ధారావాహికలు

శ్రీరామాయణ సంగ్రహం

ధారావాహికలు
ఉత్తరాకాండ శ్రీరామచంద్రుడు రావణసంహారం చేసి అయోధ్యలో పట్టాభిషిక్తుడై సకల సంవత్సమృద్ధంగా జనరంజకంగా పరిపాలిస్తుండడం చూసి ఇలలోని నాలుగు దిక్కుల నుంచి పరమఋషులు ఎంతో సంతోషంతో ఆ శ్రీరామప్రభువును అభినందించటానికీ, తమ అభిమానం తెలియజేయటానికీ అయోధ్యకు వచ్చారు. తూర్పుదిక్కు నుంచి వచ్చిన వారిలో కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, మేధాతిథి కుమారుడు కణ్వుడు మొదలైన వారున్నారు. దక్షిణం నుంచి వచ్చిన వారిలో ఆత్రేయుడు, నముచి, ప్రముచి, ఋషులందరిలోనూ సర్వశ్రేష్టుడూ, మహాప్రభావసంపన్నుడూ అయిన అగస్త్యుడూ ఉన్నారు. పడమటి నుంచి కవషుడు, ధౌమ్యుడు, రౌద్రేయుడు అనే వారు తమ శిష్యులతో కూడా వచ్చారు. ఉత్తరదిక్కు నుంచి వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అను సప్తర్షులు వచ్చారు. ఇట్లా వీళ్ళంతా రాచనగరు సింహద్వారం సమీపించి అక్కడి ద్వారపాలకుడితో తమ రాక శ్రీరామచంద్రుడికి తెలియజేయవలసిందిగా అగస్త్యుడ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి సమాజానుభూతి దృష్టితో గమనిస్తే విశ్వనాథ రచనా పరమార్థం మరింత స్పష్టంగా గోచరిస్తుంది. పంచవిధ ప్రవృత్తుల ద్వారా సమాజం పొందగలిగే అనుభూతి విశేషాలను వివిధ ప్రక్రియల ద్వారా, వివిధ కవులు సాహితీ ప్రపంచంలో ప్రచలింపచేస్తున్న ప్రయోగాల ద్వారా పరిచ్చిన్నంగా పొందగలిగే వికీర్ణ స్థితిని విశ్వనాథ సమీకించి, వాటినన్నింటిని సమాజానికి సమాహార రూపంగా అందింపగలిగిన ఒక మహాకావ్యాన్ని రచించటానికి పూనుకొన్నాడు. రామాయణ కల్పవృక్షం పేరుకు తగ్గట్టు సమాజం ఆకాంక్షించే వాస్తవిక, కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మికానుభవాల సంపుటిని అందింపగలిగిన విశిష్ట రచన. ఆయన జీవుని వేదన సమగ్ర కళానుభూతి కోసం సమాజ జీవచైతన్యం అర్రులు సాచే ఆవేదన. పంచజిహ్వల సమాజ చేతనకు విశ్వనాథవారు అందించిన అమృతనైవేద్యమే, అనుభవకోశమే రామాయణ కల్పవృక్షం. ఆ కావ్యంలోని సన్నివేశాలు పాత్రస్వభావాలు సమాజంలో కానవచ్చే వాస్తవజీవిత ప్రతిబింబాలుగా ఉండటం

