ధారావాహికలు

అనర్ధాలకు మూలం! అసూయలే శాపం!

ధారావాహికలు
-అమరనాథ్ జగర్లపూడి అసూయ (Jeously) ఇది మనం తరచుగా వినే పదమే తనకున్నదేదో పోతుందనో, తనకు రానిది ఇతరులకు దక్కుతుందనే, తానూ పొందలేంది ఇతరులు పొందుతారనో అని మనస్సు అనేకానేక భావోద్వేగాలకు గురౌతూ మనసును అనేక చికాకులకు గురిచేస్తుంటుంటుంది ఇదే అసూయ అనే మూలాలకు బీజాలు. ఇది బుద్ధిజీవి యైన మనిషి లో సర్వసాధారణమైన విషయం. ఈ సాధారణం అసాధారణమైతేనే అసలు సమస్యలు ప్రారంభమయి మనసు అల్లకల్లోలంలోకి ముంచి అభద్రతా భావాలకు గురి చేస్తుంది. సహజంగా వ్యక్తి తన ఉనికికి భంగం కలుగుతుందను కునేటప్పుడు,దాని వలన సమాజంలో తన సంబంధాలలో పరువు, ప్రతిష్టల లలో సమతూల్యతలకు భంగం కలుగుతుందనుకొనేటప్పుడు ఈ'అసూయ అనేది పొడసూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే ఒక్కొక్కసారి ద్వేషం రూపంలో అనేక అఘాయిత్యాలకు కారణమయి జీవితాలను నాశనం చేస్తుంది కూడా ప్రేమలు, చదువులు, ఆర్ధిక కారణాలు ఆటలు, పాటలు, రాజకీయాలు, సామాజిక వివక్షతలు, ఉద్యోగాల్లో, పిల్లల పెంపకాల

శ్రీ రామ సంగ్రహం

ధారావాహికలు
లంకానగరం -అక్కిరాజు రామాపతి రావు అప్పుడు విశ్రవసుడు "నాయనా! దక్షిణ సముద్రతీరంలో 'త్రికూటం' అనే పర్వతముంది. దాని శిఖరంపై విశ్వకర్మ రాక్షసుల కోసం చాలా గొప్ప నగరం నిర్మించాడు. దాని సంపద, సొగసు వర్ణించలేము. ఒకప్పడు రాక్షసులా నగరంలో నివసించే వాళ్ళు. అయితే దేవాసుర యుద్ధం జరిగినప్పుడు మహావిష్ణువుకు భయపడి ఆ రాక్షసులంతా ఆ మహ పట్టణం విడిచిపెట్టి పాతాళలోకంలోకి వెళ్ళి దాక్కున్నారు. అదిప్పుడు నిర్జనంగా ఉంది. కాబట్టి నీవక్కడ నివసించు" అని తండ్రి చెప్పటంతో వైశ్రవణుడు అక్కడకు వెళ్ళి రాక్షసులను కూడా తనతో ఉండవలసిందిగా చెప్పి ఆ నగరాన్ని ఇంద్రుడి రాజధాని అయిన అమరావతిలాగా కళకళలాడేట్లు చేసి అక్కడ నివసించాడు. అక్కడ ధనపతి వైశ్రవణుడు మహా వైభవంతో లంకలో ఉంటూ వచ్చాడు' అని అగస్త్యుడు చెపుతుండగా శ్రీరాముడికి మరింత ఉత్సుకత కలిగింది. రావణుడికంటే పూర్వమే లంకలో రాక్షసులు ఉండేవారని తెలిసి "ఆ రాక్షసులు రావణ, కుంభకర్ణులకన్న

భయం భయం రోగ భయం !

ధారావాహికలు
( హైపోకాండ్రియాసిస్ ) అమరనాథ్.జగర్లపూడి ( రోగ భ్రమ లేదా రోగ భయ స్థితి ఫై ఒక వ్యాసం) మానసిక ఆరోగ్యమే శరీర ఆరోగ్యానికి రక్షణ కవచం ."రోగం మనిషిని చంపదు దాని తాలూకా భయమే మనిషికి హాని చేస్తుంది" దీనికై మన పట్ల, మన శరీరం పట్ల మనకు అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా వుంది ! శరీరానికి వ్యాధి అనేది చాలా సహజమైన లక్షణం ఈ విషయంలో మానవ శరీరం అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తుంది. దాదాపు చిన్న చిన్న రోగాలను సైతం తనకు తానుగా రక్షించుకునే శక్తి శరీరానికి వుంది. కానీ ఆ అవకాశం శరీరానికి ఇవ్వకుండా మన ఆత్రుత, అనవసర ఆందోనళనతో మరి కొన్ని అనవసర సమస్యలు తెచ్చి పెట్టుకుంటాము. ఇందులో ముఖ్యంగా హైపోకాండ్రియాసిస్ దీనినే రోగ భ్రమ స్థితి లేదా రోగ భయ స్థితి అంటాము. ఇది ఒక మానసిక సమస్య ఇందులో చిన్న చిన్న రోగ లక్షణాలు కన్పించినా దానిని భూతద్ధంలో చూస్తూ తనకేదో అయిపోతుందనే భ్రమతో ఆందోళనకు గురి అవుతుంటారు కొందరు, మరికొందరు ఏవ

