బొక్కలోకి తోసెయ్యమంటున్నాడు.ఇంకా అరెస్ట్ చేయలేదా అని చిందులు తొక్కుతున్నాడు.మనకెవడు బాసో నాకైతే అర్థం కావటం లేదు.అది సరేలే సురేష్ మనోడే కదా. నిన్నరాత్రే ఎందుకు అరెస్ట్ చేయలేదు?" "సురేష్ ఫ్రెండ్స్ కి దెబ్బలు చాలా బలంగా తగిలాయి సార్.నేను నిన్న వాళ్ళని హాస్పటల్ లో చేర్పించక పోయుంటే కండిషన్ ఇంకా చాలా క్రిటికల్ గా ఉండేది సార్. వాళ్ళని హాస్పటల్ లో జేర్పించడం, వాళ్ళ దగ్గర్నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం ఇవన్నీ పూర్తిచేశాను సార్.అవన్నీ పూర్తయ్యేసరికే తెల్లవారుఝాము ఐదయిపోయింది సార్.

విశ్వామిత్ర 2015 – నవల ( 16వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు ఎగసిపడుతున్న అలలతో ఎఇడి లైట్ ల వెలుగులతో విశాఖపట్టణ సముద్రం మెరిసిపోతుంది.సమయం రాత్రి పదకొండు గంటలు దాటింది.అయినా ఎక్కువగా లేనప్పటికీ ఇంకా జనం ఉన్నారు బీచ్ లో ఆశ్చర్యంగా. దానికి కారణం ఉంది.బీచ్ సాండ్ లో లైట్ లు పెట్టారు. కూర్చోడానికి వీలుగా బీచ్ రోడ్ పొడవునా గ్రానైట్ స్టోన్ వేశారు. గ్రానైట్ స్టోన్ ముందర ఒక పదడుగుల దూరంలో గ్రనైట్ స్టోన్ తోనే చేసిన సోఫాలు అక్కడక్కడ ఉన్నాయి. అక్కడ కూర్చుని ఎగసిపడుతున్న అలలని,సముద్రంమీద పడుతున్న చంద్రకాంతిని చూస్తూ ఎంతకాలమైనా గడిపేయచ్చు. పోలీస్ పేట్రోల్ వాహనం అప్పుడప్పుడు అటూ ఇటూ రౌండ్స్ వేస్తోంది.ఎంతో అందంగా, కొంచెం సెక్యూర్డ్ గానే అనిపిస్తున్నప్పటికీ కూడా..... అంతరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా అక్కడ ఆ సోఫాలో కూర్చుని ఉండడం కొద్దిగా ఆశ్చర్యమే! అదే ఆశ్చర్యం,దానితోపాటు కొంచెం కోరిక, నోవాటెల్ లో డ్రింక్ చేసి ఇంటికి వస్తున్న ఒక నలుగురు కుర్రా

శ్రీరామాయణ సంగ్రహం

ధారావాహికలు
విభీషణ పట్టాభిషేకం రావణుడి అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత లంకారాజ్యానికి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు శ్రీరాముడు. సుగ్రీవుణ్ణి సంతోషంతో కౌగిలించుకున్నాడు. తన పక్కనే వినీతుడై నిలిచి ఉన్న హనుమంతుణ్ణి చూసి శ్రీరాముడు 'నీవు ఇప్పుడు ఈ మహారాజు విభీషణుడి అనుజ్ఞ పొంది వైదేహిని చూసి నా విజయవార్త ఆమెకు తెలియచెప్పాలి' అని కోరాడు. అప్పుడు రాక్షసులు లంకాపట్టణంలో హనుమంతుడి పట్ల వినయవిధేయతలు చూపి గౌరవించారు. వెంటనే లంకాపట్టణానికి వెళ్ళాడు హనుమంతుడు. శ్రీరాముడు ఆమెకు చెప్పవలసిందని చెప్పిన వార్త వినిపించాడు. ‘నీవు చెప్పిన ఈ విజయవార్తకు నేనెట్లా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేడు. నీకెటువంటి బహుమానం ఇవ్వాలన్నా నేనిప్పుడు అశక్తురాలిని.’ అని సీతాదేవి మారుతిని శ్లాఘించింది. సీతమ్మను పలువిధాల బాధలకు గురిచేసిన రాక్షసాంగనలను చంపివేస్తానని హనుమ చెప్పగా ఆమె అతణ్ణి వారించింది. “నా చుట్టూ ఉన్న ఈ స్త్రీలు నన్నెం