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి ఇందులో వాస్తవికానుభూతి లేదని ఎలా చెప్పగలం? తేలిందేమంటే ఏ కవిత్వమని నువ్వు పేరు పెట్టుకున్నా, ఏ ప్రక్రియలో నువ్వు రాస్తున్నా అది నిజంగా కవిత్వమే కనుక అయితే అనుభూతికి అది దూరంగా ఏమాత్రం ఉండదు. కాకపొతే తరతమ భేదాలుంటాయి. అంతే. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. “భారతీయులు - ఆ మాటకొస్తే మార్క్సిస్టులు కాని వారందరూ భావించే సామాజికానుభూతికిన్నీ మార్క్సిస్టులు చెప్పే అనుభూతికిన్నీ ఎంతో భేదం ఉంది. మార్క్సిజం వల్ల సాంఘిక వ్యవస్థలోని కొన్ని రంగాలలో సుస్థితి ఏర్పడుతుందని నమ్మేవాళ్ళు కూడా అనుభూతి విషయంలో వారి దృక్పథాలను అంగీకరించారు. మార్క్సిజంకు కట్టుబడిన అభ్యుదయ రచయితలూ, విప్లవ రచయితలూ సమాజ వ్యక్తిలోని వాస్తవానుభూతిని, విజ్ఞానానుభూతిని అంగీకరింపగలరేమో కాని మిగిలిన మూడూ వారి దృష్టిలో మృగ్యాలే లేదా మిధ్యలే. ఆ మూడు ప్రవృత్తులను స్పృశించే కవితా చైతన్యాలను వారు వ్యక్తివాద ధోరణ

విశ్వామిత్ర 2015 – నవల ( 21 వ భాగము )

ధారావాహికలు
-ఎస్ ఎస్ వి రమణారావు ఎండి ప్రారంభించాడు."ఇది ఒక్స్ మల్టీపర్పస్ ఫ్లైఓవర్ గా మనం చెప్పుకోవచ్చు.మనకు మల్టీపర్పస్ డామ్స్ గురించి తెలుసు.అవి తాగునీరు ఇస్తాయి.సాగునీరు ఇస్తాయి.విద్యుత్ తయారీకి అవసరమైన నీరుకూడా ఇస్తాయి.దీనిని నేను మల్టీపర్పస్ ఫ్లై ఓవర్ అని దేనికి పిలుస్తున్నాను అంటే,ఈఫ్లైఓవర్ ట్రాఫిక్ సమస్యలను తీర్చడమే కాకుండా,మన విద్యుత్ అవసరాలను తీరుస్తుంది.కురిసే ప్రతి వర్షం బొట్టును రక్షించి మననీటి కొరతను కూడా నివారిస్తుంది.కాబట్టి దీనినొక ఇంజనీరింగ్ ఫీట్ గా చెప్పుకోవచ్చు.ఇప్పుడు నేను మీకు ఆర్టిస్టిక్ డిజైన్ ఆఫ్ ఫ్లైఓవర్ చూపిస్తాను."స్క్రీన్ మీద ఒక చిత్రం కనబడింది. ఎండి ఆచిత్రాన్ని వివరించడం ప్రారంభించాడు.".ఇది విశ్వామిత్ర మాకు మొదట చూపించిన ఆర్టిస్టిక్ పిక్చర్ ఆఫ్ ద ఫ్లైఓవర్స్.అవి రెండు ఫ్లైఓవర్ లు.ఈరెండు ఫ్లైఓవర్ లు ఆపోజిట్ స్లోప్స్ ప్రిన్సిపుల్ ఆధారంగా డిజైన్ చేయడం జరిగింది.ఒక ఫ్ల

శ్రీరామ పట్టాభిషేక సంరంభం

ధారావాహికలు
అయోధ్యానగరమంతా సంతోషంతో కళకళలాడుతున్నది. శ్రీరాముడు తమ ఏలికగా పట్టాభిషేకం జరుపుకొబోతున్నాడు అని అయోధ్య పౌరుల హర్షం ఆకాశం అంటుతూ ఉంది. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకానికి కావలసిన సన్నాహాలన్నీ భరతుడు (ఆనాడు దశరథమహారాజులాగా) చూసుకుంటున్నాడు. సుగ్రీవుడితో ఆ మహాయశుడైన భరతుడు 'కపిరాజా! శ్రీరామ పట్టాభిషేకం జరగబోతున్నదికదా! సమస్త సముద్రజలాలు, నదీజలాలు వెంటనే తెప్పించే భారం నీదే' అని సుగ్రీవుణ్ణి అర్థించాడు. వెంటనే సుగ్రీవుడు శీఘ్రవేగులూ, అత్యంత బలపరాక్రమ సంపన్నులూ అయిన నలుగురు వానర ప్రముఖులను పిలిచి - ‘ఇప్పటికిప్పుడు మీరు నాలుగు సముద్రాల జలాలు తీసుకొని రావాలి' అని వాళ్ళను ఆదేశించాడు. నవరత్నస్థిగీతకాంచన కళాశాలను వారికందజేశాడు. “సూర్యోదయాత్పూర్వమే ఆ జలాలతో మీరిక్కడ ఉండాలి" అని సుగ్రీవాజ్ఞాగా వారినాయన ఆదేశించాడు. గరుడానిల వేగంతో వాళ్ళు ఆ పని నిర్వహించటానికి వెళ్ళారు. వీళ్ళే కాకుండా జాంబవంతుడూ, హనుమంతుడ

