ధారావాహికలు

శ్రీరామ పట్టాభిషేక సంరంభం

ధారావాహికలు
అయోధ్యానగరమంతా సంతోషంతో కళకళలాడుతున్నది. శ్రీరాముడు తమ ఏలికగా పట్టాభిషేకం జరుపుకొబోతున్నాడు అని అయోధ్య పౌరుల హర్షం ఆకాశం అంటుతూ ఉంది. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకానికి కావలసిన సన్నాహాలన్నీ భరతుడు (ఆనాడు దశరథమహారాజులాగా) చూసుకుంటున్నాడు. సుగ్రీవుడితో ఆ మహాయశుడైన భరతుడు 'కపిరాజా! శ్రీరామ పట్టాభిషేకం జరగబోతున్నదికదా! సమస్త సముద్రజలాలు, నదీజలాలు వెంటనే తెప్పించే భారం నీదే' అని సుగ్రీవుణ్ణి అర్థించాడు. వెంటనే సుగ్రీవుడు శీఘ్రవేగులూ, అత్యంత బలపరాక్రమ సంపన్నులూ అయిన నలుగురు వానర ప్రముఖులను పిలిచి - ‘ఇప్పటికిప్పుడు మీరు నాలుగు సముద్రాల జలాలు తీసుకొని రావాలి' అని వాళ్ళను ఆదేశించాడు. నవరత్నస్థిగీతకాంచన కళాశాలను వారికందజేశాడు. “సూర్యోదయాత్పూర్వమే ఆ జలాలతో మీరిక్కడ ఉండాలి" అని సుగ్రీవాజ్ఞాగా వారినాయన ఆదేశించాడు. గరుడానిల వేగంతో వాళ్ళు ఆ పని నిర్వహించటానికి వెళ్ళారు. వీళ్ళే కాకుండా జాంబవంతుడూ, హనుమంతుడ

విశ్వామిత్ర 2015 – నవల ( 19వ భాగము )

ధారావాహికలు
"చాలా మాసివ్ ఆపరేషన్ కదూ" శివకుమార్ చూపించిన కుర్చీలో కూర్చుంటూనే అన్నాడు అభిషేక్. శివకుమార్ వెంటనే షార్ప్ గా, ప్రశ్నార్థకంగా చూశాడు అభిషేక్ వంక. "ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం,ఇళ్ళు ఖాళీ చేయించడం, అంగబలంతోటి, అధికారబలం తోటి అర్థబలం తోటి..ఎందుకిదంతా?" శివకుమార్, అభిషేక్ కళ్ళల్లోకి చూస్తూ ఏమీ మాట్లాడలేదు. తన రేంజ్ దాటిపోయిందని తెలుసుకున్న రాజు అభిషేక్ చెప్పినట్టుగానే నిశ్శబ్దంగా శివకుమార్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. "మీ మోడస్ ఆపరాండీ ఏమిటంటే మీరు కన్ను వేసిన స్థలం చుట్టుపక్కల ఏదో ఒకటి రెండు స్థలాలు కొనడం. అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు, పేకాట క్లబ్ లు, వ్యభిచార నిలయాలు నడపడం, వాటిని తట్టుకోలేక వారు అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయేలా చేయడం, వాటికికూడా కదలని వాళ్ళని డైరెక్ట్ గా బెదిరించడం. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా న్యాయం దక్కదు,కారణం హోంమినిష్టర్ మీమనిషి, మునిసిపల్ కమీషనర్ ఆపీస్ కి వస్తే

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
అప్పుడు దేవతలు 'నాయనా శ్రీరామా! నిన్ను చూడాలని స్వర్గలోకం నుంచి నీ తండ్రి దశరథ మహారాజు విమానంలో వచ్చాడు' అన్నారు. ‘మీ అన్నదమ్ములాయనకు నమస్కరించండి' అని పరమశివుడు వాళ్ళకు చెప్పాడు. విమానంలో ఉన్నతాసనం మీద దివ్యకాంతులతో ఉన్న దశరథ మహారాజుకు అన్నదమ్ములు నమస్కరించారు. దశరథ మహారాజు వాళ్ళను కౌగిలించుకున్నాడు. జరిగిన సంగతులన్నీ శ్రీరాముడికి మళ్ళీ గుర్తు చేశాడు దశరథ మహారాజు. తరువాత మళ్ళీ ఆయన స్వస్థానానికి వెళ్లి పోయినాడు. దేవేంద్రుడప్పుడు శ్రీసేతారామలక్ష్మణులను ప్రశంసించి ఏదైనా వరం కోరుకోవలసింది అని శ్రీరాముణ్ణి కోరాడు. అప్పుడు శ్రీరాముడు యుద్ధంలో మరణించిన వానరులు, గోలాంగూల (కొండముచ్చుల) యోధులు, అందరూ పునర్జీవితులయ్యేట్లూ ఎటువంటి శరీరాయాసం పొందకుండా ఉండేట్లు, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేట్లు వరం ఇవ్వవలసిందిగా దేవేంద్రుణ్ణి అర్థించాడు. అందుకు దేవేంద్రుడు తథాస్తని సంతోషంగా చెప్పి అయోధ్య వెళ్ళి సకల సౌఖ్యా