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
శ్రీరామరావణుల ప్రచండయుద్ధం – రావణసంహారం అప్పుడు శ్రీరాముడు భూమిమీద నిలిచి రథస్థుడై ఉన్న రావణుడితో పోరాడటం బాగాలేదని దేవతలంతా మాతలి సారథిగా ఆయన రథాన్ని రాముడికి సాయం కోసం పంపవలసిందని ఇంద్రుణ్ణి కోరారు. అప్పుడు మాతలి రాముడి దగ్గరకు ఇంద్రుడి రథాన్ని తీసుకొని వచ్చాడు. రాముడు సంతోషంతో దాని నెక్కి పరమభయంకరంగా రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడు ఏ అస్త్రం ప్రయోగిస్తే మళ్ళీ ఆ అస్త్రంతోనే దాన్ని నిస్తేజం చేశాడు రాముడు. మహాసర్పసంభరితమైన రాక్షసాస్త్రాన్ని రావణుడు రాముడిపై ప్రయోగించగా రాముడు గరుడాస్త్రంతో దాన్ని రూపుమాపాడు. అప్పుడు రావణాసురుడు మహోగ్రుడైనాడు. బాణవర్షం రాముడిమీద కురిపించాడు. రాముణ్ణి ఆయన రథసారథి మాతలిని నొప్పించాడు. ఆ రథధ్వజాన్ని ఒక బాణంతో కొల్చాడు. దేవేంద్రుడి గుర్రాలకు కూడా తన ప్రతాపం చూపాడు. ఆకాశంలో దేవతలు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, మహర్షులు కూడా రాముడి ఈ సంకటస్థితి చూసి విషాదం పొ

విశ్వామిత్ర 2015 – నవల ( 15వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు సిబిఐ గెస్ట్ హౌస్ లో ఎడంచేయికి, కాలుకి కట్లతో అభిషేక్ సోఫాలో, కుడిచేతికి చిన్న ప్లాస్టర్ వేసుకుని రాజు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నారు. జగదీష్ అభిషేక్ ఎదురుగుండా ఉన్న సింగిల్ సీట్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. అభిషేక్ మొహం చాలా సీరియస్ గా ఉంది. అభిషేక్ అడిగాడు "జగదీష్ మీకు, నాకు రాజు, రవిబాబుకి తప్ప ఇంకెవరికీ కేసుకు సంబంధించినవాళ్ళు దాబాలో పార్టీ చేసుకుంటున్నట్టు తెలియదు.మీరెవరికైనా చెప్పారా?రాజు,రవిబాబుల దగ్గర నేను కన్ఫర్మ్ చేసుకున్నాను.వాళ్ళెవ్వరితోనూ మాట్లాడలేదు." జగదీష్ ఒక నిముషం తటపటాయించాడు."ఇంకొక్కమాట.మీరు సమాధానం చెప్పబోయేముందు చంపబడ్డ ఆ నలుగురు వ్యక్తులని గుర్తుపెట్టుకోండి"జగదీష్ మొహం ఎర్రగా మారింది. "నేను హోమ్ మినిష్టర్ గారితో మాట్లాడాను" "థాంక్యూ. అన్నట్టు, జగదీష్, నిన్న మన కస్టడీలోకి తీసుకున్నఆ గ్రాండియోర్ హోటల్ కేప్టెన్, అదే దాబ