విశ్వామిత్ర 2015 – నవల ( 19వ భాగము )

ధారావాహికలు
"చాలా మాసివ్ ఆపరేషన్ కదూ" శివకుమార్ చూపించిన కుర్చీలో కూర్చుంటూనే అన్నాడు అభిషేక్. శివకుమార్ వెంటనే షార్ప్ గా, ప్రశ్నార్థకంగా చూశాడు అభిషేక్ వంక. "ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం,ఇళ్ళు ఖాళీ చేయించడం, అంగబలంతోటి, అధికారబలం తోటి అర్థబలం తోటి..ఎందుకిదంతా?" శివకుమార్, అభిషేక్ కళ్ళల్లోకి చూస్తూ ఏమీ మాట్లాడలేదు. తన రేంజ్ దాటిపోయిందని తెలుసుకున్న రాజు అభిషేక్ చెప్పినట్టుగానే నిశ్శబ్దంగా శివకుమార్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. "మీ మోడస్ ఆపరాండీ ఏమిటంటే మీరు కన్ను వేసిన స్థలం చుట్టుపక్కల ఏదో ఒకటి రెండు స్థలాలు కొనడం. అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు, పేకాట క్లబ్ లు, వ్యభిచార నిలయాలు నడపడం, వాటిని తట్టుకోలేక వారు అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయేలా చేయడం, వాటికికూడా కదలని వాళ్ళని డైరెక్ట్ గా బెదిరించడం. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా న్యాయం దక్కదు,కారణం హోంమినిష్టర్ మీమనిషి, మునిసిపల్ కమీషనర్ ఆపీస్ కి వస్తే

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
అప్పుడు దేవతలు 'నాయనా శ్రీరామా! నిన్ను చూడాలని స్వర్గలోకం నుంచి నీ తండ్రి దశరథ మహారాజు విమానంలో వచ్చాడు' అన్నారు. ‘మీ అన్నదమ్ములాయనకు నమస్కరించండి' అని పరమశివుడు వాళ్ళకు చెప్పాడు. విమానంలో ఉన్నతాసనం మీద దివ్యకాంతులతో ఉన్న దశరథ మహారాజుకు అన్నదమ్ములు నమస్కరించారు. దశరథ మహారాజు వాళ్ళను కౌగిలించుకున్నాడు. జరిగిన సంగతులన్నీ శ్రీరాముడికి మళ్ళీ గుర్తు చేశాడు దశరథ మహారాజు. తరువాత మళ్ళీ ఆయన స్వస్థానానికి వెళ్లి పోయినాడు. దేవేంద్రుడప్పుడు శ్రీసేతారామలక్ష్మణులను ప్రశంసించి ఏదైనా వరం కోరుకోవలసింది అని శ్రీరాముణ్ణి కోరాడు. అప్పుడు శ్రీరాముడు యుద్ధంలో మరణించిన వానరులు, గోలాంగూల (కొండముచ్చుల) యోధులు, అందరూ పునర్జీవితులయ్యేట్లూ ఎటువంటి శరీరాయాసం పొందకుండా ఉండేట్లు, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేట్లు వరం ఇవ్వవలసిందిగా దేవేంద్రుణ్ణి అర్థించాడు. అందుకు దేవేంద్రుడు తథాస్తని సంతోషంగా చెప్పి అయోధ్య వెళ్ళి సకల సౌఖ్యా