విశ్వామిత్ర 2015 – నవల ( 24 వ భాగము )

ధారావాహికలు
రాజు డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు.పక్కనే శివకుమార్ కూర్చుని ఉన్నాడు.వెనకాల అభిషేక్,శివహైమ కూర్చుని ఉన్నారు.రాజు సడన్ గా అన్నాడు"విశ్వామిత్ర ఎందరికో సహాయం చేశాడు సార్.స్లమ్స్ వెకేట్ చేయించడం వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళకి చాలామందికి ఉపాధి కల్పించాడు.ఆర్థికంగా ఆదుకున్నాడు.డాక్టర్ల చేత వైద్యమూ,మందులూ కూడా ఇప్పించేవాడు.పోలీస్ స్టేషన్ వచ్చిన తగాదాలను జగదీష్ అతని అనుచరుల దగ్గరకు వెళ్ళకుండా తనే చాలా మటుకు పరిష్కరించేవాడు.రేప్ అండ్ మర్డర్ కేసులైతే తనే నిందితులని చంపేసేవాడు.రాగింగ్ కేసుల్ని,స్టేషన్ కొచ్చి మగపిల్లలు వేధిస్తున్నారని కంప్లయింట్ చేసినా ,పోలీసులు పట్టించుకోని ఎన్నో కేసులు తనే పరిష్కరించాడు.కాని తన పేరు బయటకి పొక్కకుండా జాగ్రత్త పడేవాడు.కొన్ని కేసుల్లో,సెటిల్మెంటుల్లో నేనుకూడా ఇన్వాల్వ్ అవడం వల్ల నాకు విశ్వామిత్రతో చనువు పెరిగింది.ఇంత వయసొచ్చినా రెండు లాంగ్వేజెస్ లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాన

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి కవిత ఎంత హృదయాన్ని కదిలించింది అన్నది కాదు ప్రధానం; సామాజికునికి మానసిక చైతన్యం కార్యరూపంగా ఎంత ప్రవహించింది అన్నదే ప్రమాణం. ఆచరణ వెనుక అనుభూతి లేదని చెప్పడం అసంబద్ధం. మానసికంగా ఉత్తేజం పొందనివాడు శారీరికంగా కార్యశీలి కాలేడు. కవి ఉత్తేజితుడై కలమాడితే చాలు. కాని మార్క్సిస్టు కవిత కలంతో సంతృప్తి పడేదికాదు. హలంగానో, గన్ గానో మారాలి. వాటిని పట్టినవాడే విప్లవ కవిత్వానుభూతిని కార్యరూపంగా సాధిస్తున్నవాడు. ఒకవిధంగా మార్క్సిస్టు సాహిత్యంలో కలానికున్న ఈ గౌణమైన గౌరవాన్ని బట్టి కవి ప్రచారకుడనీ, కవిత్వం నినాదమని, అనుభవం కవిత్వం వ్రాసే కవిది కాదు, దాన్ని కార్యరూపంలో పెట్టే సమాజానిదేనని సాధారణంగా భావింపబడుతోంది. అందువలన ఈ పద్ధతిలో- కవితా సామాగ్రికి కనీస గౌరవం - కార్యాచరణ సూత్రాలకు కనకాభిషేకం.” “ఈ మాట అనుశీలన కోసం ఏర్పరచుకుంటున్నదే. అభ్యుదయ కవులు, విప్లవకవులు సమాజ వాస్తవికతను కవిత్వంలో ప

