ఈ మాసం సిలికానాంధ్ర

అన్నమాచార్య 610వ జయంతి ఉత్సవం

ఈ మాసం సిలికానాంధ్ర
610వ అన్నమయ్య జయంత్యుత్సవం - అమెరికా ప్రాంతీయ పోటీలు సిలికానాంధ్ర మే నెల 25, 26, 27 తేదీలలో కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలొ 610వ అన్నమయ్య జయంత్యుత్సవాన్ని బారీగా చేయటానికి తలపెట్టింది. ఈ కార్యక్రమంలో జరుగనున్న సంగీతం, నాట్యం తుదిపోటీల్లో పాల్గొనటానికి అభ్యర్థులను అమెరికాలోని నాలుగు నగరాల్లో ప్రాంతీయ పోటీలను నిర్వహించి ఎంపిక చేసింది. ఆ నగరాల్లోని ఫోటోలు కొన్ని అందిస్తున్నాము. కాలిఫోర్నియా న్యూ జెర్సీ వర్జీనియా డాల్లస్

ఈ మాసం సిలికానాంధ్ర నవంబర్ 2017

ఈ మాసం సిలికానాంధ్ర
2017 అక్టోబర్ 7న న్యూజెర్సీ పట్టణంలో జరిగిన 'తెలుగు సాంస్కృతికోత్సవం' ఛాయాచిత్రాలను ఈ కింది లంకెలో చూడండి. https://bytegraph.smugmug.com/NJSiliconandhraOct2017/n-T8g5zX/

వీక్షణం సాహితీ సమావేశం-61

ఈ మాసం సిలికానాంధ్ర
రచన : అన్నే లెనిన్ అయిదేళ్ళు జయప్రదంగా పూర్తి చేసుకొని ఆరో ఏడాదిలోకి విజయవంతంగా అడుగుపెట్టిన బే ఏరియా సాహితీ వీక్షణం 61 వ సమావేశం మిల్పీటస్ లోని స్వాగత్ హోటల్ ప్రాంగణం లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కార్యాలయంలో అక్టోబరు 17 న జరిగింది. శ్రీ రావ్ తల్లాప్రగడ అధ్యక్షత వహించిన ఈ సమావేశాన్ని మొదట శ్రీ వేణు ఆసూరి తమ స్వాగత వచనాలతో ప్రారంభించారు. ఇకనుంచీ క్రమం తప్పకుండా ప్రతి సమావేశంలోనూ ఆధునిక సాహిత్యంతో పాటు, ప్రాచీన సంప్రదాయ సాహిత్యంపై కూడా ప్రత్యేక ప్రసంగాలు ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇవేళ్టి ‘కాళిదాసు కావ్య వైభవం’ అనే ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల ప్రసంగకర్త , వృత్తికి సాఫ్టువేర్ ఇంజనీరయినా సంస్కృత భాషాప్రచారానికి అంకితమైన శ్రీ విశ్వాస్ వాసుకి గారిని సభకు పరిచయం చేశారు. శ్రీ విశ్వాస్ గారు కాళిదాసు కావ్య ప్రాశస్త్యాన్ని వివరి

తెలుగు సాంస్కృతికోత్సవం 2017

ఈ మాసం సిలికానాంధ్ర
అక్టోబర్ 7న న్యూజెర్సీ నగరంలో విజయవంతంగా జరిగిన తెలుగు సాంస్కృతికోత్సవం పై ఒక ప్రేక్షకుడి అనుభూతి: నూట నలభై అక్షరాల్లో సంభాషణలు; మూడు నిమిషాల కంటే ఎక్కువగ దేని పైన దృష్టి పెట్టడం కష్టంగా వున్న ఈ రోజుల్లో; WhatsApp ఫార్వర్డ్లు; ఫేస్ బుక్ లైక్ ల మధ్య, అతి వేగంగా గడిచి పోతున్న కాలం ఇది. నిలకడగా వుండి, ఏ ఆర్భాటం లేకుండ, ఏ సెన్సేషన్ లేకుండ కేవలం మన సంస్కృతి,సాంప్రదాయం మరియు చరిత్ర ను గుర్తించి, గౌరవించాలన్న ఒకే ఒక ఉద్ధేశంతో ఒక కార్యక్రమం చెయ్యాలనుకోవడం గొప్ప ఆలోచన. ఆలోచన గొప్పగ వుంటే సరిపోదుకదా. దానిని అంతే గొప్పగా అమలుపర్చాలి. అందులోను, ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయాలి. అసలు ఇది సాధ్యమా? ఇలాంటి సాహసమే నిన్న సిలికాన్ ఆంధ్ర మనబడి వారు చేశారు, చేసి గెలిచారు, గెలిచి మెప్పించారు. ఆరు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో, జానపద గేయాలు, నృత్యాలు, మన పండగలైన ఉగాది నుండి ముస్లింలు జరపుకునే మొహ