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
విభీషణా! నా మాట కాదని ఈ వానరుల్ని ఎందుకు బాధిస్తున్నావు? వారిని తొలగించవద్దు. వాళ్ళంతా నావాళ్ళు. న గృహాణి న వస్త్రాణి న ప్రాకారా స్తిరస్క్రియాః నేదృశా రాజసత్కారాః వృత్త మావరణం స్త్రియాః (యుద్ధ. 117.27) స్త్రీని మరుగుపరచి కాపాడేవి ఇళ్ళు కావు, వస్త్రాలు కావు, ప్రాకారాలు కావు, తెరలు కావు, రాజసత్కారాలు కావు, మంచి నడవడియే ఆమెకు ఆభరణం. వ్యసనేషు న క్రుచ్చేషు న యుద్ధేషు స్వయంవరే, న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్యతి స్త్రియాః    (యుద్ధ. 117.28) తనకు ఇష్టమైన వారితో ఎడబాటు వంటి కష్టాలు వచ్చినప్పుడూ, రాజ్యంలో కల్లోలాల వంటి సందర్భాల్లోనూ, యుద్ధాల్లో, స్వయంవరాల్లో, యజ్ఞప్రదేశాలల్లో, వివాహాల్లో స్త్రీలు ఇతరులకు కనపడటం దోషం కాదు. కాబట్టి సీతాదేవి పల్లకీ విడిచిపెట్టి కాలినడకనే నావద్దకు రావచ్చు. ఈ వానరులంతా ఆమెను చూస్తారు. నా సమీపంలో ఉండగా మిత్రులతోకూడిన నన్ను ఆమె కూడా చూస్తుంది" అన్నాడు. అప్పుడు సీతా

విశ్వామిత్ర 2015 – నవల ( 18వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు "అది సార్ సంగతి" రాజు పూర్తి చేశాడు "అంతేనా?"అన్నాడు అభిషేక్"ఈ విషయం చెప్పడానికి నువు ఇంత సంకోచం పడడమెందుకు?" రాజు ఆశ్చర్యపోయాడు"అదేంటి సార్,ఒక అమ్మాయి అర్థరాత్రి బీచ్ కి వెళ్ళడం,అక్కడ రౌడీలని చితక బాదడం,అదంతా వీడియో రికార్డింగ్ చేయడం,ఇదంతా మీకు వింతగా ఎబ్నార్మల్ గా అనిపించడం లేదా?" "ఏంలేదు.అర్థరాత్రి బీచ్ కి వెళ్ళాలనే ఉత్సాహం ఉంది,అనుకోనిదేమైనా జరిగితే తనను తాను రక్షించుకోగలననే ధైర్యం ఉంది.అంతకు మించి ఏం కనబడట్లేదు నాకు" "మీరిలా అంటారని మీ సంస్కారాన్ని బట్టి ఊహించాను సార్.కాని తరవాత ఇంకొక విషయం జరిగింది సార్." రాజు ఆగాడు.అభిషేక్ వింటున్నాడు" ఆ ఇంటి బయటకు వచ్చి కేతుబాబుని ఏ హాస్పటల్ కి తీసుకు వెళ్ళారో కనుక్కుని ఆ హాస్పటల్ కి వెళ్ళుతుండగా నాకు ఓఫోన్ వచ్చింది సార్"రాజు మళ్ళీ ఆగి ఇంకో పెగ్గు పోసుకున్నాడు అభి దింకా మొదటిపెగ్గే ఇంకా పూర్తికాలేదు.రాజు అప్పుడే నాలుగుల