విశ్వామిత్ర 2015 – నవల ( 13వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు `సాయిరామ్ దాబా' పెద్ద అక్షరాలు. క్రిందనే ప్రొ|| రవిబాబు కొంచెం చిన్న అక్షరాలు. దాబా మరీ అంత చిన్నదేం కాదు. కనీసం ఇరవై మంది కూర్చోగలిగే టేబుల్స్. కారులు పార్క్ చేసుకోవడానికి పక్కనే పెద్ద ఓపెన్ స్పేస్. మూడు పెడస్టల్ ఫేన్స్. కనబడుతున్న కిచెన్. నాలుగుపక్కలా కర్రలతో నిర్మించబడిన ఫెన్సింగ్. సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు,లంచ్ టైమ్ కావడంవల్ల కాబోలు అన్ని టేబుల్స్ ఫుల్ గా ఉన్నాయి, ఒక్క నాలుగు తప్ప. ఆ నాలుగు పక్క పక్కన లేవు. మూడు ఒకపక్క, ఒకటి ఇంకొక పక్క ఉన్నాయి. రెండు టేబుల్ రోస్ మధ్యలో దాదాపు నలుగురు మనుషులు పట్టే స్థలం ఉంది. రిజర్వడ్ అని రాసిఉన్న కార్డ్స్ ఆ టేబుల్ మీద పెట్టి ఉన్నాయి. విశాఖపట్టణం, భీమిలి స్టేట్ హైవేలో రోడ్డుమీదే ఉంది విశాలమైన ఆదాబా. చుట్టుపక్కల ఏవో ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాబాకు వచ్చిన అభిషేక్,రాజులకి కనబడిన దృశ్యం అది. రవిబాబు ఇద్దరిని దగ్గరుండి ఖాళీగా ఉన్న ఒ

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
లక్ష్మణమూర్ఛ తరువాత రావణుడి చేతిలో ఉన్న మహాధనుస్సును బాణప్రయోగంతో ముక్కలు చేశాడు లక్ష్మణుడు. మహావేగంతో రథం మీది నుంచి కిందికి దూకి శక్యాయుధాన్ని విభీషణుడి మీదికి విసరివేశాడు రావణుడు. ఆ శక్త్యాయుధం విభీషణుణ్ణి తాకే లోపునే లక్ష్మణుడు మూడుబాణాలతో ఆశక్త్యాయుధాన్ని నిర్వీర్యం చేశాడు. అది మూడుముకలైంది మరొక ప్రబలాతిప్రబలమైన శక్త్యాయుధాన్ని దేవేంద్రుడి వజ్రాయుధంలాంటిదాన్ని యమదండం వంటిదాన్ని విభీషణుడిపైకి విసరబోతున్నాడు రావణుడు. విభీషణుడి ప్రాణా పాయకారస్థితి చూసి లక్ష్మణుడు అడ్డుపడ్డాడు. రావణుడిపై సందులేకుండా లక్ష్మణుడు శరప్రయోగం చేస్తుంటే, రావణుడు శక్త్యాయుధాన్ని లక్ష్మణుడిపై ప్రయోగించాడు. అది లక్ష్మణుడు పైకి వచ్చి పైబడపోతుండగా రాముడు దానినీ కట్టడి చేయబోయే లోపలనే లక్ష్మణుడి వక్షస్థలాన్ని తీవ్రంగా తాకింది. ఆదెబ్బకు లక్ష్మణుడు కిందపడి మూర్చిల్లాడు. దగ్గరలోనే ఉన్న రాముడు లక్ష్మణుడి దుఃస్థితి చూశాడు

విశ్వామిత్ర 2015 – నవల ( 12వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు శివహైమ మాత్రం చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోయింది.నిద్రపోయేముందు సెల్ లో రికార్డ్ చేసిన అభిషేక్ తనకోసం పాడిన పాటను సంతోషంగా మళ్ళీ మళ్ళీ వింటూ హాయిగా నిద్రపోయింది. తెలిసీ మొదలవ్వలేదే ముహూర్తం నే పెట్టలేదే అన్ని ఆలోచనలకన్నా ముందే ఇది మొదలవుతోందే మెరుపే మనిషయ్యిందా నవ్వుల్లో ముత్యాలే చిమ్మిందా నా మనసే మేఘమయ్యింది వర్షమై నీ చుట్టే కురిసింది కడిగిన ఆ ముత్యాలన్నీ ఇక నావే వెలకట్టలేని ఆ హృదయం ఎన్నడూ ఇక నాదే It's not infatuation It will never reach saturation It's not an exaggeration give me visa to the land of LOVE Nation (తెలుగమ్మా, తెలుగులో పాడు) ఇది మోహం కాదే ఎడబాటోర్వలేనే అతిశయోక్తి కానేకాదే రాణి ముద్ర వెయ్యవా ప్రేమదేశానికే రాజుని చేస్తూ నీ హృదయ ప్రపంచాన్నే ఏలనా చక్రవర్తినై ప్రేమపతాకాన్నే ఎగరవేస్తూ మర్నాడుపొద్దున్నఇంకానిద్రలేవకుండానే