రాక్షసుల పుట్టుపూర్వోత్తరాలు – యుద్ధకాండ

ధారావాహికలు
రాక్షసుల పుట్టుపూర్వోత్తరాలు అగస్త్యులవారప్పుడు "సరే! అయితే విను. రావణుడి పుట్టుపూర్వోత్తరాలు ముందుగా చెప్పి, ఇంద్రజిత్తు ఆ రావణుణ్ణి ఎట్లా మించిపోయినాడో నీవే తెలుసుకొనేట్లు ఆ రాక్షసుల వృత్తాంతం చెపుతాను" అన్నారు. “కృతయుగం దగ్గరకు వద్దాం. బ్రహ్మదేవుడు ముందుగా పదిమంది ప్రజాపతులను (మానసపుత్రులను) సృష్టించాడు కదా! ఈ పదిమందిలో పులస్త్యుడు ఒకడు. ఆయన బ్రహ్మర్షి, వేదనిధి, తపస్వి, మహామహిమాన్వితుడు. ఆయన నిరంతర తపస్సు కోసం మేరుపర్వత పాదప్రదేశంలోని తృణబిందు మహర్షి ఆశ్రమం ఆవాసంగా చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతం రమ్యమైన ప్రకృతి సౌందర్య విరాజితమైన ప్రదేశం కాబట్టి సకల దేవగణ సుందర తరుణులు అక్కడ ఆటపాటలతో, వేడుకలతో, తమ యౌవన విలాసాలతో విహరిస్తుండే వారు. అది పులస్త్య మహర్షికి భరింపరానిదైంది. ఆయనకు చాలా కోపం వచ్చింది. “నా చూపుమేర ఇక్కడకు వచ్చినవాళ్ళు, నా తపస్సుకు అంతరాయం కలిగించిన వాళ్ళు తమ కన్యత్వం పోగొట్టుకొ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి నాటకాన్ని చూస్తున్నా, కవిత్వాన్ని పఠిస్తున్నా సహృదయుడు ఆనందాన్ని పొందుతాడు. ఈ అనుభవం కవికీ, పాఠకుడికీ ఇద్దరికీ ఉంటుంది. “నాయకస్య కవేః శ్రోతుః సమానో నుభావస్తతః" అంటే కవి అనుభూతిని పొంది రాస్తే, దాన్ని పాఠకుడు అనుభవిస్తున్నాడు. అలాగే రంగస్థలం మీద నాయకాదులు అనుభవించి ప్రదర్శిస్తున్న అనుభూతిని ప్రేక్షకుడు అనుభవిస్తున్నాడు. అంటే ఈ అనుభూతికి కారణం కవి పొందిన అనుభూతే. దాన్నే సహృదయుడూ పొందుతున్నాడన్న మాట. అంటే ఈ రెండు అనుభూతులు సమానాలైపోతున్నాయి. ఏ యుగంలోనో రాముడు పొందిన బాధను కవి వర్ణిస్తే, రామాది పాత్రధారులు నటిస్తుంటే, సహృదయుడు అదే అనుభూతిని పొందుతున్నాడన్నమాట. దీన్ని అలంకారశాస్త్రంలో సాధరణీకరణమంటారు. “భారతదేశ రణసిద్ధాంతం"లో సాధారణీకరణం ప్రసిద్ధం. ఈ మార్గం కథనాశ్రయించిన కావ్యాలకే ఎక్కువగా వర్తిస్తుంది. సామాజికానుభవ చైతన్యాన్ని గమనించిన కవి, సామాజికుల సహానుభూతి పొంద కలిగిన పాత్

విశ్వామిత్ర 2015 – నవల ( 23 వ భాగము )

ధారావాహికలు
విశ్వామిత్ర సరెండర్ అయిపోయాడు పోలీస్ స్టేషన్ లో. మీడియాకి ఆ విషయం ముందే తెలియడం వల్ల,మీడియా మొత్తం,నేషనల్ ఛానెల్స్ తో సహా పోలీస్ స్టేషన్ ముందు ఉంది. "నగరంలో జరిగిన బ్లాస్ట్ లకు మీకు సంబంధం ఉందా?" అని విశ్వామిత్రని అడిగినప్పుడు "ఉంది"అని విశ్వామిత్ర చెప్పినప్పుడు మీడియా మొత్తం స్టన్ అయింది. "ఎందుకు బ్లాస్ట్ చేశారు?" "నేరం కాదు కాబట్టి" "ఎందుకు నేరం కాదని మీరు అనుకుంటున్నారు?" "నేను బ్లాస్ట్ చేసిన ప్రోపర్టీస్ అన్నీ నా, నామిత్రుల ప్రోపర్టీలు." "కొన్ని హాస్పటల్స్, హోటళ్ళు కూడా కూల్చేశారు కదా? ఉదాహరణకి గ్రాండియోర్ హోటల్, డాక్టర్స్ n డాక్టర్స్ హాస్పటల్" "అవన్నీ నాలాల్లోనూ, ప్రభుత్వస్థలాల్లోనూ కబ్జాలు చేసి కట్టినవి. కూలిస్తే తప్పేముంది? ఒక్క ప్రాణనష్టమైనా జరగలేదే. అధికారంతోటి, రాజకీయబలం తోటి, కొంతమంది అధికారుల అవినీతిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని కొంతమంది దుర్మార్గులు, లొంగ దీసు